తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం, పూజా విధానం

నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం, పూజా విధానం

HT Telugu Desk HT Telugu

05 October 2024, 20:16 IST

google News
    • విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో దుర్గాదేవి రేపు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మవారి పూజా విధానం, సమర్పించాల్సిన నైవేద్యం గురించి అధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. 
లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ
లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ

లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ

దేవి న‌వ‌రాత్రుల్లో నాలుగో రోజు మణిద్వీపవాసిని అయిన పరాంబికను శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి రూపంలో పూజిస్తార‌ని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త‌, పంచాంగ‌క‌ర్త బ్ర‌హ్మ‌శ్రీ చిల‌క‌మ‌ర్తి ప్ర‌భాక‌ర చ‌క్ర‌వ‌ర్తి శ‌ర్మ తెలిపారు.

లేటెస్ట్ ఫోటోలు

Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు గెస్ట్‌గా వెంక‌టేష్ - సంక్రాంతి సంద‌డి ముందుగానే!

Dec 21, 2024, 07:46 PM

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

Ananya Nagalla: ష‌ర్మిల‌మ్మ కొడుకు డిటెక్టివ్ అయితే - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌పై అన‌న్య నాగ‌ళ్ల కామెంట్స్‌!

Dec 21, 2024, 04:13 PM

Ram Charan: నా సోలో సినిమా వచ్చి నాలుగేళ్లపైనే అయింది.. గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం: డల్లాస్‍లో రామ్‍చరణ్

Dec 21, 2024, 02:59 PM

Anupama Parameswaran: బాధితురాలిగా అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ రూమ్ డ్రామా.. సూపర్ స్టార్‌తో కొత్త మూవీ (ఫొటోలు)

Dec 21, 2024, 01:36 PM

Cake Healthy or Unhealthy : హలో గురూ.. లొట్టలేసుకుంటూ కేక్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

Dec 21, 2024, 01:23 PM

త్రిరిపురత్రయం' లో రెండవ శక్తి స్వరూపిణి ఈ తల్లి. అందుకే శరన్నవరాత్రులలో అమ్మ‌వారిని ప్ర‌త్యేకంగా కొలుస్తార‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. చెరకుగడ, విల్లు, పాశము, అంకుశము ధరించి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి కుడి ఎడమలు సేవలు అందిస్తుండగా శ్రీ లలితా అమ్మ‌వారు భక్తుల ఇక్కట్లు తొలగించి, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. కన్యలు మంచి భర్త కొరకు, ముత్తైదువులు దీర్ఘ సుమంగళిగా అఖండ సౌభాగ్యం కొరకు ఈ నవరాత్రులలో ఈరోజున‌ 'ఉపాంగ లలితా వ్రతం' ఆచరిస్తారు.

కుంకుమార్చనలు ఏర్పాటు చేసుకుంటారని ఆధ్యాత్మిక వేత్త చిల‌క‌మ‌ర్తి తెలిపారు. అమ్మవారిని శ్రీ లలితా దేవి అలంకారంలో సహస్రనామ, అష్టోత్తర నామాలతో కుంకుమ పూజలు చేసి, ముత్తైదువలకు తాంబూలాలు ఇచ్చుకుంటారు. ముత్తైదువులను పిలిచి సువాసినీ పూజలు చేస్తారు. కైలాస గౌరీ నోము కాని గ్రామ కుంకుమ నోముకాని నోచుకున్న వారు చాలా మంది ఈ రోజు ఉద్యాపన చేసుకుంటారు.

కొంతమంది తమ గృహాల్లోనే సామూహిక లక్ష బొమ్మల కొలువులు పెట్టుకుని, పేరంటాలు చేసుకుంటారు. శ్రీ లలితా దేవి తనని కొలిచిన భక్తుల దారిద్ర దుఃఖాలు నశింపచేస్తుందని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. కుంకుమ పూజలు జ‌రిపే వారికి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందీ అమ్మ‌వారు. శ్రీ లలితాదేవి దేదీప్యమైన మూర్తిని మనస్సులో ప్రతిష్టించుకుని, 'ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేనమః' అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకుంటే అమ్మ మాతృమూర్తి యై చల్లగా చూస్తుంద‌ని ఆధ్యాత్మిక వేత్త చిల‌క‌మ‌ర్తి తెలిపారు. ఈరోజు ధరించవలసిన వర్ణం బంగారు రంగు అలాగే పులిహోర, పెసర బూరెలను నైవేద్యంగా స‌మ‌ర్పించాల‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం