కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Jan 28, 2024

Hindustan Times
Telugu

నెయ్యి కాఫీ ఇటీవల బాగా పాపులర్ అవుతోంది. దీన్ని ఘీ కాఫీ, బుల్లెట్‍ప్రూఫ్ కాఫీ అని కూడా అంటారు. ఈ ఘీ కాఫీని చాలా మంది సెలెబ్రెటీలు కూడా తాగుతుండటంతో పాపులర్ అయింది.

Photo: Unsplash

నెయ్యి కాఫీ (ఘీ కాఫీ) తాగడం వల్ల ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ఉదయాన్నే నెయ్యి కలిపిన కాఫీ తాగితే శరీరానికి పోషకాలు అందడం, బరువు తగ్గడం సహా మరిన్ని బెనెఫిట్స్ ఉంటాయి. 

Photo: Unsplash

ముందుగా సాధారణంగా కాఫీ తయారు చేసుకోవాలి. ఓ గ్లాసు కాఫీలో ఓ స్పూన్ దేశీ నెయ్యి వేసుకొని మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీది నుంచి దించేసుకొని నెయ్యి కాఫీ తాగొచ్చు. ఇంకా బాగా కలవాలంటే బ్లెండ్ కూడా చేసుకోవచ్చు.

Photo: Unsplash

ఎలా తయారు చేసుకోవాలి?

Photo: Unsplash

నెయ్యిలో ఒమెగా 3, 6, 9 లాంటి ఆరోగ్యకరమైన కొవ్వులు (హెల్దీ ఫ్యాట్) ఉంటాయి. అందుకే కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే శరీరంలో హెల్దీ ఫ్యాట్ పెరుగుతుంది. జీవక్రియ మెరుగవుతుంది.

Photo: Unsplash

నెయ్యి కాఫీ ఉదయాన్నే తాగడం వల్ల కడుపు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అసిడిటీ సమస్యలు తగ్గడంతో పాటు జీర్ణక్రియ మెరుగ్గా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది.

Photo: Unsplash

ఘీ కాఫీ తాగడం వల్ల శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది. మూడ్ కూడా మెరుగ్గా ఉంటుంది.

Photo: Unsplash

నెయ్యిలో విటమిన్ ఏ,ఈ,కే లాంటి విటమిన్లు ఉంటాయి. దీంతో నెయ్యి కాఫీ తాగడం వల్ల ఇవి శరీరానికి అందుతాయి. అలాగే, శరీరానికి వెచ్చదనాన్ని కూడా ఈ కాఫీ కలిగిస్తుంది.

Photo: Unsplash

నెయ్యి కలిపిన కాఫీ తాగడం బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన ఫ్యాట్ అందించడం, తరచూ ఆకలి కాకుండా ఈ కాఫీ చేయగలదు.

Photo: Unsplash

ఎముకలను బలంగా ఉంచుకునేందుకు మంచి ఆహారాలు తీసుకోవాలి. బలమైన ఎముకల కోసం అనేక ఆహార మార్పులు ఉన్నాయి.

Unsplash