తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Mauni Amavasya 2023 Date And Shub Muhurt And Significance And Rituals Of The Day

Mauni Amavasya 2023 : మౌని అమావాస్య తేదీ, ప్రాముఖ్యత, చేయాల్సిన పనులు ఇవే..

19 January 2023, 10:01 IST

    • Mauni Amavasya 2023 : కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్యను, మహా శివరాత్రి ముందు వచ్చే చివరి అమావాస్యను మౌని అమావాస్య అంటారు. అయితే 2023న ఇది ఎప్పుడు వచ్చింది.. ఆరోజు ఏమి చేయాలి? దాని ప్రాముఖ్యతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మౌని అమావాస్య
మౌని అమావాస్య

మౌని అమావాస్య

Mauni Amavasya 2023 : మాఘ మాసంలో వచ్చే అమావాస్యను చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దీనినే మౌని అమావాస్య అంటారు. ఆ రోజున భక్తులు ఉపవాసం ఉంటూ గంగస్నానం చేసి.. పూజలు చేస్తారు. అయితే ఈసారి మౌని అమావాస్య జనవరి 21వ తేదీ, శనివారం రోజున వస్తుంది. మౌని అమావాస్య చాలా పుణ్యమైనదిగా, ఫలవంతమైనదిగా చెప్తారు. అందుకే ఆ రోజున పూర్వీకుల కోసం, పితృదోషాలు తొలిగించుకోవడానికి పవిత్రమైనదిగా.. స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసం చేస్తారు. అయితే ఈ అమావాస్య ప్రాముఖ్యత, శుభ సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

ఏప్రిల్ 28, రేపటి రాశి ఫలాలు.. ఐటీ రంగంలో పని చేసే వాళ్ళు రేపు జాగ్రత్తగా ఉండాలి

Apr 27, 2024, 08:38 PM

Lord Venus : శుక్రుడి సంచారంతో ఈ రాశులవారికి ఇబ్బందులు

Apr 27, 2024, 03:03 PM

Lord Surya : సూర్యభగవానుడి సంచారంతో సమస్యల్లో పడే రాశులు వీరే

Apr 27, 2024, 11:23 AM

Jupiter Venus conjunction: గురు శుక్ర సంయోగం.. గజలక్ష్మీ రాజయోగంతో వీళ్ళు విజయ శిఖరాలు చేరుకుంటారు

Apr 26, 2024, 03:28 PM

ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే! భారీ ధన లాభం- ఉద్యోగంలో ప్రమోషన్​..

Apr 26, 2024, 05:56 AM

Ruchak Raja Yogam: రుచక్ రాజ యోగం.. 3 రాశుల వారిని అదృష్టం వరించనుంది

Apr 25, 2024, 02:21 PM

మౌని అమావాస్య శుభ సమయం

* మౌని అమావాస్య 21 జనవరి 2023 రోజు శనివారం వస్తుంది.

* అమావాస్య తిథి ప్రారంభం - జనవరి 21, 2023 ఉదయం 06:17 గంటలకు

* అమావాస్య తేదీ ముగింపు - జనవరి 22, 2023 మధ్యాహ్నం 02:22 గంటలకు

మౌని అమావాస్య ప్రాముఖ్యత

మౌని అమావాస్య రోజున సంగమం లేదా గంగా స్నానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే మాఘమాసంలో సంగమ స్నానం చేయడం ద్వారా విష్ణువు ప్రసన్నుడవుతాడని అంటారు. మౌని అమావాస్య మాఘమాసంలో మాత్రమే వస్తుంది. అందుకే ఆ రోజున గంగానదిలో స్నానం చేసినా మోక్షం లభిస్తుంది అంటారు. మౌని అమావాస్య రోజు గంగానదిలోని నీరు అమృతంగా మారుతుందని.. అందుకే ఆరోజు గంగానదిలో స్నాం చేస్తే మంచిదంటారు.

మౌని అమావాస్య రోజున చేయాల్సిన పనులివే..

* మౌని అమావాస్య రోజున పూర్వీకుల పేరుతో నీళ్లలో నువ్వులు వేసి దక్షిణ దిశలో తర్పణం చేయాలి.

* అమావాస్య తిథి పూర్వీకులకు అంకితం. కాబట్టి ఈ రోజున పూర్వీకులకు ప్రార్థనలు చేస్తే వారికి సంతృప్తి దక్కుతుంది. పితృదోషాలు తొలగుతాయి.

* మౌని అమావాస్య రోజున మర్రి చెట్టును పూజించి.. దాని చుట్టూ పవిత్రమైన పసుపు దారాన్ని 108 సార్లు కట్టాలి.

* చెట్టు కింద దీపం వెలిగిస్తే.. మీ పూర్వీకుల ఆశీర్వాదం, కుటుంబంలో శ్రేయస్సు పొందుతారు.

* మౌని అమావాస్య రోజున విష్ణుమూర్తిని పూజించండి. పూజకు ముందు మీ మీద గంగాజలం చల్లుకోండి. గీతలోని ఏడవ అధ్యాయాన్ని పఠిస్తే పితృ బాధలు పోతాయి.

* పూర్వీకులను ధ్యానిస్తూ.. మౌని అమావాస్య రోజు దానం చేయండి. ఆహారం, బట్టలు మొదలైనవాటిని దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతాయి.

టాపిక్