Daridra yogam: దరిద్ర యోగం తీసుకురాబోతున్న బుధుడు.. ఆర్థిక కష్టాలు, వైవాహిక జీవితంలో గొడవలు
Daridra yogam: గ్రహాల రాకుమారుడు బుధుడు మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు అశుభకరమైన యోగం సృష్టించబోతున్నాడు. దీని వల్ల ఆర్థిక కష్టాలు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురుకాబోతున్నాయి.
Daridra yogam: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత అశుభకరమైన యోగం దరిద్ర యోగం. దీని వల్ల పేదరికం అనుభవించాల్సి వస్తుంది. ఈ యోగాన్ని నిర్ధాంత యోగం అని కూడా అంటారు. జాతకంలో ఈ యోగం ఉంటే ధన నష్టం జరుగుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్ళినప్పుడు గ్రహాల కలయిక జరుగుతుంది. అటువంటి సమయంలో అనేక శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. అవి మానవుల జీవితం మీద ప్రభావితం చూపిస్తాయి. అలా ఏర్పడుతున్న యోగమే ఈ దరిద్ర యోగం. ఇది జీవితాన్ని తలకిందులు చేస్తుంది. సమస్యలు తెచ్చి పెడుతుంది.
ప్రస్తుతం గ్రహాల రాకుమారుడు బుధుడు తన బలహీనమైన రాశి మీన రాశిలోకి ఏప్రిల్ 9న వెళ్లబోతున్నాడు. దీనివల్ల దరిద్ర యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ప్రభావంతో మూడు రాశుల వాళ్ళు కఠినమైన సమయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో గొడవలు, వివాదాలు, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. వైవాహిక జీవితం నరకంగా మారుతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండదు.
దరిద్ర యోగం ఏర్పడటం వల్ల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. కెరీర్ లో ఆశించిన అవకాశాలు మీరు పొందలేకపోతారు. విజయం అనేది మీ దరిదాపుల్లో కూడా కనిపించదు. సౌకర్యవంతమైన జీవితం కాకుండా పేదరికంలో గడపాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో తోబుట్టువులతో, స్నేహితులతో వివాదాలు, వాదనలతో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. మనసు తీవ్ర గందరగోళంతో నిండిపోతుంది. దరిద్ర యోగం వల్ల ఈ మూడు రాశుల వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటారు.
మిథున రాశి
మిథున రాశి వారికి దరిద్ర యోగం దురదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో మీరు కెరీర్ లో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాదాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. తండ్రి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ రాశి వారికి నీచభంగ్ రాజయోగం ఉండటం వల్ల సంపదకు ఇబ్బంది ఉండదు. కానీ ఆరోగ్య సమస్యలు మరింత దిగజారతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల తీవ్రంగా నష్టపోతారు.
కన్యా రాశి
దరిద్రయోగం కన్యా రాశి వారికి చెడ్డ రోజులు తీసుకొచ్చి పెడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. మీరు కోరుకున్నట్టుగా సహోద్యోగులు, సీనియర్ల నుంచి మద్దతు లభించుకోవచ్చు. శారీరకంగా గాయపడే అవకాశాలు ఉన్నాయి .ఈ సమయంలో ఎటువంటి కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. మాట తీరుతో ఇతరుల మనసు గాయపరుస్తారు. అందుకే మాటలు నియంత్రణలో ఉంచుకోవాలి. ఏదైనా పని మొదలు పెడితే ఆది నుంచి ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి బుధుడు బలహీన స్థానంలో ఉండటంవల్ల వైవాహిక జీవితంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతాయి. వృత్తి జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామి ఆరోగ్యం మరింత దిగజారుతుంది. కాళ్లు లేదా చర్మానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. ఎవరికి ఈ సమయంలో అప్పు ఇవ్వద్దు. లేదంటే మీరు డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. జీవితంలో అనుకోని సంఘటనలు మీ మనసుని కలవరపెడతాయి.