Jyotirlingalu: శివలింగం, జ్యోతిర్లింగం రెండూ ఒకటేనా? వీటిలో అత్యంత శక్తివంతమైనది ఏమిటి?-what is the difference between shiva lingam and jyotirlingam which one is powerful ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Jyotirlingalu: శివలింగం, జ్యోతిర్లింగం రెండూ ఒకటేనా? వీటిలో అత్యంత శక్తివంతమైనది ఏమిటి?

Jyotirlingalu: శివలింగం, జ్యోతిర్లింగం రెండూ ఒకటేనా? వీటిలో అత్యంత శక్తివంతమైనది ఏమిటి?

Gunti Soundarya HT Telugu
Aug 29, 2024 04:00 PM IST

Jyotirlingalu: శివాలయంలో నిత్యం పూజలు అందుకునేది శివలింగం. అలాగే జ్యోతిర్లింగ క్షేత్రాలలో పూజలు చేసేది శివలింగానికే. అయితే శివలింగం, జ్యోతిర్లింగం రెండూ ఒకటేనా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇవి రెండింటికీ మధ్య చాలా తేడా ఉంటుంది. ఈ రెండింటిలో ఏది శక్తివంతమైనదో తెలుసుకుందాం.

కాశీ విశ్వనాథుడి జ్యోతిర్లింగ క్షేత్రం
కాశీ విశ్వనాథుడి జ్యోతిర్లింగ క్షేత్రం

Jyotirlingalu: సృష్టి లయకారుడు పరమేశ్వరుడు. ఆది యోగి, అంతిమ తపస్వీ, సర్వ కరుణామయుడు, దైవ రక్షకుడిగా అందరూ నిత్యం కొలుస్తారు. భోళా శంకరుడి చిత్ర పటాలు పెట్టుకుని ఇంట్లో పూజిస్తారు. దేవాలయాలలో శివుడికి ప్రతిరూపంగా లింగ రూపంలో పూజలు అందుకుంటాడు. అలాగే శివుని రూపమైన నటరాజ్ విగ్రహానికి కూడా పూజలు చేస్తారు.

అందరూ శివుడిని శివలింగం రూపంలో పూజిస్తారు. ఇది శివుని ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. శివలింగం స్థూపాకార ఆకారంలో ఉంటుంది. గుండ్రని పైభాగంలో యోని అని పిలిచే వృత్తాకార పునాది ఉంటుంది. ఈ స్థూపాకార భాగం శివుడిని సూచిస్తుంది. శివలింగం పరమేశ్వరుడి రూపమని శివపురాణం చెబుతోంది. అయితే శివుని అత్యంత శక్తివంతమైన జ్యోతిలింగాలు ఉన్నాయి. శివలింగం, జ్యోతిర్లింగం రెండూ ఒకటేనా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అవి రెండూ ఒకటా లేదంటే వేర్వేరా అనే విషయం తెలుసుకుందాం.

శివలింగం అంటే ఏంటి?

శివలింగం అనంతం. అంటే దీనికి ఆది అంతం లేదని అర్థం. ఆలయాల్లో ఉండే శివలింగం మానవ నిర్మితాలు. ఈ శివలింగాలను అనేక పదార్థాలతో తయారు చేస్తారు. సంప్రదాయకంగా పాలరాయితో చేస్తారు. కానీ నేటి ప్రజలు లోహాలు, చెక్క లేదా మట్టితో తయారు చేయడం ప్రారంభించారు. శివలింగాలను తయారు చేసేందుకు ఉపయోగించే అత్యంత సాధారణ పదార్థం రాయి. ముఖ్యంగా నల్ల గ్రానైట్ లేదా పాలరాయి వినియోగిస్తారు. నియమ నిష్టలతో వీటిని తయారు చేసి ప్రతిష్ఠ చేస్తారు.

జ్యోతిర్లింగం అంటే ఏంటి?

జ్యోతి అంటే కాంతి, లింగం అంటే సంకేతం. జ్యోతిర్లింగం శివుని కాంతి. దీన్ని ఎవరూ సృష్టించలేరు. మానవ నిర్మితం కాదు. అందుకే జ్యోతిర్లింగాన్ని స్వయంభూ అని చెబుతారు. అంటే అది స్వయంగా ఉద్భవించింది. మనుషుల చేతులతో సృష్టించలేదు, రూపొందించలేదు. ఇది భగవంతుని శక్తితో రూపుదిద్దుకున్నదిగా భావిస్తారు. శివలింగం, జ్యోతిర్లింగం మధ్య చాలా తేడా ఉంటుంది. శివలింగం శివుని ప్రతీక. కానీ జ్యోతిర్లింగం మాత్రం శివుని శక్తికి నిదర్శనం. శివుడు జ్యోతిగా వెలిసిన క్షేత్రాలు ఇవి.

పన్నెండు జ్యోతిర్లింగాలు

భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇవి అత్యంత శక్తివంతమైనవి, పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు భారతదేశం అంతటా తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణం వరకు విస్తరించి ఉన్నాయి. గుజరాత్‌లో సోమనాథ్ జ్యోతిర్లింగం, ఆంధ్రప్రదేశ్‌లో మల్లికార్జున జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్‌లో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్‌లో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం, మహారాష్ట్రలోని భీమశంకర్ జ్యోతిర్లింగం, ఉత్తర ప్రదేశ్ లోని కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, ఝార్ఖండ్ లోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం, గుజరాత్‌లోని నాగేశ్వర్ జ్యోతిర్లింగ, తమిళనాడులోని రామేశ్వర్ జ్యోతిర్లింగ, మహారాష్ట్రలోని ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలు ఉన్నాయి.

అత్యంత శక్తివంతమైనది ఇదే

భారత్ లో ఉన్న మొత్తం జ్యోతిర్లింగాలలో అత్యంత శక్తివంతమైనది ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం. ఇది ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. పురాతన, అత్యంత పవిత్రమైన నగరాలలో ఉన్న కాశీ విశ్వనాథుడు విశ్వానికి అధిపతిగా చెబుతారు. అందుకే జీవితంలో మరణించేలోపు ఒక్కసారైనా కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటారు. అక్కడి గంగా నదిలో స్నానం చేయడం వల్ల గత పాపాల నుంచి ఆత్మను శుద్ధి చేయడమే కాకుండా మోక్షాన్ని పొందవచ్చని ప్రజలు నమ్ముతారు.