Amavasya: రేపే అమావాస్య.. ఈ పనులు పొరపాటున కూడా చేయకూడదు, దోషాలు పెరుగుతాయి
Amavasya: మాఘ మాసంలో వచ్చే చివరి అమావాస్య మార్చి 10వ తేదీ వచ్చింది. ఈరోజు కొన్ని పనులు చేయడం అశుభంగా పరిగణిస్తారు. ఎటువంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం.
Amavasya: మాఘ మాసంలో వచ్చే చివరి అమావాస్య మార్చి 10వ తేదీన వచ్చింది. మరుసటి రోజు నుంచి మాఘ మాసం పూర్తయి ఫాల్గుణ మాసం ప్రారంభం అవుతుంది. హిందూ మతంలో అమావాస్య రోజు పవిత్ర నదిలో స్నానం ఆచరించడం, దాన ధర్మాలు చేయడం వంటి వాటికి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈరోజు కొన్ని పనులు చేయడం వల్ల అనేక దోషాలు నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు
కొన్ని నమ్మకాల ప్రకారం అమావాస్య రోజున నిర్జన ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం మానుకోవాలి. అటువంటి ప్రదేశాలలో ఈరోజును ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. ఒంటరిగా వెళ్ళినప్పుడు ప్రతికూల శక్తులు మీపై ఆధిపత్యం చెలాయిస్తాయి. అందువల్ల ఈ సమయంలో ఒంటరిగా వెళ్లడం కరెక్ట్ కాదంటారు.
బయట భోజనం చేయకూడదు
మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ఎవరైనా తమ ఇంట్లోనే ఆహారాన్ని తినాలి. వేరొకరి ఇంట్లో భోజనం చేయడం వల్ల పుణ్యఫలాలు నశిస్తాయని నమ్మకం.
శుభకార్యాలు చేయకూడదు
కొన్ని నమ్మకాల ప్రకారం అమావాస్య రోజు కోపం తెచ్చుకోవడం, ఇతరులతో వాదించడం, పోట్లాడటం మానుకోవాలి. కొత్త బట్టలు కొనుగోలు చేయడం, ధరించడం వంటివి కూడా చేయకూడదు. ఎటువంటి శుభకార్యాలు నిర్వహించడానికి ఇది మంచి రోజు కాదు.
ఆర్థిక లావాదేవీలు వద్దు
కొందరి నమ్మకాల ప్రకారం అమావాస్య రోజు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయరు. ఇలా చేయడం వల్ల ధన నష్టం, ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉందని నమ్ముతారు.
గోళ్ళు, జుట్టు కత్తిరించకూడదు
అమావాస్య సమయంలో ప్రజల తమ గోళ్లు లేదా జుట్టును కత్తిరించకూడదు ఎందుకంటే పితృదోషం వల్ల వచ్చే భయంకరమైన దుష్ప్రభావాలకు గురవుతారు. జుట్టుని కడగకూడదని కూడా సలహా ఇస్తారు. ఇలా చేయడం వల్ల జాతకంలో అనేక సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు.
మద్యం, మాంసం ముట్టుకోరు
అమావాస్య సందర్భంగా మద్యం సేవించడం మాంసం తినడం అశుభం. నాన్ వెజ్ తినడం వల్ల మీ కుండలిపై ప్రతికూల ప్రభావం పెరుగుతుందని చెప్తారు. అది మాత్రమే కాకుండా శని గ్రహం వల్ల కలిగే బాధలు పెరుగుతాయి.
చీపురు కొనకూడదు
అమావాస్య రోజు పితృ దేవతలకు అంకితం చేసిన రోజుగా పరిగణిస్తారు. ఈరోజు శనిదేవుని ప్రత్యేకంగా పూజిస్తారు. శాస్త్రాల ప్రకారం చీపురు లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుంది. అమావాస్య రోజున చీపురు కొనడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభించదు. డబ్బు సమస్యలు తలెత్తుతాయి. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
తలకి నూనె రాయకూడదు
అమావాస్య సమయంలో తలకి నూనె రాసుకోకూడదు. ఈ రోజున నూనె దానం చేస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే నూనె శని దేవుడితో ముడిపడి ఉంటుంది. కుండలి నుండి శని దోషాలు తొలగించడంలో ఈ పరిహారం సహాయపడుతుంది.
పితృ దోషం తొలగించే పరిహారాలు
అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల పితృ దోషం, కాల సర్ప దోషం నుంచి విముక్తి పొందవచ్చు. శివుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. పితృ స్తోత్రం, పితృ కవచం పఠించాలి. బ్రాహ్మణులకు అన్నదానం చేయడం వల్ల పితృ దేవతలు సంతోషిస్తారు.