తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Navaratrulu 2024: నవరాత్రుల్లో డోలిపై దుర్గామాత రాక.. విపత్తు సూచన

Navaratrulu 2024: నవరాత్రుల్లో డోలిపై దుర్గామాత రాక.. విపత్తు సూచన

Galeti Rajendra HT Telugu

26 September 2024, 14:46 IST

google News
  • Shardiya Navratri: ఏటా  చైత్ర నవరాత్రులు, శారదీయ నవరాత్రులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది దుర్గామాత అమ్మవారు హస్తా నక్షత్రంలో కొలువుదీరనున్నారు. దుర్గామాత రాక, నిష్క్రమణ గురించి ఇక్కడ  తెలుసుకోండి

హస్తా నక్షత్రంలోకి దుర్గాదేవి అమ్మవారు
హస్తా నక్షత్రంలోకి దుర్గాదేవి అమ్మవారు

హస్తా నక్షత్రంలోకి దుర్గాదేవి అమ్మవారు

Shardiya Navratri 2024: ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 3న ప్రారంభమై 11న ముగుస్తాయి. 12వ తేదీ దసరా పండగ. కాబట్టి.. 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ ఏడాది శారదీయ నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి అమ్మవారు హస్తా నక్షత్రంలోకి రానున్నారు.

లేటెస్ట్ ఫోటోలు

Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు గెస్ట్‌గా వెంక‌టేష్ - సంక్రాంతి సంద‌డి ముందుగానే!

Dec 21, 2024, 07:46 PM

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

Ananya Nagalla: ష‌ర్మిల‌మ్మ కొడుకు డిటెక్టివ్ అయితే - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌పై అన‌న్య నాగ‌ళ్ల కామెంట్స్‌!

Dec 21, 2024, 04:13 PM

Ram Charan: నా సోలో సినిమా వచ్చి నాలుగేళ్లపైనే అయింది.. గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం: డల్లాస్‍లో రామ్‍చరణ్

Dec 21, 2024, 02:59 PM

Anupama Parameswaran: బాధితురాలిగా అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ రూమ్ డ్రామా.. సూపర్ స్టార్‌తో కొత్త మూవీ (ఫొటోలు)

Dec 21, 2024, 01:36 PM

Cake Healthy or Unhealthy : హలో గురూ.. లొట్టలేసుకుంటూ కేక్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

Dec 21, 2024, 01:23 PM

జ్యోతిష్య శాస్త్రంలో హస్తా నక్షత్రాన్ని శుభసూచకాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ నక్షత్రంలో చేసే పని శుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ఈ ఏడాది దుర్గా మాత అమ్మవారు డోలిపై రాబోతున్నారు.

కలశ స్థాపనకు శుభ సమయం

కలశ స్థాపన లేదా ఘట స్థాపన నవరాత్రులలో మొదటి రోజున నిర్వహిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 3న కలశ ప్రతిష్టాపన జరగనుంది. పండిట్ సౌరభ్ కుమార్ మిశ్రా ప్రకారం, అక్టోబర్ 3న రోజంతా కలశ స్థాపన చేయవచ్చు. కానీ.. అమృత ముహూర్తం ఉదయం 07.16 నుండి 08.42 గంటల వరకు ఉంటుంది.

అభిజిత్ ముహూర్తం ఉదయం 11.12 నుంచి 11.58 వరకు ఉంటుంది. ఆ సమయంలో కలశ ప్రతిష్టాపన చాలా ఫలవంతంగా ఉంటుంది. కలశ స్థాపన ఎల్లప్పుడూ ఈశాన్య మూలలోనే చేయాలి.

అమ్మవారి రాక, నిష్క్రమణ ప్రాముఖ్యత

నవరాత్రులు గురువారం (అక్టోబరు 3) ప్రారంభం కానుండటంతో దుర్గామాత అమ్మవారి రాక ప్రయాణం డోలిపై ఉంటుంది. ఇది బాధలు లేదా వినాశనానికి కారకంగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుర్గా మాత డోలీకి వచ్చిన సంవత్సరంలో దేశంలో రోగాలు, దుఃఖం, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అలానే అమ్మవారి నిష్క్రమణ కూడా చరణాయుధం మీద ఉంటుంది. ఇది శుభప్రదంగా కాదు.. విపత్తును సూచిస్తుంది.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం