AP Rains Update : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, రేపటి నుంచి ఏపీలో వర్షాలు
AP Rains Update : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 6)
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
(2 / 6)
ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఉన్న అల్పపీడన ప్రాంతం, దాని అనుబంధ ఉవపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది.
(3 / 6)
అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. డిసెంబర్ 11వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతం వద్ద ఉన్న శ్రీలంక- తమిళనాడు తీరాలకు చేరుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
(4 / 6)
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రాగల రెండు రోజలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో బుధ, గురువారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
(5 / 6)
అల్పపీడనం ప్రభావంతో రేపు(బుధవారం) ఏపీలోని నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
(6 / 6)
ఎల్లుండి(గురువారం) నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఇతర గ్యాలరీలు