Saturn retrograde: శని తిరోగమనం వల్ల వచ్చే కష్టాల నుంచి విముక్తి పొందాలంటే ఈ పరిహారం పాటించండి
Saturn retrograde effect: శని ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. జూన్ లో శని తిరోగమన దిశలో ప్రయాణించబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురుకాబోతున్నాయి.
Saturn retrograde effect: కొత్త సంవత్సరంలో అనేక గ్రహాలు రాశి చక్రాలు మార్చుకుంటూ ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం వరించబోతుంది. హిందూజ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, గ్రహాల తిరోగమనం అన్ని రాశుల మీద ప్రభావం చూపుతాయి. ఈ ఏడాది శని గ్రహం కుంభ రాశిలో సంచరిస్తుంది.
కర్మఫల దాతగా శని గ్రహాన్ని పరిగణిస్తారు. మనుషులు చేసే మంచి, చెడు పనుల ఆధారంగా శని దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. గురు గ్రహం తర్వాత శని అతి పెద్ద గ్రహంగా భావిస్తారు. రెండున్నర సంవత్సరాలకి ఒకసారి శని రాశి మారుతూ ఉంటుంది. ప్రస్తుతం శని కుంభ రాశిలో సంచరిస్తోంది. 2024 సంవత్సరం మొత్తం ఈ రాశిలోనే ఉంటుంది.
కానీ మూడు సార్లు తన స్థానం మార్చుకుంటుంది. జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం 2024, జూన్ 29 న శని గ్రహం కుంభ రాశిలో తిరోగమనం చేస్తుంది. ఈ తిరోగమనం వల్ల కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం పడనుంది. శని గ్రహ ప్రతికూల ప్రభావం నుంచి తప్పించుకునేందుకు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
శని తిరోగమనం ఏ రాశిపై ఎలా ఉండనుంది?
శని తిరోగమనం వల్ల మేషం, సింహం, వృశ్చిక రాశుల వారిపై ప్రతికూల ప్రభావం ఉండనుంది. ఫలితంగా ఈ రాశుల వారికి అనేక సమస్యలు, సవాళ్ళు ఎదురుకానున్నాయి. ఏదైనా పని తలపెడితే అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఈ రాశుల వాళ్ళు శని అనుగ్రహం పొందేందుకు ప్రయత్నించాలి.
ఈ ఏడాది ఈ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి. తిరోగమనం సానుకూలంగా ఉంటే వారికి ప్రయోజనాలు చేకూరతాయి. అదే శని తిరోగమనం ప్రతికూలంగా ఉంటే మాత్రం ఇబ్బందులు, సమస్యలు తలెత్తుతాయి. నవంబర్ 15 వరకు శని గ్రహం కుంభ రాశిలో తిరోగమన దిశలోనే ప్రయాణిస్తుంది. అప్పటి వరకు ఈ మూడు రాశుల వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
శని తిరోగమన ప్రభావం తగ్గించే నివారణ
శని తిరోగమనం ప్రతికూలంగా ఉంటే ఈ నివారణలు పాటించాల్సిందిగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ నివారణ చేపట్టేందుకు జన్మ నక్షత్రంలో శని స్థానం బలంగా ఉందా లేదంటే బలహీనంగా ఉందనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం.
శని వ్యతిరేక దిశ వల్ల ఇబ్బందులు పడే రాశుల వాళ్ళు దాని ప్రభావం తగ్గించుకునేందుకు ఎనిమిది వంకాయలు కోణాళి. వాటిని దగ్గరలో ఉన్న దేవాలయాల్లో దానం చేయడం మంచిది. అయితే ఆ వంకాయలు ఆలయ పూజారికి మాత్రమే ఇవ్వాలి. శని తిరోగమనం ఎంత బలంగా ఉన్న ఈ పరిహారం పాటించడం వల్ల మంచి ఫలితం పొందవచ్చని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. శని గ్రహ తిరోగమనం వల్ల ఇబ్బందులు పడుతున్న ఎవరైనా ఈ పరిహారం పాటించవచ్చు.