Railway : రైలులో ఏదైనా మర్చిపోయారా? ఈ నెంబర్‌కు కాల్ చేసి ఇలా ఈజీగా తిరిగి పొందవచ్చు-know indian railways helpline number how to find lost things in train simple procedure ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Railway : రైలులో ఏదైనా మర్చిపోయారా? ఈ నెంబర్‌కు కాల్ చేసి ఇలా ఈజీగా తిరిగి పొందవచ్చు

Railway : రైలులో ఏదైనా మర్చిపోయారా? ఈ నెంబర్‌కు కాల్ చేసి ఇలా ఈజీగా తిరిగి పొందవచ్చు

Dec 10, 2024, 03:53 PM IST Anand Sai
Dec 10, 2024, 03:53 PM , IST

  • Indian Railway : చాలా మంది రైలులో ముఖ్యమైన వస్తువులను మర్చిపోతారు. తరువాత ఆ వస్తువును ఎలా తిరిగిపొందాలో తెలియక తికమక పడుతారు. అలాంటివారి కోసం ఈ వార్త ఉపయోగపడుతుంది.

కొన్నిసార్లు రైలులో ఏదో ఒక వస్తువు మరిచిపోతాం. అది బ్యాగ్ కావొచ్చు, ఛార్జర్ కావొచ్చు.. మరేదైనా వస్తువు అయి ఉండొచ్చు. ఇంతలో అప్పటికే రైలు స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. కానీ తర్వాత ఆ వస్తువు పోయినట్టే అని అనుకుంటారు. కానీ మీరు కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆ వస్తువును ఈజీగా తిరిగి పొందవచ్చు.

(1 / 6)

139కు ఫోన్ చేసి మొత్తం సంఘటనను నివేదించాలి.  మొదట మీ బ్యాగ్ లేదా ఇతర వస్తువులు పోయాయని వారికి తెలియజేయడానికి రైల్వే 139 కు కాల్ చేయండి. ఐటమ్ వివరాలతో పాటు మీ ఫోన్ నంబర్, పేరు మొదలైనవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

(2 / 6)

మీరు ఏ రైలు ఎక్కారు, ఎప్పుడు దిగారు, ఏ స్టేషన్లో దిగారు అనే సమాచారాన్ని కూడా ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ సమాచారం ఆధారంగా రైల్వే గార్డులు రైలు ఎక్కడుందో వెతకడం ప్రారంభిస్తారు.

(3 / 6)

ఎవరైనా ఇతరులు మీ బ్యాగ్ లేదా వస్తువులను తీసుకెళ్లకుంటే దొరుకుతుంది. అనంతరం నిర్దేశిత స్టేషన్‌లో సమర్పిస్తారు. అక్కడి నుంచి ప్రయాణికుడు దాన్ని సేకరించాల్సి ఉంటుంది.

(4 / 6)

'ఆపరేషన్ అమానత్' పేరుతో చేపట్టిన ఈ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా మారింది. భారతీయ రైల్వే ఈ పద్ధతి ద్వారా కోల్పోయిన చాలా వస్తువులను క్రమం తప్పకుండా తిరిగి ఇస్తోంది. వాలెట్లు, ఫోన్లు, చార్జర్లు మొదలైనవి ఈ వస్తువులలో ఉన్నాయి.

(5 / 6)

మొబైల్స్, ఛార్జర్లు, పవర్ బ్యాంక్స్, కోట్స్, జాకెట్లు, దుప్పట్లు, కాస్మెటిక్ బాక్సులు, కళ్లజోళ్లను చాలా మంది మరిచిపోయారు. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 30 మధ్య మొత్తం 2,423 వస్తువులను వాటి యజమానులకు డెలివరీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు