మే 14, నేటి రాశి ఫలాలు.. గతంలో చేజారిన డాక్యుమెంట్లు ఇప్పుడు దొరుకుతాయి
14 May 2024, 0:01 IST
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 14.05.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
మే 14వ తేదీ నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 14.05.2024
వారం: మంగళవారం, తిథి : సప్తమి,
లేటెస్ట్ ఫోటోలు
నక్షత్రం : పుష్యమి, మాసం : వైశాఖము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావచ్చు. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు, బంధువుల సహకారంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. ఆస్తుల వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగుతాయి. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
వృషభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు రావచ్చు. వ్యాపారస్తులకు లాభదాయకం. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వాహనయోగముంది. ఆస్తుల వ్యవహారాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. అవసరాలకు అప్పులు చేస్తారు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు ఆశించిన పెట్టుబడులు లభించును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. గృహ నిర్మాణాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. స్థిరాస్తి వివాదాలు చివరిదశకు చేరతాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీ ఆశయాలు నెరవేరతాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు. గతంలో చేజారిన కొన్ని డాక్యుమెంట్లు తిరిగే దొరికే అవకాశముంది. సకాలంలో రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మరింత శుభ ఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. వినాయకుడిని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలుంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఇబ్బందులు తొలగుతాయి. వాహనయోగముంది. భూవివాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ అభిప్రాయాలతో కుటుంబసభ్యులు ఏకీభవిస్తారు. జీవితాశయం సాధించే దిశగా ముందడుగు వేస్తారు. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు ఊహించని పెట్టుబడులుంటాయి. కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. ఆప్తుల నుంచి శుభవార్తలుంటాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వాహన, గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.
తులా రాశి
తులా రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఆనందాన్నిస్తాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం తగ్గుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకం. సోదర, సోదరీలతో వివాదాలు పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తిచేస్తారు. తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరుని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వాహన, గృహయోగాలున్నాయి. చిన్న చిన్న సమస్యలు నుంచి బయటపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. మరింత శుభఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. కొన్ని పనులు కుటుంబసభ్యుల సాయంతో పూర్తిచేస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
మకర రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. నిరుద్యోగులకు విద్యావకాశాలు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. స్థిరాస్తి వివాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. దూరమైన ఆప్తులు చేరువవుతారు. గృహ, వాహన యోగాలున్నాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, స్థానచలన మార్పులుంటాయి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో తమ సత్తా చాటుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కోరుకున్న అవకాశాలు. ఆత్మీయుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభ సూచన. ఆరోగ్యం అనుకూలించును. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశివారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కొత్త వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలుంటాయి. వ్యాపారస్తులు వ్యాపారంలో ఇబ్బందుల నుండి బయటపడతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు రావచ్చు. అనుకున్న రాబడి పొంది ఒత్తిడుల నుంచి బయటపడతారు. వ్యతిరేకులను మీవైపుకు ఆకట్టుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో సమస్యలు పరిష్కరించుకుని లబ్ధి పొందుతారు. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. రుణవిమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000