Deeparadhana: సాయంత్రం ఎందుకు దీపారాధన చేయాలి? స్నానం చేసి దీపారాధన చేయాలా?
05 December 2024, 16:48 IST
- సూర్యాస్తమయం సమయంలో కూడా దీపారాధన చేయాలి. పెద్దలు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు. లోకాలకి వెలుగుని, తేజస్సును ప్రసాదిస్తారు సూర్యుడు. అయితే, తాను లేనప్పుడు జీవులు ఎలా ఉంటారని సూర్యుడు తన తేజస్సుని దీపంలో ఉంచుతాడు. అందుకని కచ్చితంగా సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేయాలని అంటారు.
సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు
ప్రతీ రోజూ కూడా ఇంట్లో దీపాన్ని వెలిగించాలి. దీపం జీవాత్మకే కాదు పరమాత్మకు కూడా ప్రతిరూపం అని చెప్తారు. అందుకనే ముందు ఏ పూజ మొదలుపెట్టినా దీపాన్ని వెలిగించాలి. దేవుడిని ఆరాధించడానికి ముందు దీపారాధన చేస్తారు. అంటే దీపాన్ని మొదట పూజించాలి.
లేటెస్ట్ ఫోటోలు
దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని పూజ చేయడానికి, ముందు దీపాన్ని ఆరాధించాలి. షోడశోపచారాల్లో దీపారాధన ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేకపోయినా కచ్చితంగా దీపం వెలిగించడం, ధూపం, నైవేద్యం చేయడం మంచిది. దీపాన్ని వెలిగించేటప్పుడు ఎన్ని వత్తులు వేయాలి?
చాలా మందిలో ఉండే సందేహం ఇది. దీపం వెలిగించేటప్పుడు రెండు వత్తులు పెట్టాలా? మూడు వత్తులు పెట్టాలా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అయితే, ఎప్పుడైనా సరే దీపాన్ని పెట్టేటప్పుడు మూడు వత్తులు పెట్టాలి. ఈ కింది శ్లోకం కూడా అదే చెప్తోంది.
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే..
పైగా ఆ మూడు వత్తులు కూడా తూర్పుముఖంగా ఉండాలి. మూడు వత్తులు కూడా ముల్లోకాలకు, సత్వ, రజ, తమో గుణాలకు, త్రికాలాలకు సంకేతం.
దీపారాధన చేసేటప్పుడు ఏ నూనె వాడడం మంచిది?
దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెను చాలా మంది ఉపయోగిస్తారు. పమిడి పత్తితో చేసిన వత్తిని వేసి, ఆవు నెయ్యిని కొద్దిగా వేసి దీపారాధన చేస్తే మంచి కాంతి వస్తుంది. ఈ కాంతిలో కూర్చుని పూజ చేయడం వలన ఏకాగ్రత బాగా కలుగుతుంది.
సాయంత్రం ఎందుకు దీపారాధన చేయాలి?
సూర్యాస్తమయం సమయంలో కూడా దీపారాధన చేయాలి. పెద్దలు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు. సూర్యుడు లోకాలకి వెలుగుని, తేజస్సును ప్రసాదిస్తారు . అయితే, తాను లేనప్పుడు జీవులు ఎలా ఉంటారని సూర్యుడు తన తేజస్సుని దీపంలో ఉంచుతాడు. అందుకని కచ్చితంగా సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేయాలని అంటారు.
సంధ్యా దీపాన్ని పెట్టేటప్పుడు స్నానం చేయాలా?
ఇది కూడా చాలా మందిలో ఉండే సందేహం. సాయంత్రం పూట దీపాన్ని పెట్టేటప్పుడు స్నానం చేయాలా అనే విషయానికి వచ్చేస్తే.. బయటకు వెళ్లకుండా ఉంటే సాయంత్రం కాళ్లు, చేతులు కడుక్కుని దీపారాధన చేయొచ్చు. స్నానం చేయాలని నియమం లేదు.
అలాగే కాలకృత్యాలు ఆ దుస్తులతో చేయకపోయినట్లయితే కూడా కాళ్లు, చేతులు ముఖం కడుక్కుని దీపారాధన చేయొచ్చు. సుచిగా ఉంటే స్నానం చేయకపోయినా పరవాలేదు. సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేసి వచ్చిన శ్లోకాలు చదువుకోవచ్చు. దీనికి స్నానం చేయాలని నియమం లేదు. అదే ఒకవేళ శుచిగా లేకపోతే కంఠ స్నానం చేస్తే సరిపోతుంది. తల స్నానం చేయవలసిన అవసరం లేదు.