తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మాంసాహారం తినడం పాపమా? ధర్మ శాస్త్రాలు, వేదాలు ఏం చెబుతున్నాయి?

మాంసాహారం తినడం పాపమా? ధర్మ శాస్త్రాలు, వేదాలు ఏం చెబుతున్నాయి?

Gunti Soundarya HT Telugu

08 October 2024, 12:13 IST

google News
    • హిందూ ధర్మ శాస్త్రం, వేదాలు, గ్రంథాలు మాంసాహారం తినడం మంచిది కాదని సూచిస్తున్నాయి. మాంసాహార భోజనం గ్రహాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి. మాంసాహారం తినడం పాపమా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. 
వేదాలు జీవహింసను మహాపాపంగా చెబుతున్నాయి
వేదాలు జీవహింసను మహాపాపంగా చెబుతున్నాయి

వేదాలు జీవహింసను మహాపాపంగా చెబుతున్నాయి

మన శాస్త్రాలు శాఖాహారం తీసుకోవాలనే చెబుతున్నాయి. పవిత్ర గ్రంథమైన భగవద్గీత కూడా శాఖాహారాన్ని తినాలని, అహింసను అనుసరించమని చెబుతుంది. జీవిని చంపడానికి వ్యతిరేకం. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏ ప్రాణిని చంపొద్దని, బాధపెట్టకూడదని చెప్పాడు. జంతువులను ప్రేమగా, గౌరవంగా చూడమని బోధించాడు. వేదాలు కూడా మాంసాహారం తినకూడదని పేర్కొంటున్నాయి. ప్రపంచంలోని ప్రతి జీవి ఉనికికి ప్రత్యేక ఉద్దేశం ఉందని వేదాలు చెబుతున్నాయి. అందుకే మానవులు జీవ హింస చేయరాదని అంటారు.

లేటెస్ట్ ఫోటోలు

South Central Railway : ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్.. ఇకనుంచి తిప్పలు తప్పనున్నాయి!

Dec 05, 2024, 10:05 AM

Naga Chaitanya Sobhita Wedding Photos: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి ఫొటోలు.. ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తున్న కపుల్

Dec 05, 2024, 07:26 AM

Suzuki Jimny: 2024 థాయ్ లాండ్ ఇంటర్నేషనల్ మోటార్ షోలో మెరిసిన సుజుకి జిమ్నీ ఆఫ్ రోడ్ ఎడిషన్

Dec 04, 2024, 05:55 PM

2024 Honda Amaze: స్టన్నింగ్ లుక్స్, గ్రేట్ ఫీచర్స్ తో భారత మార్కెట్లోకి 2024 హోండా అమేజ్ లాంచ్

Dec 04, 2024, 05:38 PM

Mantras For Kids: మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారికి ఈ ఐదు మంత్రాలు తప్పకుండా నేర్పించండి

Dec 04, 2024, 05:30 PM

ISRO PSLV C-59 : పీఎస్ఎల్వీ సి-59 ప్రయోగం రేపటికి వాయిదా, ప్రోబా-3 శాటిలైట్ లో సాంకేతిక లోపం

Dec 04, 2024, 04:12 PM

మన ఆత్మ, శరీరాన్ని శుద్ది చేసుకోవడానికి శాఖాహారం మాత్రమే తీసుకోవాలి. జంతువులను చంపి వాటి మాంసం తినే వాడికి దేవతలు నివసించే స్వర్గంలో స్థానం ఉండదని అంటారు. జంతువు మాంసాన్ని కొనడం, విక్రయించడం, జీవిని చంపడానికి కూడా మనమే బాధ్యులం అవుతాము. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూడు రకాల ఆహారాలు ఉన్నాయి. రాజసిక, తామసిక, సాత్విక ఆహారంగా పిలుస్తారు. రాజసిక ఆహారం పులుపు, కారంగా ఉంటుంది. తామసిక ఆహారం దుర్వాసన వస్తుంది. ఇది మన జీర్ణక్రియ ప్రక్రియను దెబ్బతీస్తుంది. మాంసాహారం జాతకంలో గ్రహాల స్థానం మీద ప్రభావం చూపిస్తాయి. సాత్విక ఆహారం తాజాగా ఉంటుంది. సులభంగా జీర్ణమవుతుంది. ఈ ఆహారాలు మనల్ని ఆధ్యాత్మికంగా బలపడేలా చేస్తాయి. 

గ్రహాలపై నాన్ వెజ్ ఫుడ్ ప్రభావం

జాతకంలో అంగారకుడు వేడిగా ఉంటే చంద్రుడు బలహీనంగా ఉంటాడు. ఇవి వ్యక్తి జాతకాన్ని ప్రభావితం చేస్తుంది. జన్మ రాశిలో బృహస్పతి బలంగా ఉన్న వ్యక్తులు శాఖాహారం ఎక్కువగా తింటారు.

మద్యం, మాంసాహారం తీసుకునే వాళ్ళ కర్మ రుణాలు రెట్టింపు అవుతాయి. అదృష్టం ఉండదు. అదే శాఖాహారం తినడం వల్ల పూర్వపు బాధలు తొలగిపోతాయి. ఆహారాలు మన ఆత్మను పవిత్రం చేస్తాయి. మనల్ని ప్రశాంతంగా ఉంచుతాయి. సానుకూల ఫలితాలను ఇస్తాయి. 

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం