Temples in india: ఈ ఆలయాల్లోకి పురుషులకు అనుమతి లేదు-famous temples in india these temples not allowed men ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Temples In India: ఈ ఆలయాల్లోకి పురుషులకు అనుమతి లేదు

Temples in india: ఈ ఆలయాల్లోకి పురుషులకు అనుమతి లేదు

Gunti Soundarya HT Telugu

Temples in india: భారతదేశంలో కొన్ని ఆలయాల్లో పురుషులకి ప్రవేశం లేదు. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? ఇంతకీ ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా?

పురుషులకి ప్రవేశం లేని ఆలయాలు ఇవే(representational image) (pixabay)

Temples in india: మహిళలు ప్రవేశం లేని ఆలయాల గురించి చాలా మంది వినే ఉంటారు. గతంలో శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలసిందిగా సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. దేవాలయంలో అందరూ సమానమే. ఆడ, మగ అనే భేదం లేదని వాదించారు.

ప్రాచీన కాలం నుంచి వస్తున్న కొన్ని నియమాలు, సాంప్రదాయాలని ఇప్పటికీ అనేకులు పాటిస్తున్నారు. అనేక దేవాలయాల్లోకి స్త్రీలకు ప్రవేశం నిషేధించబడింది. కానీ ఇక్కడ మాత్రం పురుషులకి కొన్ని ఆలయాల్లో ప్రవేశం లేదు. అవి ఎక్కడో కాదు భారతదేశంలోనే ఉన్నాయి.

అట్టుకల్ భగవతి ఆలయం

కేరళలోని తిరువనంతపురంలోని అట్టుకల్ భగవతి దేవాలయం అట్టుకల్ పొంగళ పండుగకి ప్రసిద్ధి చెందింది. ఈ కార్యక్రమంలో లక్షలాది మంది మహిళలు ఈ గుడిలోని భగవతి అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి వస్తారు. అమ్మవారిని పూజించడం వల్ల సమృద్ధి, శ్రేయస్సు లాభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ పండుగ సందర్భంగా ఆలయం ప్రాంగణంలోకి పురుషులని అనుమతించరు. ఈ పవిత్రమైన ఆచారంలో స్త్రీలు మాత్రమే పాల్గొంటారు.

చక్కులతుకవు దేవాలయం

చక్కులతుకవు ఆలయం కూడా కేరళలోనే ఉంది. దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలో నారీ పూజ ప్రత్యేక కార్యక్రమం. అంటే స్త్రీలని పూజించడమని అర్థం. వార్షిక నారీ పూజ ఉత్సవంలో ఆలయం ప్రాంతంలోకి పురుషులు ప్రవేశించరు. ఇది మహిళలకి మాత్రమే సంబంధించినది. భారత్ నలుమూలల నుంచి మహిళలు ఇక్కడికి వస్తారు. ఇక్కడ పూజ చేస్తే అదృష్టం, ఆరోగ్యం లాభిస్తాయని నమ్ముతారు.

కామాఖ్య ఆలయం

భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటి కామాఖ్య ఆలయం. శివుడు భార్య సతీదేవి శరీరాన్ని విష్ణు సుదర్శన్ చక్రంతో ఖండించినప్పుడు ఆమె యోని భాగం ఇక్కడ పడిందని చెబుతారు. అస్సాంలోని గౌహతిలో నీలాచల్ కొండపై ఈ లయం ఉంది. రుతుక్రమంలో ఉన్న మహిళలు కూడా ఈ ఆలయానికి రావచ్చు. ప్రతి సంవత్సరం అంబుబాచి మేళా సమయంలో ఆలయం మూడు రోజుల పాటు మూసేసి ఉంచుతారు. ఆ సమయంలో పురుషులు ప్రవేశించడానికి అనుమతించరు.

కుమారి అమ్మన్ ఆలయం

తమిళనాడులోని కన్యాకుమారి ఆలయం పార్వతీ దేవి అవతారమైన కన్యాకుమారి దేవత కోసం ఈ ఆలయం. పెళ్ళైన పురుషులని దేవత ఉన్న గర్భగుడిలోకి అనుమతించరు. అక్కడ నేరుగా స్త్రీలు మాత్రమే అమ్మవారిని పూజిస్తారు. ఆలయ ద్వారం వరకు మాత్రం సన్యాసులు వచ్చి దర్శించుకోవచ్చు. వివాహిత పురుషులు ఆలయం సాంప్రదాయాలు పాటిస్తూ దూరంగా ఉండి పూజ చేసుకోవచ్చు.

బ్రహ్మ దేవాలయం

రాజస్థాన్ లోని పుష్కర్ లో బ్రహ్మఆలయం ఉంది. పురాణాల ప్రకారం వివాహిత పురుషులు ప్రవేశించడాన్ని నిషేధించారు. బ్రహ్మ దేవుడికి ఉన్న ఏకైక దేవాలయం ఇదే. బ్రహ్మ దేవుడు చేస్తున్న యజ్ఞానికి ఆయన సతీమణి సరస్వతీ దేవి ఆలస్యంగా వస్తుంది. దీంతో యజ్ఞం పూర్తి చేయడం కోసం బ్రహ్మ గాయత్రిని వివాహం చేసుకుంటాడు. దీంతో సరస్వతీ దేవి కోపంతో పెళ్ళైన పురుషులకి ఇక్కడ ప్రవేశం లేదని శపించినట్టు పురాణ కథ ఉంది. వివాహిత పురుషులు గర్భగుడిలోకి వస్తే వారి వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడుతుందని నమ్ముతారు.

సంతోషి మాత ఆలయం

రాజస్థాన్ లోని జోధ్ పూర్ నగరంలో ఉన్న సంతోషి మాత ఆలయంలో పురుషులని లోపలికి అనుమతించరు. ఇది సంతోషి దేవికి అంకితం చేయబడిన గుడి. భక్తుల జీవితాల్లో సంతృప్తి కలిగిస్తుందని నమ్ముతారు. అందుకే శుక్రవారాలు సంతోషిమాత రోజులని పిలుస్తారు. పురాణాల ప్రకారం శుక్రవారం రోజున ఈ ఆలయ శక్తి పెరుగుతుందని అంటారు. ఆనందం, శాంతిని కోరుకుంటూ సుదూర ప్రాంతాల నుంచి స్త్రీలు ఇక్కడికి వస్తారు. పురుషులని గర్భగుడిలోకి అనుమతించరు.