Lord Hanuman: హనుమంతుడి అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. సంపదపరంగా అదృష్టవంతులు-these four zodiac signs get lord hanuman blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  These Four Zodiac Signs Get Lord Hanuman Blessings

Lord Hanuman: హనుమంతుడి అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. సంపదపరంగా అదృష్టవంతులు

Gunti Soundarya HT Telugu
Feb 27, 2024 11:55 AM IST

Lord Hanuman: హనుమంతుడు ధైర్యం, మనోబలం ఇస్తాడు. ప్రతి ఒక్కరూ మంగళవారం ఆంజనేయ స్వామిని పూజిస్తారు. కొన్ని రాశుల వారికి హనుమాన్ ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఆ జాబితాలో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి.

హనుమంతుడికి ఇష్టమైన రాశులు ఇవే
హనుమంతుడికి ఇష్టమైన రాశులు ఇవే (pixabay)

Lord hanuman: హిందూ ధర్మ శాస్త్రంలో ఒక్కొక్క రోజు ఒక్కో దేవుడి పూజలు చేస్తూ ఉంటారు. సోమవారం శివారాధనకి అంకితం చేస్తే మంగళవారం హనుమంతుడుని పూజిస్తారు. మంగళవారం అంటే హనుమంతుడికి మహా ప్రీతి. ఆయన అనుగ్రహం కోసం ఈరోజు అనేక వస్తువుల సమర్పిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

సీతాదేవి వరంతో హనుమంతుడు అమరత్వం పొందాడు. ఆయన అనుగ్రహిస్తే మనుషుల కోరికలను నెరవేరుతాయి. హనుమంతుడి ఆశీస్సులు పొందిన వ్యక్తి జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాదు. హనుమంతుడిని మంగళవారం పూజించడం వెనుక ఒక కారణం కూడా ఉందని పండితులు చెబుతారు. శాస్త్రాల ప్రకారం ఆంజనేయుడు చైత్ర మాసం మొదటి రోజు జన్మించాడు. ఆరోజు మంగళవారం కావడం వల్ల విశేషమైనదిగా పరిగణిస్తారు. అందుకే మంగళవారం నాడు హనుమంతుడికి అంకితం చేస్తారు.

జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం పన్నెండు రాశులు ఉండగా కొన్ని రాశుల వారి మీద హనుమంతుడు ప్రత్యేక అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వారిని వెన్నంటే ఉండి రక్షిస్తాడు. ఏయే రాశుల వారికి ఆంజనేయుడు ఆశీస్సులు ఉన్నాయో చూద్దామా .

మేష రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారిపై హనుమంతుడి ప్రత్యేకమైన అనుగ్రహం ఉంటుంది. ఈ రాశి వారి సంకల్ప బలం చాలా ఎక్కువగా ఉంటుంది. డబ్బు పరంగా కూడా చాలా అదృష్టవంతులు. హనుమంతుని అనుగ్రహం పొందడం కోసం మేష రాశి వారు ప్రతి రోజు శ్రీరామ నామాన్ని జపించాలి.

సింహ రాశి

ఆంజనేయుడికి ఇష్టమైన మరొక రాశి సింహ రాశి. ఈ రాశి వారు హనుమాన్ అనుగ్రహంతో ప్రతి సంక్షోభానికి దూరంగా ఉంటారు. ఆర్థిక దృక్పథం కూడా బలంగా ఉంటుంది. హనుమంతుని అనుగ్రహంతో వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సింహ రాశి జాతకులు హనుమంతుడు ప్రత్యేక అనుగ్రహం పొందడం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా, షోడపచార స్తోత్రం పఠించాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారి మీద కూడా హనుమంతుడు ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. వీరిపై ఎప్పుడు కృప చూపిస్తాడు. ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు. వృశ్చిక రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి లభిస్తుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సీతారాములవారిని పూజించాలి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించాలి.

కుంభ రాశి

శని సొంత రాశి కుంభ రాశి వారి మీద హనుమంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మత విశ్వాసాల ప్రకారం కుంభ రాశి వారు ప్రతి పనిలో హనుమంతుని అనుగ్రహం వల్ల త్వరగా విజయం సాధిస్తారు. డబ్బు పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ధనానికి లోటు ఉండదు. హనుమంతుని ఆశీర్వాద బలంతో కుంభరాశి వారి కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు.

తమలపాకులతో పూజ

హనుమంతుడిని పూజించేటప్పుడు పూజలో తప్పని సరిగా తమలపాకు ఉండే విధంగా చూసుకోవాలి. తమలపాకు అంటే ఆంజనేయుడికి మహా ఇష్టం. వీటిని మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి సమర్పించడం వల్ల భక్తులు కోరిన కోరికలు తీరుతాయని, విజయాలు వరిస్తాయని నమ్ముతారు. కొంతమంది శనివారం రోజు కూడా హనుమంతుడికి తమలపాకులతో పూజ చేస్తారు. తమలపాకులతో పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలతో పాటు దుష్టశక్తుల నుంచి విడుదల లభిస్తుంది. కష్టాలు తొలగిపోతాయి.