తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Transit: నవరాత్రుల్లో మొదటి రోజే శతాభిష నక్షత్రంలోకి శని.. ఏ రాశుల వారికి కలిసొస్తుందంటే?

Saturn Transit: నవరాత్రుల్లో మొదటి రోజే శతాభిష నక్షత్రంలోకి శని.. ఏ రాశుల వారికి కలిసొస్తుందంటే?

Galeti Rajendra HT Telugu

26 September 2024, 12:07 IST

google News
  • Saturn Transit 2024: నవరాత్రుల మొదటి రోజునే శని తన నక్షత్రాన్ని మార్చుకుంటున్నాడు. దాంతో కొన్ని రాశుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.  ఆ రాశులు ఏవో ఇక్కడ తెలుసుకుందాం. 

శతాభిష నక్షత్రంలోకి శని
శతాభిష నక్షత్రంలోకి శని

శతాభిష నక్షత్రంలోకి శని

Shani: గ్రహాలకు అధిపతి శని. ఆ శని ఎప్పటికప్పుడు తన రాశినే కాదు నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. ప్రస్తుతం కుంభ రాశిలో శని సంచరిస్తూ.. పూర్వ భాద్రపద నక్షత్రంలో ఉన్నాడు.

లేటెస్ట్ ఫోటోలు

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

Ananya Nagalla: ష‌ర్మిల‌మ్మ కొడుకు డిటెక్టివ్ అయితే - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌పై అన‌న్య నాగ‌ళ్ల కామెంట్స్‌!

Dec 21, 2024, 04:13 PM

Ram Charan: నా సోలో సినిమా వచ్చి నాలుగేళ్లపైనే అయింది.. గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం: డల్లాస్‍లో రామ్‍చరణ్

Dec 21, 2024, 02:59 PM

Anupama Parameswaran: బాధితురాలిగా అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ రూమ్ డ్రామా.. సూపర్ స్టార్‌తో కొత్త మూవీ (ఫొటోలు)

Dec 21, 2024, 01:36 PM

Cake Healthy or Unhealthy : హలో గురూ.. లొట్టలేసుకుంటూ కేక్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

Dec 21, 2024, 01:23 PM

పార్లమెంట్​ ఉన్నది కొట్టుకోవడానికే! కిందపడేసి కొట్టి, చంప చెళ్లుమనిపించి..

Dec 21, 2024, 01:04 PM

అక్టోబర్‌లో శని తన నక్షత్ర మండలాన్ని మార్చుకుంటాడు. శనిగ్రహం నక్షత్ర పరివర్తన అక్టోబర్ 3, 2024న (గురువారం) జరుగుతుంది. ఆ రోజు శతాభిష నక్షత్రంలోకి శని ప్రవేశిస్తాడు. అదే రోజు శారదీయ నవరాత్రులలో మొదటి రోజు.

నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రి అమ్మవారిగా ప్రతిష్ఠించి పూజించే ఆచారం ఉంటుంది. నవరాత్రులలో శని నక్షత్రం మార్పు జ్యోతిష పరంగా చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ ప్రారంభమై అక్టోబర్11వ తేదీ ముగుస్తాయి. మరుసటి రోజు అంటే అక్టోబరు 12న దసరా పండగ జరుపుకుంటారు.

శని సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు లభిస్తాయి. పంచాంగం ప్రకారం శని అక్టోబర్ 3న మధ్యాహ్నం 12:10 గంటలకు శతాభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ నక్షత్రంలోనే ఈ ఏడాది డిసెంబరు 27 (శుక్రవారం) రాత్రి 10:42 గంటల వరకు ఉంటాడు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శతాభిష నక్షత్రానికి అధిపతి రాహువు. ఈ రాహువు నీడ గ్రహం మాత్రమే కాదు చెడు చేసే గ్రహం కూడా. అటువంటి రాహువు నక్షత్రంలో శని సంచరిస్తాడు.

శని శతాభిష నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మేషం, మిథునం, సింహం, కన్య, తులా, మకర, కుంభరాశి వారికి అనుకూల ఫలితాలు వస్తాయని జ్యోతిష్యుడు పండిట్ దివాకర్ త్రిపాఠి తెలిపారు.

వచ్చే ఏడాది మీన రాశిలోకి శని ప్రవేశిస్తాడు. మీన రాశికి అధిపతి బృహస్పతి. ఏలినాటి శని దాదాపు ఏడన్నరేళ్లు ఉంటుంది. కాబట్టి మీన రాశి వారికి 2030లో విముక్తి లభించనుంది.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం