Pitru dosham: పితృ దోషం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఇవే- వాటి నుంచి బయటపడేందుకు ఇలా చేయండి
11 September 2024, 18:10 IST
- Pitru dosham: జాతకంలో పితృ దోషం ఉంటే జీవితంలో నిరంతరం అడ్డంకులు ఎదురావుతూనే ఉంటాయి. సంతానం కలగడంలో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. వాటి నుంచి బయట పడేందుకు పితృ పక్షం రోజుల్లో కొన్ని పరిహారాలు పాటించడం ఉత్తమం. పితృ దోషం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఏంటి? అనేవి తెలుసుకోవాలి.
పితృ దోషం లక్షణాలు
Pitru dosham: దేవుళ్ళను, దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి మనం ప్రతి రోజు పూజ చేసినట్లే పూర్వీకుల ఆశీర్వాదం పొందడానికి శ్రద్ధ, కర్మ, తర్పణం చేస్తారు. హిందూ మతంలో పూర్వీకులను దేవతలుగా భావిస్తారు.
లేటెస్ట్ ఫోటోలు
పూర్వీకులకు తర్పణం, పిండ దానం, శ్రాద్ధం సరిగ్గా చేయకపోతే కుటుంబం పితృ దోషంతో బాధపడుతుందని నమ్ముతారు. ఒక వ్యక్తి జన్మరాశిలో పితృ దోషం ఉంటే, అతని జీవితంలో అనేక రకాల సమస్యలు రావడం ప్రారంభమవుతాయని చెబుతారు. పితృ దోషం లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ దోషం ఉన్నప్పుడు వ్యక్తికి కనిపించే సంకేతాలు ఏంటో తెలుసుకుందాం.
పితృ దోషం లక్షణాలు
1.గ్రంధాల ప్రకారం ఒక వ్యక్తి పితృ దోషంతో బాధపడుతుంటే అతని వంశం ఎంత ప్రయత్నించినా ముందుకు సాగదు. అలాంటి వ్యక్తి సంతానం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. వారికి పుత్ర సంతానం కలగడం అనేది అసాధ్యంగా మారుతుంది.
2. ఇంట్లో రావి మొక్కను పెంచడం కూడా పితృ దోషం లక్షణంగా పరిగణిస్తారు. ఇంటి ప్రాంగణంలో రావి మొక్కను పెంచడం సరికాదు. అది కూడా విరిగిన కుండలలో రావి మొక్క పెరగడం చెడు సంకేతంగా పరిగణించబడుతుంది.
3. ఒక వ్యక్తి కష్టపడి పని చేసిన తర్వాత కూడా ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలను ఎదుర్కొంటే అది పితృ దోషానికి సంకేతంగా పరిగణిస్తారు. పితృ దోషం ఉంటే జీవితంలో పురోగతి ఉండదు.
4. పిల్లలు నిరంతరం అనారోగ్యానికి గురికావడం కూడా పితృ దోషం మరొక చిహ్నంగా భావిస్తారు.
5. ఎటువంటి కారణం లేకుండా కుటుంబ సభ్యుల మధ్య తరచుగా వివాదాలు రావడం కూడా ఈ దోషం ఉన్నది అనేందుకు సంకేతంగా భావించాలి.
6. జీవితంలో చిన్న చిన్న ప్రమాదాలు సర్వసాధారణం, కానీ ఈ ప్రమాదాలు ఎక్కువ సంఖ్యలో లేదా ఒకదాని తర్వాత ఒకటి జరిగితే అది పితృ దోషానికి సంకేతంగా పరిగణించాలి.
పితృ దోషం నుండి విముక్తి పొందే మార్గాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పితృ పక్షం సమయంలో వారి పేరు మీద ఆహారం, నీరు అందించాలి. పితృ దోషం నుండి ఉపశమనం పొందడానికి పితృ పక్షం సమయంలో పిండదానం, తర్పణం, పూర్వీకుల శ్రాద్ధం చేయాలి. పితృ పక్షం సమయంలో పూర్వీకుల పేరుతో దీపం వెలిగించాలి. పితృ పక్షం సమయంలో పూర్వీకులు భూమికి వచ్చి వారి వారసులకు దీవెనలు ప్రసాదిస్తారని నమ్ముతారు.
పితృ పక్షం ఎప్పటి నుంచి?
భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి పితృ పక్షం మొదలవుతుంది. పది హేను రోజుల పాటు కేవలం పితృ దేవతలను సంతోషపెట్టేందుకు అన్నీ ప్రయత్నాలు చేయాలి. వారి ఆశీర్వాదాలు పొందటం కోసం వారి పేరు మీద అన్నదానం చేయడం చాలా ఉత్తమం.
సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది. భాద్రపద అమావాస్యతో పితృపక్షం ముగుస్తుంది. దీన్నే సర్వపితృ అమావాస్య అంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో పూర్వీకులకు సంబంధించిన పనులు చేయడం వల్ల జీవితంలో సౌభాగ్యం లభిస్తుంది. ఈ 15 రోజులు తర్పణం, శ్రాద్ధం, కర్మ చేయడం వల్ల పితృ దేవతలకు సంతోషం కలుగుతుంది.
ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.
టాపిక్