ఈ ఆలయాన్ని దర్శించుకున్నారంటే నాగదోషం తొలగిపోతుంది-by visiting this temple naga dosha will be removed ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ ఆలయాన్ని దర్శించుకున్నారంటే నాగదోషం తొలగిపోతుంది

ఈ ఆలయాన్ని దర్శించుకున్నారంటే నాగదోషం తొలగిపోతుంది

HT Telugu Desk HT Telugu
Jul 09, 2024 06:00 AM IST

నాగ దోషం, కాలసర్ప దోషం తొలగించుకోవాలని అనుకుంటే ఈ ఆలయంలో నాగప్రతిష్ట చేస్తే చాలా మంచిదని, దోషాలు తొలగిపోతాయని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

నాగదోషం తొలగించే ఆలయం
నాగదోషం తొలగించే ఆలయం (pinterest)

జ్యోతిష్యశాస్త్ర ప్ర‌కారం జాత‌కంలో నాగ దోషం, కాల‌స‌ర్ఫ దోషం, రాహు కేతు దోషాలు ఉన్న‌వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. రాహు గ్ర‌హం కుజ, బుధ‌, చంద్ర‌, శ‌ని వంటి వాటితో క‌లిసి దోషంగా ఏర్ప‌డినటువంటి వారికి ఆ దోష నివార‌ణ చేసుకోవ‌డం కోసం కొన్ని ముఖ్య క్షేత్రాలు ఉన్నాయ‌ని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త‌, పంచాంగ క‌ర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

అలాంటి ముఖ్య క్షేత్రాల్లో ఒకానొక క్షేత్రం క‌ర్ణాట‌క రాష్ట్రంలోని అశ్వత్థ నారాయణుడు కొలువై ఉన్న విదురాశ్వత్థ దేవాల‌య‌మని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. ఈ క్షేత్రంలో స్వామి వారిని ద‌ర్శించి పూజించి, నాగ ప్ర‌తిష్ట‌లు చేసి రాహు కేతు పూజ‌లు చేసిన వారికి నాగ‌దోషాలు తొల‌గుతాయ‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. నాగ దోషాలు ఉన్న‌వారికి సంతాన స‌మ‌స్య‌, కంటి స‌మ‌స్య‌, వైక‌ల్య స‌మ‌స్య‌, మాన‌సిక స‌మ‌స్య, వైవాహిక సమ‌స్య, కుటుంబ‌స‌మ‌స్య వంటి దోషాలు ఇబ్బంది పెడ‌తాయ‌ని ఇలాంటి దోషాలు తొల‌గిపోవ‌డానికి ఈ క్షేత్ర ద‌ర్శ‌నం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చిలకమర్తి తెలిపారు.

కర్ణాటక రాష్ట్రంలోని చిక్బళాపూర్ జిల్లాలో పినాకినీ నదీ తీరములో ఉన్న ఆలయాల్లో విదురాశ్వత్థ క్షేత్రం ఎంతో ప్రాచీన‌మైన‌ది. ద్వాపరయుగంలో విదురుడు తీర్థయాత్రలు చేస్తూ ఈ నదీతీరానికి వచ్చినపుడు ఇక్కడ నివాసితుడైన మైత్రేయ మహర్షి వద్ద శిష్యరికం చేశాడు. శ్రీ మ‌హా విష్ణువు కోసం పినాకినీ న‌దిలో వీరిద్ద‌రూ ఘోర త‌ప‌స్సు ఆచ‌రించారు.

ఆ స‌మ‌యంలో ఒక అశ్వత్థ చెట్టు కొమ్మ‌ నదిలో తేలుతూ వీరి వద్దకు రాగా మహర్షి సూచన మేరకు విదురుడు ఆ కొమ్మను ప్రతిష్ఠించగా అది వృక్షమై విదురాశ్వత్థముగా పిలవబడింది. ఇప్పటికీ ఆ వృక్షం మహావృక్షంగా భాసిల్లుతుంది. ఆ వృక్షము సమక్షంలోని క్షేత్రమే విదురాశ్వత్థ క్షేత్రం. ఈ వృక్షం వ‌ద్ద ఉన్న పుట్ట‌లోని నాగుల‌ను పూజించి.. ఇక్క‌డ నాగ ప్ర‌తిష్ఠ చేస్తే నాగ‌దోషం నివార‌ణ అవుతుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కమ‌ని పంచాంగకర్త చిల‌క‌మ‌ర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel