Mercury jupiter conjunction: 12 ఏళ్ల తర్వాత కలుసుకుంటున్న బుధుడు, బృహస్పతి.. ఈ రాశుల వారికి డబుల్ లక్
Mercury jupiter conjunction: 12 సంవత్సరాల తర్వాత బుధుడు బృహస్పతి కలయిక జరగబోతుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి అనేక ప్రయోజనాలు లభించనున్నాయి. అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి.
Mercury jupiter conjunction: మరికొద్ది రోజుల్లో గ్రహాల రాకుమారుడు బుధుడు రాశి చక్రం మారబోతున్నాడు. ప్రస్తుతం మీన రాశిలో ఉన్న బుధుడు హోలీ తర్వాత మేష రాశిలో ప్రవేశించబోతున్నాడు. బుధుడు ప్రవేశించిన వెంటనే మేష రాశిలో బుధ, గురు కలయిక ఏర్పడుతుంది.
దాదాపు 12 సంవత్సరాల తర్వాత మేష రాశిలో ఈ కలయిక జరుగుతుంది. బుధుడు తెలివితేటలు, విచక్షణ, మేధస్సు వంటి వాటికి కారకుడు. మార్చి 26న మేషరాశిలో ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల ఏ రాశి వారికి అదృష్టం ప్రకాశిస్తుందో చూద్దాం.
సింహ రాశి
బృహస్పతి, బుధుల కలయిక సింహరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రశంసలకు లభిస్తాయి. వ్యాపారులకు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు కానీ వాటిని భాగస్వామి మద్దతుతో సులభంగా పరిష్కరించుకుంటారు. ధైర్యంగా ముందుకు సాగితే విజయం మీ పాదాల చెంతకు చేరుతుంది.
ధనుస్సు రాశి
గురు, బుధుల కలయిక ధనుస్సు రాశి వారికి శుభప్రదంగా ఉండనుంది. ఈ రెండు గ్రహాల శుభ ప్రభావంతో ఆగిపోయిన పనులన్నీ చక్కబెడతారు. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఈ సమయం కలిసొస్తుంది. సంపద పొందుతారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
కర్కాటక రాశి
రెండు గ్రహాల కలయిక కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కార్యాలయంలో మీ స్నేహితులు, ఉన్నతాధికారుల మద్దతు మీకు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. కొత్త పెట్టుబడి ఎంపిక గురించి ఆలోచిస్తారు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ మూడు రాశులకు సమస్యలు
మార్చి 26న మేష రాశిలో ప్రవేశించిన బుధుడు ఏప్రిల్ 2న తిరోగమన దశలో సంచరిస్తాడు. ఏప్రిల్ 9 వరకు ఈ దశలోనే ఉంటాడు. అనంతరం మళ్లీ ప్రత్యక్ష మార్గంలో సంచరిస్తాడు. బుధుడి సంచారం వల్ల మూడు రాశుల వారిని సమస్యలు పలకరించబోతున్నాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి. బుధ గ్రహంతో శుక్రుడికి స్నేహపూర్వక సంబంధం ఉంది. ఫలితంగా ఈ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. మీ ఖర్చులు ఆకస్మికంగా పెరగడం వల్ల ఆందోళన చెందుతారు. ఆర్థిక స్థితి బలహీనపడుతుంది. కుటుంబ సభ్యుల వైద్యం కోసం డబ్బు ఖర్చు పెడతారు. వైవాహిక జీవితంలో సవాళ్లు తలెత్తుతాయి. ఫలితంగా భాగస్వామితో తాత్కాలికంగా విడిపోయే పరిస్థితి వస్తుంది. ఇతరులతో విభేదాలకు దూరంగా ఉండాలి.
కన్యా రాశి
బుధుడు కన్యా రాశికి అధిపతి. అయినప్పటికీ బుధుడి సంచారం పట్ల కన్యా రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పెడుతుంది. వృత్తిపరమైన రంగంలో సవాళ్లు ఎదురవుతాయి. విజయం వరించాలంటే విశేషమైన కృషి చేయాలి. ఆర్థిక నష్టాలను నివారించుకోవడం కోసం కొత్త పెట్టుబడుల పట్ల జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశికి కుజుడు అధిపతి. బుధుడి సంచారం వల్ల వృశ్చిక రాశి వారు ప్రతికూలమైన ఫలితాలను పొందుతారు. శారీరకంగా అసౌకర్యంగా ఉంటారు. చర్మసంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతో గొడవలకు దిగడం మంచిది కాదు.