తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips For Business: ఉద్యోగం, వ్యాపారంలో రాణించలేకపోతున్నారా? ఇలా చేయండి మంచి ఫలితాలు పొందుతారు

Vastu tips for business: ఉద్యోగం, వ్యాపారంలో రాణించలేకపోతున్నారా? ఇలా చేయండి మంచి ఫలితాలు పొందుతారు

Gunti Soundarya HT Telugu

09 September 2024, 10:56 IST

google News
    • Vastu tips for business: కార్యాలయంలో ఎంత కష్టపడినా కూడా కొంతమందికి కలిసి రాదు. కృషి ఉన్నప్పటికీ ఉద్యోగంలో ప్రమోషన్, జీతాలు పెరుగుదల వంటివి వాటి మీద ప్రభావం పడుతుంది. అందుకు కారణం వాస్తు దోషాలు కూడా కావచ్చు. అందుకే వీటిని పొరపాటున కూడా మీకు దగ్గరలో ఉంచుకోకండి. 
ఉద్యోగంలో రాణించాలంటే ఇలా చేయండి
ఉద్యోగంలో రాణించాలంటే ఇలా చేయండి

ఉద్యోగంలో రాణించాలంటే ఇలా చేయండి

Vastu tips for business: చాలాసార్లు ఇంటిలో లేదా కార్యాలయంలో అనవసరమైన వస్తువులు ఉంచడం ద్వారా లేదా తప్పు దిశలో ఉంచడం ద్వారా ప్రతికూల శక్తి ప్రభావం గణనీయంగా పెరుగుతుంది. వీటి ప్రభావం మీ ఉద్యోగం మీద కూడా పడుతుంది. కార్యాలయంలో అశాంతి వాతావరణం నెలకొనడం. సహోద్యోగులతో విభేదాలు, ఎంత కష్టపడినా కూడా ఉద్యోగంలో ప్రమోషన్ లభించకపోవడం వంటివి జరుగుతాయి. 

లేటెస్ట్ ఫోటోలు

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

Ananya Nagalla: ష‌ర్మిల‌మ్మ కొడుకు డిటెక్టివ్ అయితే - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌పై అన‌న్య నాగ‌ళ్ల కామెంట్స్‌!

Dec 21, 2024, 04:13 PM

Ram Charan: నా సోలో సినిమా వచ్చి నాలుగేళ్లపైనే అయింది.. గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం: డల్లాస్‍లో రామ్‍చరణ్

Dec 21, 2024, 02:59 PM

Anupama Parameswaran: బాధితురాలిగా అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ రూమ్ డ్రామా.. సూపర్ స్టార్‌తో కొత్త మూవీ (ఫొటోలు)

Dec 21, 2024, 01:36 PM

Cake Healthy or Unhealthy : హలో గురూ.. లొట్టలేసుకుంటూ కేక్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

Dec 21, 2024, 01:23 PM

పార్లమెంట్​ ఉన్నది కొట్టుకోవడానికే! కిందపడేసి కొట్టి, చంప చెళ్లుమనిపించి..

Dec 21, 2024, 01:04 PM

ఇక వ్యాపారస్థులకు నష్టాలు ఎదురవుతాయి. విజయాన్ని సాధించలేరు. వ్యాపారం ఊపండుకోకపోవడానికి వాస్తు లోపం కూడా కారణం అవుతుంది. దీని వల్ల వ్యక్తి ఆర్థిక, మానసిక, శారీరక బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో రాణించాలని అనుకుంటే మీరు ఈ వాస్తు పరిహారాలు పాటించాలి. 

ఉద్యోగంలో రాణించాలంటే 

ఆఫీసు లేదా వ్యాపార సముదాయంలో కాంతి సరిగా ఉండేలా చూసుకోవాలి. లైట్లు కాంతివంతంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే ప్రతికూల శక్తి పెరిగిపోయి దాని ప్రభావం మీ ఉద్యోగం, వ్యాపారం మీద పడుతుంది. 

ముళ్ళ పువ్వులు, మొక్కలను ఇల్లు, కార్యాలయంలో నాటకూడదు. ఇలా చేయడం ద్వారా వాతావరణంలో అశాంతి నెలకొంటుంది. ఆర్థిక నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. 

ఆఫీసు లేదా ఇంట్లో ఎప్పుడూ చెత్తను నిల్వ చేయకూడదు. ఇది ఇంటి శాంతిని భంగపరుస్తుంది. ప్రతికూల శక్తిని కూడా వ్యాపిస్తుంది.

మీ కార్యాలయం లేదా ఇంట్లో విరిగిన గాజు ఉంటే దానిని మొదట తొలగించాలి. విరిగిన గాజును ఉంచడం ప్రతికూల శక్తి  ప్రభావాన్ని పెంచుతుంది. ఇది మాత్రమే కాదు పగిలిన విగ్రహం లేదా చిరిగిపోయిన ఫోటో ఉంచకూడదు. వాటిని వెంటనే తొలగించాలి. ఆర్థిక నష్టానికి అవకాశం ఉంటుంది. 

ఇల్లు, కార్యాలయంలో ఎప్పుడూ క్లోజ్డ్ వాచ్ ఉంచవద్దు. చెడిపోయిన గడియారం  ప్రతికూలతను వ్యాప్తి చేస్తుంది. అదే సమయంలో మణికట్టు మీద పనిచేయని వాచ్ ఎప్పుడూ కట్టకూడదు. క్లోజ్డ్ గడియారం ఉపయోగించడం అనేది దురదృష్టం అవకాశాలను పెంచుతుందని అంటారు.

వ్యాపారులు విజయం కోసం 

వ్యాపారాన్ని ప్రోత్సహించడం కోసం వాస్తు ప్రకారం మీ సంస్థ ఉత్తర దిశలో నీలం రంగు తామర చిత్రాన్ని ఉంచండి. అలాగే పని వేగవంతం చేసేందుకు ఉత్తర దిశలో తెలుపు రంగు పిగ్గీ బ్యాంక్ ఉంచాలి. అందులో ఎప్పుడూ డబ్బులు వేస్తూ ఉండాలి. వ్యాపారంలో విజయం సాధించేందుకు ఆహారంలో నల్ల మిరియాలు క్రమం తప్పకుండా ఉపయోగించుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. 

వ్యాపారస్తులు తమ వ్యాపారంలో పురోగతి సాధించడానికి ఈశాన్య మూలలో కుంకుమ పువ్వు రంగుతో స్వస్తిక్ చిహ్నాన్ని గియాలి.  

నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారాన్ని అవి పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనవి అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత ఫీల్డ్ యొక్క నిపుణుడిని సంప్రదించండి.

తదుపరి వ్యాసం