Smartphones: లేటెస్ట్ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో త్వరలో రానున్న టాప్ స్మార్ట్‌ఫోర్లు ఇవే-upcoming smartphone in india with snapdragon 8 elite chipset oneplus 13 samsung galaxy s25 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Smartphones: లేటెస్ట్ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో త్వరలో రానున్న టాప్ స్మార్ట్‌ఫోర్లు ఇవే

Smartphones: లేటెస్ట్ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో త్వరలో రానున్న టాప్ స్మార్ట్‌ఫోర్లు ఇవే

Dec 10, 2024, 06:10 PM IST Chatakonda Krishna Prakash
Dec 10, 2024, 06:10 PM , IST

లేటెస్ట్ స్నాప్‍డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై మంచి హైప్ నెలకొంది. ఇప్పటి వరకు ఇదే అత్యంత శక్తివంతమైన మొబైల్ ప్రాసెసర్‌గా ఉంది. ఈ నయా ప్రాసెసర్‌తో త్వరలో మరికొన్ని మొబైళ్లు లాంచ్ కానున్నాయి. వాటిలో పాపులర్ ఇవే..

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్‍ను సామ్‍సంగ్ త్వరలో లాంచ్ చేయనుంది. సామ్‍సంగ్ నుంచి తదుపరి బిగ్ రిలీజ్ ఈ సిరీస్ కానుంది. సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రాలో లేటెస్ట్ స్నాప్‍డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉండనుంది. ఎస్24 అల్ట్రాలోని స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 3 కంటే.. ఎస్24 అల్ట్రాలో ఉండనున్న స్నాప్‍డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ ఎక్కువగా, శక్తివంతంగా ఉంటుంది.

(1 / 5)

(OnLeaks)

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్25, గెలాక్సీ ఎస్25 ప్లస్ మొబైళ్లను కూడా స్నాప్‍డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తోనే సామ్‍సంగ్ ఇండియాకు తెస్తుందని అంచనాలు ఉన్నాయి. గత మోడళ్లు ఎస్24, ఎస్24 ప్లస్‍ను భారత్‍లో ఎగ్జినోస్ ప్రాసెసర్‌తో సామ్‍సంగ్ లాంచ్ చేసింది. అయితే, ఈ సారి  లేటెస్ట్ చిప్‍సెట్‍ స్నాప్‍డ్రాగన్ 8 ఎలైట్‍తో తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

(2 / 5)

(Android Headline/ OnLeaks)

వన్‍ప్లస్ 13 మొబైల్ వచ్చే నెల 2025 జనవరిలో ఇండియాలో లాంచ్ కానుంది. ఈ మొబైల్ స్నాప్‍డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుందని ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇండియాలో వచ్చే నెలలో అడుగుపెట్టనుంది. 

(3 / 5)

(OnePlus)

షావోమీ 15 సిరీస్ మొబైళ్లు కూడా స్నాప్‍డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను కలిగి ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ ఫ్లాగ్‍షిప్ సిరీస్ త్వరలోనే ఇండిాయాలో అడుగుపెట్టే అవకాశం ఉంది. 

(4 / 5)

(Xiaomi)

సామ్‍సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఫోల్డబుల్ ఫోన్లు కూడా స్నాప్‍డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రానున్నాయి. ఇండియాలో 2025 జూలై - ఆగస్టు మధ్య ఈ మొబైళ్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

(5 / 5)

(HT Tech)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు