Magha pournami 2024: మాఘ పౌర్ణమి రోజు జాతకంలోని గ్రహ దోషాలు తొలగించుకునేందుకు ఇవి దానం చేయండి-donate these to remove planetary malefics in magha pournami ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Magha Pournami 2024: మాఘ పౌర్ణమి రోజు జాతకంలోని గ్రహ దోషాలు తొలగించుకునేందుకు ఇవి దానం చేయండి

Magha pournami 2024: మాఘ పౌర్ణమి రోజు జాతకంలోని గ్రహ దోషాలు తొలగించుకునేందుకు ఇవి దానం చేయండి

Gunti Soundarya HT Telugu
Feb 24, 2024 09:51 AM IST

Magha pournami 2024: జాతకంలో గ్రహ దోషాలు ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని తొలగించుకునేందుకు మాఘ పౌర్ణమి రోజు ఈ వస్తువులు దానం చేస్తే శుభ ఫలితాలు పొందుతారు.

మాఘ పౌర్ణమి రోజు గ్రహదోషాలు తొలగించే పరిహారాలు
మాఘ పౌర్ణమి రోజు గ్రహదోషాలు తొలగించే పరిహారాలు (Freepik)

Magha pournami 2024: హిందూమతంలో పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. పౌర్ణమి రోజున పవిత్ర నదిలో స్నానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఫిబ్రవరి 24న మాఘ పౌర్ణమి జరుపుకుంటారు. పౌర్ణమి రోజు దేవతలు భూమిపైకి వస్తారని నమ్ముతారు. అందుకే ఈరోజు గంగా నదీ స్నానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది.

ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమికి ఒక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని మాఘి పౌర్ణిమ లేదా మాఘ పౌర్ణమి అంటారు. లక్ష్మీదేవి, విష్ణుమూర్తిని పూజించేటప్పుడు కనకధార స్త్రోత్రం, విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఖీర్ తో పాటు అలంకరణ వస్తువులు పూజలో సమర్పించాలి. సంపద, శ్రేయస్సు కోసం తామర పూలు, గులాబీ పూలని అమ్మవారికి సమర్పించాలి.

శాస్త్రాల ప్రకారం ఈరోజు చంద్రదేవుడు తన 16 కళలని చూపిస్తూ, భూమిపై అమృతాన్ని కురిపిస్తాడని నమ్ముతారు. ఇప్పటినుంచి ఖచ్చితంగా నెల రోజుల తర్వాత హోలీ పండుగ వస్తుంది. పౌర్ణమి రోజు గ్రహాలను శాంతింప చేయడానికి, జాతకంలో గ్రహాల స్థితి బలపరిచేందుకు కొన్ని పరిహారాలు పాటిస్తే మంచిది.

సూర్యుడు

గ్రహాల రారాజు సూర్యుడు అనుగ్రహం కోసం మీరు పౌర్ణమి రోజు బెల్లం గోధుమలు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. రాగి సూర్యుడి ప్రతిమని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటే మంచిది.

చంద్రుడు

చంద్రుడు అనుగ్రహం కోసం చక్కెర, బియ్యం, పాలు దానం చేస్తే దోషాలు తొలగిపోతాయి.

కుజుడు

అన్ని గ్రహాలకి అధిపతి అంగారకుడుగా భావిస్తారు. కుజుడు స్థానం బలపరుచుకునేందుకు పప్పు దినుసులు, బెల్లం దానం చేయాలి.

బుధుడు

గ్రహాల రాకుమారుడు బుధుడు అనుగ్రహం కోసం ఉసిరి, ఆకుపచ్చ కూరగాయలు దానం చేయాలి.

బృహస్పతి

దేవగురువు బృహస్పతి స్థానం మీ జాతకంలో బలంగా ఉండాలంటే అరటి, మొక్కజొన్న, శనగలు దానం చేస్తే మంచిది.

శుక్రుడు

శుభాలని ఇచ్చేసి శుక్రుడు కోసం నెయ్యి, వెన్న, తెల్ల నువ్వులు వంటి తెల్లటి వస్తువులు దానం చేయడం వల్ల సంపద పెరుగుతుంది.

శని

శనీశ్వరుడు అనుగ్రహం కోసం నల్ల నువ్వులు, ఆవనూనె శనివారం పూట దానం చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. రాహు, కేతువులని శాంతిపరచడం కోసం దుప్పట్లు, టవల్స్, ఆహార పదార్థాలు దానం చేయాలి.

మాఘ పౌర్ణమి రోజు గంగా నదీ స్థానం ఆచరించి దానం చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది. విష్ణువు గంగా నదిలో కొలువై ఉంటాడని ప్రతీతి. అందుకే పవిత్ర నది స్నానం భక్తుడికి శుభ ఫలితాలు కలిగిస్తుంది. అలాగే చంద్ర దేవుడిని లక్ష్మీదేవిని క్రమ పద్ధతిలో పూజించాలి. పచ్చి పాలను పవిత్ర నీటిలో కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల చంద్ర దేవుని అనుగ్రహాన్ని పొందుతారు. మానసిక ఆనందం, ప్రశాంతత లభిస్తుంది. సూర్యచంద్రుల దోషాలు నుండి విముక్తి కలగాలంటే పవిత్ర నది స్నానం ఆచరించడం విష్ణువును పూజించడం, దానం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. అదృష్టం, సంతానం కలుగుతుంది

WhatsApp channel