తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Decaying Tulsi Plant Is Considered A Bad Omen Here Are The Reasons

Tulsi Bad Indication : తులసి మెుక్క వాడిపోతే చెడు శకునం.. అలా జరిగితే ఏమవుతుంది?

Anand Sai HT Telugu

04 February 2023, 11:47 IST

    • Tulsi Plant : తులసి మెుక్క పెంచడం అనేది చాలా ఇళ్ళలో కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా తులసి మెుక్క వాడిపోవడం మెుదలైతే.. కాస్త ఆందోళన చెందుతుంటారు. ఇంట్లో ఏదో జరుగుతుందని భయపడుతుంటారు. ఇంతకీ తులసి మెుక్క వాడిపోతే వచ్చే చెడు శకునాలు ఏంటి?
తులసి మెుక్క
తులసి మెుక్క (unsplash)

తులసి మెుక్క

చాలా మంది తమ ఇళ్లలో తులసి మొక్కలను(Tulsi Plant) పెంచుతారు. చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అంతే కాదు, వాస్తు శాస్త్రం ప్రకారం ఇది మంచిదని కూడా చెబుతారు. అయితే తులసి మెుక్క ఇంటికి చాలా మంచిది.. అయితే దీనిద్వారా చెడు శకునాలు కూడా గుర్తించొచ్చు. అది మంచి స్థితిలో ఉంటే, ఇంట్లో పరిస్థితి మంచిదని భావిస్తారు. మొక్క ఎండిపోతుంటే చెడ్డ శకునానికి సంకేతం కావచ్చు.

లేటెస్ట్ ఫోటోలు

మే 2, రేపటి రాశి ఫలాలు.. రేపు రాజకీయ నాయకులకు కష్టసమయం, శత్రువులను గుర్తించండి

May 01, 2024, 08:31 PM

Shukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే, కోరికలు నెరవేరతాయి

May 01, 2024, 02:35 PM

మే 1, రేపటి రాశి ఫలాలు.. పనిలో ఎదురయ్యే ఆటంకాలు తొలగుతాయి, ఎవరినీ చూసి మోసపోవద్దు

Apr 30, 2024, 09:06 PM

Gajakesari Raja Yoga : గజకేసరి రాజ యోగం.. వీరికి అన్ని విధాలుగా సూపర్

Apr 30, 2024, 02:10 PM

Gajakesari yogam: మే నెలలో అదృష్టాన్ని పొందబోతున్న రాశులు ఇవే.. ఆదాయం రెట్టింపు

Apr 30, 2024, 02:04 PM

అదృష్టం అంతా ఈ రాశి వారిదే! డబ్బు, ప్రమోషన్​.. అని సమస్యలు దూరం

Apr 30, 2024, 06:14 AM

పితృ దోషం :

మీ ఇంట్లో పితృ దోషం ఉండవచ్చు. ఇది తులసి మొక్క ఎండిపోవడానికి దారితీయవచ్చు. మీ ఇంట్లో పితృ దోషం కూడా ఇతర సమస్యలకు దారితీస్తుంది. వివాదాలకు కారణం కావచ్చు.

ఇబ్బంది సంకేతాలు :

ఇంట్లో ఉన్న తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోయినప్పుడు, అది మీ కుటుంబానికి పెద్ద ఇబ్బంది రాబోతోందని సూచిస్తుంది. అందుకే ముందుగా జాగ్రత్తలు పాటించాలి.

పేదరికం :

తులసి మొక్కను లక్ష్మీదేవికి చిహ్నంగా కూడా భావిస్తారు. అందువల్ల, తులసి మొక్క ఎండిపోయినప్పుడు మీకు ఆర్థిక సమస్యలు ఉండవచ్చని ఇది సూచిస్తుంది.

చెడుకు సంకేతం :

ఒక వ్యక్తి చెడు ప్రభావాలతో బాధపడుతుంటే, వారి ఇంటిలోని తులసి మొక్క ఎండిపోయే అవకాశాలు ఉన్నాయి.

వ్యాపారంలో నష్టం:

తులసి మొక్క ఎండిపోవడం ప్రారంభించినప్పుడు, మీరు వ్యాపారంలో నష్టాన్ని చవిచూడబోతున్నారని సూచిస్తుంది. అది చివరికి మీ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుంది.

హిందువులు అత్యంత పవిత్రంగా తులసి మెుక్కను చూసుకుంటారు. చాలా మంది తమ ఇంటి ముందు తులసిని పెట్టి పూజిస్తారు. శుభానికి ప్రతీకగా భావించే దీనిని పలు పూజల్లో ఉపయోగిస్తారు. అయితే ఒక్కోసారి ఎంత శ్రద్ధ తీసుకున్నా.. ఈ మొక్క వాడిపోతూ ఉంటుంది. అలా వాడిపోవడం వెనుక పైన చెప్పిన కారణాలు ఉంటాయని పండితులు చెబుతుంటారు.

ఏ కారణం లేకుండా తులసి వాడిపోతూ ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వాడిపోతుంది. అయితే ఇలా తులసి మొక్క వాడిపోతే కుటుంబంలో ఒక రకమైన సంక్షోభం వస్తుందని అంటారు. కుటుంబంలో ఏదైనా సంక్షోభం ఏర్పడితే.. ముందుగా లక్ష్మీ అంటే.. తులసి ఆ ఇంటి నుంచి వెళ్లిపోతుందని నమ్ముతారు. దీని ద్వారా అక్కడ పేదరికం వస్తుందని పలు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి.

టాపిక్