Saturn transit effect: 2024లో మాత్రమే కాదు 2025 లోనే శని చెడు కన్ను ఈ రాశుల మీద ఉంటుంది
Saturn transit effect: ఈ ఏడాది మొత్తం శని కుంభ రాశిలోనే సంచరిస్తాడు. అయితే ఈ సంవత్సరం మాత్రమే కాకుండా వచ్చే ఏడాది కూడా శని చెడు దృష్టి కొన్ని రాశుల వారి మీద ఉండనుంది.
Saturn transit effect: శని దేవుడు ఈ ఏడాది మొత్తం శని కుంభ రాశిలోనే సంచరిస్తాడు. ఫలితంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావం కొన్ని రాశుల మీద ఉంటుంది. వీటి ప్రభావంతో కొన్ని రాశుల వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ ఏడాది మాత్రమే కాకుండా వచ్చే ఏడాది కూడా శని ప్రభావం కొన్ని రాశుల మీద ఉండనుంది.
2025 జూన్ నెలలో శని కుంభ రాశిని వదిలి మీన రాశి ప్రవేశం చేస్తాడు. రాశి చక్రం మారడం వల్ల కొన్ని రాశులకు కొంత ఉపశమనం కలుగుతుంది. శని రాశి మార్పు వల్ల ఏలినాటి శని, అర్థాష్టమ శని ప్రభావాలు కొన్ని రాశుల నుంచి మరి కొన్ని రాశుల మీదకు మరలతాయి.
వచ్చే ఏడాది శని చెడు కన్ను ఈ రాశుల మీదే
2024లో ఏలిన నాటి శని ప్రభావం కుంభం, మకరం, మీన రాశి మీద ఉంటుంది. అదే సమయంలో అర్ధాష్టమ శని ప్రభావం కర్కాటకం, వృశ్చిక రాశి వారి మీద ఉంటుంది. 2025 లో మీన రాశిలో శని సంచారంతో మకర రాశి ప్రజలు శని సడే సతి నుంచి ఉపశమనం పొందుతారు. అదే సమయంలో మేష రాశి వారికి ఏలినాటి శని ప్రభావం మొదలవుతుంది. ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావం మొదటి దశ మీనరాశిలో, రెండవ దశ కుంభరాశిలో, చివరి దశ మకర రాశిలో జరుగుతుంది.
శని దేవుడు 2025 లో మీన రాశి ప్రవేశం చేస్తాడు. 2028 వరకు మీనంలో ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఏలినాటి శని ప్రభావం మేషంపై ఉంటుంది. దీని ప్రభావం మే 31, 2032 వరకు ఉంటుంది. కుంభ రాశి వారికి శని సడే సతి ప్రభావం 2027 వరకు ఉంటుంది.
ఏలినాటి శని, అర్థాష్టమ శని ప్రభావాల వల్ల ఒక వ్యక్తి అనేక కష్టాలు, సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. శని దేవుని దోషాలు ప్రతికూల ప్రభావాలు తగ్గించడం కోసం ఈ ప్రభావంతమైన మార్గాలు అనుసరించాలి. ఫలితంగా శని చెడు ప్రభావం తగ్గుతుంది.
శని దేవుడి పరిహారాలు
శని మంత్రం లేదా శని స్తోత్రం పఠించడం వల్ల మంచి జరుగుతుంది. ఇవి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అలాగే చెడు దుష్ప్రభావాలను తగ్గించడం కోసం ప్రతిరోజు భగవద్గీతను పఠించాలి.
శనివారం హనుమంతుడు, శివుడు, శనిదేవుడును పూజించాలి. హనుమాన్ చాలీసా, శివ చాలీసా, శని చాలీసాలను రోజు పఠించడం వల్ల కూడా ఈ ప్రభావాలు తగ్గించుకోవచ్చు.
దానాలు చేయాలి. శని కర్మతో సంబంధం కలిగి ఉన్నందున మీరు ఎటువంటి ఫలితం ఆశించకుండా ఇతరులకు అవసరంలో ఉన్నవారికి ఆహార పదార్థాలు, డబ్బు వంటివి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శని చెడు ప్రభావం కొంతవరకు తగ్గుతుంది. వృద్ధులు, పేదవాళ్లతో దురుసుగా ప్రవర్తించకూడదు. అవసరమైతే మీకు తోచినంత సహాయం వారికి చేయడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది.
నువ్వులు, ఆవాల నూనెతో దీపం వెలిగించాలి. శనివారం శని దేవుడికి అంకితమైన రోజు అందువల్ల శనివారాల్లో నల్లని వస్త్రాలు ధరించడం, నల్ల నువ్వులు, ఉసిరి, పప్పులు, ఇనుము వస్తువులు, దుప్పట్లు వంటివి దానం చేయడం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి. పేదలకు ఆహారం అందించాలి.
మద్యపానం, మాంసాహారానికి దూరంగా ఉన్నవారికి శని దేవుడు ఆశీస్సులు లభిస్తాయి. అలాగే మర్రి చెట్టుకి పాలు సమర్పించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు.
ప్రతి శనివారం హనుమంతుడిని ఆరాధించాలి. హనుమంతుడి అనుగ్రహం కోసం కోతులకు బెల్లం, నల్ల శనగలు పెట్టాలి. ఇలా చేయడం వల్ల అదృష్టం మీ వైపు ఉంటుంది.
ఏలినాటి శని బాధలతో ఉన్నవాళ్లు శనివారం పూట శమీ, రావి చెట్టును పూజించాలి. శని మహాదోషం, కష్టాలను తగ్గించడం కోసం ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం మంచిది. రావి చెట్టుకి నీళ్లు సమర్పించి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించాలి.