Lord ganesha: గణపతికి ప్రీతికరమైన పువ్వులు ఇవే, ఈ వినాయక చవితికి వీటితో పూజ చేయండి-lord ganesha favorite flower list worship these flowers for wish come fulfill ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Ganesha: గణపతికి ప్రీతికరమైన పువ్వులు ఇవే, ఈ వినాయక చవితికి వీటితో పూజ చేయండి

Lord ganesha: గణపతికి ప్రీతికరమైన పువ్వులు ఇవే, ఈ వినాయక చవితికి వీటితో పూజ చేయండి

HT Telugu Desk HT Telugu
Aug 30, 2024 10:21 AM IST

Lord ganesha: మరో వారం రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతుంది. ఈ పండుగకు గణపతికి ఎంతో ప్రీతికరమైన పువ్వులతో పూజ చేయడం వల్ల మీ మనసులోని కోరికలు నెరవేరతాయని అభీష్టాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.

వినాయకుడికి ఇష్టమైన పువ్వులు ఇవే
వినాయకుడికి ఇష్టమైన పువ్వులు ఇవే (pixabay)

శ్లో॥ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా॥

ఏ పూజకైనా తొలిగా పూజను అందుకునేది వినాయకుడే పూజకు కలిగే సకల ఆటంకాలను తొలగించమని ఆ గణనాథుడిని పూజించవలసిందే. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పం తామర. తెల్లతామర పుష్పములతో గణపతిని పూజిస్తే సకల కార్యాలందు ఉన్న విఘ్నములన్నీ తొలగిపోతాయి.

తెల్లజిల్లేడు, చామంతి, శంఖపుష్పము, తెల్ల, ఎర్ర, పసుపు గన్నేరు పుష్పములు, బొండుమల్లి పుష్పములతో కూడా వినాయకుడిని పూజించవచ్చు. ఇక శివునికి ప్రీతిపాత్రమైన అన్ని పుష్పాలతో గణపతిని పూజించవచ్చని చెప్తారు. శివగణాలలో ఒకడైనందున ఈ విధంగా చెప్తారని పండితవాదం. వినాయకుడిని ఏ పుష్పంతో అయినా పూజించవచ్చని కూడా అంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

గణపతి మూర్తులలో కలువ, తామర పువ్వులను ధరించిన మూర్తులను పురాణాలు పేర్కొంటున్నాయి. ముద్దుల పురాణానుసారం గణపతికి తామర, కలువ, ఎర్రనివి, తెల్లనివి ప్రీతికరమైనవిగా వివరణ కన్పిస్తుంది.

గణపతి పూజలో తులసీపత్రం నిషిద్ధం అన్నట్లుగా పుష్ప పూజకంటే గరికతో పూజిస్తేనే స్వాతి అతి త్వరగా కరుణిస్తాడని ప్రతీతి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఎర్ర గన్నేరు కూడా వినాయకుడికి ప్రీతికరమైనదే. వినాయకుడి ఆలయంలో ఈ చెట్టు ఉన్నట్లయితే దానికి నమస్కరించుకోవడం ఎంతో శుభం కల్గిస్తుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ