Sattvic Food: సాత్విక ఆహారం తినడం వల్ల ప్రయోజనాలు ఎన్నో, అసలేంటి సాత్విక ఆహారం?
Sattvic Food: ఆయుర్వేదంలో సాత్విక ఆహారాన్ని తినమని సిఫార్సు చేస్తారు. కానీ చాలామందికి అసలు సాత్విక ఆహారం అంటే ఏమిటో కూడా తెలియదు.
Sattvic Food: ఆయుర్వేదంలో సాత్విక ఆహారం అనేది ఒక ముఖ్యమైన అంశం. శారీరక, మానసిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఆయుర్వేదం సాత్విక ఆహారాన్ని తినమని ప్రోత్సహిస్తుంది. ఈ సాత్వికాహారం స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన మొక్కల ఆధారిత పదార్థాలను తినమని చెబుతుంది. మనసు, శరీరం, ఆత్మ మధ్య సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండేలా చూడడంలో సాత్వికాహారం ముందుంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలను సాత్విక ఆహార పద్ధతిలో తినరు. తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, ధాన్యాలు వంటి వాటితో చేసినవే తింటారు. సాత్విక ఆహారం జీవశక్తిని, ఆధ్యాత్మిక అవగాహనను పెంపొందిస్తుంది. శరీరంలోని అన్ని రకాల హార్మోన్లు సమతులంగా ఉండేలా చూస్తుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ముందుంటుంది.
సాత్విక ఆహారం అంటే
సాత్విక ఆహారం అనేది ఆయుర్వేదంలో చెబుతున్న ఒక ఆహార పద్ధతి. ప్రాచీన భారతీయ వైద్య విధానంలో దీని పాత్ర ఉంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడమే సాత్విక ఆహారం ప్రధాన ఉద్దేశం. ఈ ఆహారంలో భాగంగా కాలాన్ని బట్టి ఋతువులను బట్టి దొరికే పండ్లు, కూరగాయలను కచ్చితంగా తినాలి. నట్స్, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలతో చేసిన ఆహారాలను ప్రతిరోజూ తింటారు. కారం, నూనె అధికంగా ఉండే ఆహారాలను దూరం పెడతారు. సాత్విక ఆహారం తినడం వల్ల వాత,పిత్త, కఫ దోషాలన్నీ సమతులంగా ఉంటాయి.
సాత్విక ఆహారం తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మలబద్ధకం, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది. పేగు కదలికలను ప్రోత్సహించి ఆహారం సరిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
ఆహారం తీసుకోవడం వల్ల ఆ ప్రభావం మనసు పై కూడా పడుతుంది. మనసు సానుకూలంగా ఆలోచిస్తుంది. మానసిక స్పష్టత, ప్రశాంతత లభిస్తుంది. హార్మోన్లు సమతులంగా ఉండి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
శరీరంలోని శక్తి స్థాయిలను సమతుల్యం చేయడంలో సాత్వికాహారం ముందుంటుంది. ఇది తేలికపాటి ఆహారం శక్తిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది.
ఆహారంలో ప్రాసెస్ చేయని ఆహారాలని తింటారు. కాబట్టి శరీరంలో వ్యర్ధాలు అధికంగా చేరవు. ఒకవేళ చేరినా డిటాక్స్ఫికేషన్ త్వరగా జరుగుతుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సాత్విక ఆహారంలో అధికంగా ఉంటాయి. కాబట్టి శరీరంలోని విషాలను, వ్యర్ధాలను తొలగిస్తాయి.
టాపిక్