తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Somavathi Amavasya: సోమవతి అమావాస్య నుంచి ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది

Somavathi amavasya: సోమవతి అమావాస్య నుంచి ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది

Gunti Soundarya HT Telugu

06 April 2024, 17:11 IST

google News
    • Somavathi amavasya: సోమవతి అమావాస్య ఏప్రిల్ 8వ తేదీ వచ్చింది. ఆరోజు నుంచి నాలుగు రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. చేపట్టిన అన్ని పనులు విజయవంతం కాబోతున్నాయి. 
సోమవతి అమావాస్య ఈ రాశుల వారికి అదృష్టం ఇవ్వబోతుంది
సోమవతి అమావాస్య ఈ రాశుల వారికి అదృష్టం ఇవ్వబోతుంది (freepik)

సోమవతి అమావాస్య ఈ రాశుల వారికి అదృష్టం ఇవ్వబోతుంది

Somavathi amavasya: హిందూమతంలో అమావాస్యకు ప్రాధాన్యత ఇస్తారు. ఏప్రిల్ 8వ తేదీ అమావాస్య సోమవారం వచ్చింది. దీంతో ఈరోజుని సోమవతి అమావాస్యగా పిలుస్తారు. సోమవతి అమావాస్య రోజు శివుడిని పూజించడం, గంగా స్నానం ఆచరించేందుకు, వంశపారపర్య దోషాలను తొలగించుకునేందుకు ఈరోజు ప్రత్యేకమైనదిగా భావిస్తారు.

సోమవతి అమావాస్య రోజు పవిత్ర నది స్నానమాచరిస్తే పూర్వీకుల ఆత్మకు శాంతి లభిస్తుంది. వారి ఆశీర్వాదాలు లభించి సంతోషం, అదృష్టం పెరుగుతుంది. సోమవతి అమావాస్య తిథి ఏప్రిల్ 8 తెల్లవారుజామున 3.11 గంటలకు ప్రారంభమై రాత్రి 11:50 గంటలకు ముగుస్తుంది.

సోమవతి అమావాస్య రోజు సూర్య గ్రహణం కూడా ఏర్పడుతుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న సంపూర్ణ సూర్యగ్రహణం ఇది. మీనరాశిలో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సోమవతి అమావాస్య, సూర్యగ్రహణం రెండూ కలిసి కొన్ని రాశుల వారికి బాధలను మిగల్చబోతున్నాయి. మరి కొంతమందికి మాత్రం అదృష్టం, ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి.

సోమవతి అమావాస్య రోజు చేయాల్సిన పనులు

ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆహారం, బూట్లు, చెప్పులు, గొడుగులు, బట్టలు వంటి వాటిని దానం చేయడం ముఖ్యం. గోమాతకు ఆహారం పెట్టాలి.

సోమవతి అమావాస్య రోజు పూర్వీకులకు నైవేద్యాలు సమర్పిస్తారు. ఉపవాసం ఉండటం వల్ల అదృష్టం, సంతోషం పొందుతారు. ఈరోజు పితృదేవతల ఆరాధనకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సంపద రెట్టింపు అవుతుంది.

అమావాస్య రోజు మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. అలాగే శివుడికి అభిషేకం చేయడం వల్ల సత్పర ఫలితాలు పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బు వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి. రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టుని పూజించడం వల్ల అనంతమైన ఫలాలు లభిస్తాయి.

ఈ సోమవతి అమావాస్య కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతుంది. దీని వల్ల ఏయే రాశుల వారికి అదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం.

వృషభ రాశి

సోమవతి అమావాస్య వృషభ రాశి జాతకులకు సంతోషాన్ని, అదృష్టాన్ని పెంచుతుంది. వృత్తిలో కొత్త విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ జీవితాన్ని భౌతిక సౌకర్యాలతో గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు.

కన్యా రాశి

సోమవతి అమావాస్యనాడు కన్యా రాశి వారికి శుభఫలితాలు కలుగుతాయి. వివాహంకుదిరే అవకాశాలు ఉన్నాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా ఇంక్రిమెంట్ లభిస్తాయి.

తులా రాశి

వ్యాపారాన్ని విస్తరించుకుంటారు. ధన ప్రవాహం పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీకు వారసత్వంగా ఆస్తి లభిస్తుంది. రాజకీయాల్లో రాణిస్తారు. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు.

కుంభ రాశి

సోమవతి అమావాస్య ప్రభావంతో కుంభ రాశి వారికి ధనానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కెరీర్ లో గొప్ప విజయాలను అందుకుంటారు. జీవితంలోని ప్రతి అంశంలో సానుకూల మార్పులు ఉంటాయి.

తదుపరి వ్యాసం