AP TG Egg Price : కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. గుడ్డు ప్రియులకు గడ్డు కాలమే!
- AP TG Egg Price : తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం భారీగా పెరిగింది. దీంతో గుడ్డు ధర కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగింది. ఇప్పుడు ఏకంగా 7 రూపాయలకు చేరింది. దీంతో వినియోగదారులు విచారం వ్యక్తం చేస్తుండగా పౌల్ట్రీ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతలా గుడ్ల ధరలు ఎందుకు పెరిగాయో ఓసారి చూద్దాం.

(1 / 6)
కోడి గుడ్ల ధరలు కొండెక్కాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క గుడ్డు ధర 7 రూపాయలకు చేరింది. దీంతో పౌల్ట్రీ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నా.. వినియోగదారులు మాత్రం వామ్మో గుడ్డా.. అంటున్నారు.
(istockphoto)(2 / 6)
సాధారణంగా చలికాలంలో కోడిగుడ్ల ధరలు పెరుగుతాయి. కానీ.. ఈ స్థాయిలో పెరగడం అరుదని వ్యాపారులు చెబుతున్నారు.
(istockphoto)(3 / 6)
డిసెంబర్ నెలలో క్రిస్‌మస్, ఆ తర్వాత న్యూఇయర్ వేడుకలు జరగనున్నాయి. దీంతో కేక్‌లకు బాగా డిమాండ్ ఉంటుంది. కేక్‌లలో గుడ్డు వినియోగం ఎక్కువగా ఉంటుంది. అందుకే రేట్లు పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
(istockphoto)(4 / 6)
తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఈశాన్య రాష్ట్రాల్లోనూ గుడ్ల వినియోగం పెరిగింది. ఈ కారణంగా కూడా ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
(istockphoto)(5 / 6)
ఆగస్టు నెలలో కోడి గుడ్డు ధర 5.70 రూపాయలు, సెప్టెంబర్ మాసంలో 6.24 రూపాయలు, ఆక్టోబర్ నెలలో 6.28 రూపాయలు, నవంబర్ మాసంలో 6.50 రూపాయలు ఉంది. తాజాగా డిసెంబర్ నెలలో 7 రూపాయలకు చేరింది.
(istockphoto)ఇతర గ్యాలరీలు