Hindustan Zinc: 26 రూపాయల డివిడెండ్ ప్రకటించిన హిందుస్తాన్ జింక్ లిమిటెడ్
Hindustan Zinc dividend: హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ మంగళవారం ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ నాలుగో మధ్యంతర డివిడెండ్ (interim dividend) ను ప్రకటించింది.
Hindustan Zinc dividend: బిలియనీర్ అనిల్ అగర్వాల్ కు చెందిన హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ (Hindustan Zinc Ltd.,) ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ నాలుగో మధ్యంతర డివిడెండ్ (interim dividend) ను ప్రకటించింది.
Hindustan Zinc dividend: నాలుగో మధ్యంతర డివిడెండ్
ఇప్పటివరకు ఈ ఆర్థిక సంవత్సరంలో మూడుసార్లు ఈ సంస్థ (Hindustan Zinc Ltd.,) మధ్యంతర డివిడెండ్ (interim dividend) ను ప్రకటించింది. చివరగా, మార్చి 21న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం అనంతరం నాలుగో మధ్యంతర డివిడెంట్ ప్రకటన చేసింది. సంస్థ షేర్ హోల్డర్లకు ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 26 లను ఇంటరిమ్ డివిడెండ్ (interim dividend) గా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ డివిడెండ్ ద్వారా సంస్థ (Hindustan Zinc Ltd.,) షేర్ హోల్డర్లకు రూ. 10,985.83 కోట్లను సంస్థ చెల్లించనుంది. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరంలో, నాలుగు మధ్యంతర డివిడెండ్ల (interim dividends) ను కలుపుకుని మొత్తంగా రూ. 32 వేల కోట్లను తన మదుపర్లకు Hindustan Zinc Ltd., డివిడెండ్ గా అందించింది. ఈ డివిడెండ్ (interim dividend) చెల్లింపునకు రికార్డు డేట్ గా మార్చి 29వ తేదీని నిర్ణయించారు.
Hindustan Zinc dividend: మొత్తం రూ. 75.50
ఈ ఆర్థిక సంవత్సరం తన మదుపర్లపై హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ (Hindustan Zinc Ltd.,) డివిడెంట్ల వర్షం కురిపించింది. మొత్తంగా నాలుగు ఇంటరిమ్ డివిడెండ్లు (interim dividends) కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ షేర్ హోల్డర్లకు ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 70.50 డివిడెండ్ ను అందించింది. మొదట 2022 జులైలో రూ. 21 ని ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి డివిడెండ్ గా Hindustan Zinc Ltd అందించింది. ఆ తరువాత నవంబర్ 2022లో రూ. 15.50 లను రెండో మధ్యంతర డివిడెండ్ గా, అలాగే, జనవరి 2023లో రూ. 13 లకు మూడో మధ్యంతర డివిడెండ్ గా అందించింది. అంటే, తొలి మూడు మధ్యంతర డివిడెండ్లు కలుపుకుని ఒక్కో ఈక్విటీ షేర్ పై మదుపర్లకు రూ. 49.50 లభించాయి. తాజాగా, మార్చి 2023లో ప్రకటించిన నాలుగో మధ్యంతర డివిడెండ్ (interim dividend) రూ. 26 తో కలుపుకుని మదుపర్లకు ఈ ఆర్థిక సంవత్సరం లభించిన మొత్తం ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 75.50. ఈ డివిడెండ్ ద్వారా ఈ సంస్థలో 64.92% వాటా ఉన్న వేదాంత లిమిటెడ్ (Vedanta Ltd) కు అత్యధికంగా లబ్ధి చేకూరనుంది.
Hindustan Zinc dividend: వేదాంత లిమిటెడ్ అనుబంధ సంస్థ
హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ వేదాంత లిమిటెడ్ (Vedanta Ltd) కు అనుబంధ సంస్థ. ఇది జింక్, లెడ్, సిల్వర్ మైనింగ్ లో భారత్ లో అతిపెద్ద సంస్థ. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ( Q3FY23) హిందుస్తాన్ జింక్ సంస్థ రూ. 2,156 కోట్ల పన్ను అనంతర లాభాలను (PAT) సముపార్జించింది. మార్చి 21న ఎన్ఎస్ఈ (NSE) లో హిందుస్తాన్ జింక్ షేర్ విలువ రూ. 310.6 వద్ద ముగిసింది.