తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  స్త్రీలు రుతుస్రావంలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసాను పఠించవచ్చా? చాలీసా నియమాలేం చెబతున్నాయి?

స్త్రీలు రుతుస్రావంలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసాను పఠించవచ్చా? చాలీసా నియమాలేం చెబతున్నాయి?

Ramya Sri Marka HT Telugu

03 December 2024, 14:05 IST

google News
    • Dharma sandehalu: హిందూ నమ్మకాల ప్రకారం హనుమాన్ చాలీసా చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది.  హనుమాన్ చాలీసా పఠించడం వల్ల భక్తులకు శక్తి, ధైర్యంతో పాటు సంతోషం లభిస్తుంది. రుతుస్రావం సమయంలో ఆడవారు హనుమాన్ చాలీసాను పఠించవచ్చా? చాలీసా నియమాలు దీని గురించి ఏం చెబుతున్నాయి?
రుతుస్రావంలో హనుమాన్ చాలీసా పఠించవచ్చా?
రుతుస్రావంలో హనుమాన్ చాలీసా పఠించవచ్చా?

రుతుస్రావంలో హనుమాన్ చాలీసా పఠించవచ్చా?

హిందూమంతంలో చాలా మంది దేవతలు, దేవుళ్లు ఉన్నప్పటికీ హనుమంతుడు అంటే చాలా మందికి ప్రత్యేకమైన భక్తి. ఆంజనేయుడు అంటే శక్తివంతుడు, ధైర్యవంతుడు ఈయన్ని మనసారా ఆరాధిస్తే చెడు ఆలోచనలు, చెడు శక్తులు, భయాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. హనుమంతుడు రామ భక్తుడు కనుక దంపతులు హనుమంతుడిని పూజిస్తే వైవాహిక జీవితంలో సమస్యలు రావని కూడా విశ్వాసం. హనుమాన్ ఆరాధనలు ముఖ్యమైనది హనుమాన్ చాలీసా పఠనం. హిందూ నమ్మకాల ప్రకారం హనుమాన్ చాలీసాను పఠిస్తే పవనపుత్రుడిని ప్రసన్నం చేసుకొని ఆయన ఆశీర్వాదాలను కచ్చితంగా పొందవచ్చు. కాకపోతే హనుమాస్ చాలీసా చదవడానికి కొన్ని నియమ నిష్టలు ఉన్నాయి. వాటి ప్రకారం స్త్రీలు రుతుస్రావంలో హనుమాన్ చాలీసా చదవవచ్చా లేదా అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

Suzuki Jimny: 2024 థాయ్ లాండ్ ఇంటర్నేషనల్ మోటార్ షోలో మెరిసిన సుజుకి జిమ్నీ ఆఫ్ రోడ్ ఎడిషన్

Dec 04, 2024, 05:55 PM

2024 Honda Amaze: స్టన్నింగ్ లుక్స్, గ్రేట్ ఫీచర్స్ తో భారత మార్కెట్లోకి 2024 హోండా అమేజ్ లాంచ్

Dec 04, 2024, 05:38 PM

Mantras For Kids: మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారికి ఈ ఐదు మంత్రాలు తప్పకుండా నేర్పించండి

Dec 04, 2024, 05:30 PM

ISRO PSLV C-59 : పీఎస్ఎల్వీ సి-59 ప్రయోగం రేపటికి వాయిదా, ప్రోబా-3 శాటిలైట్ లో సాంకేతిక లోపం

Dec 04, 2024, 04:12 PM

ICC Test Rankings: బుమ్రా టాప్‌లోనే.. యశస్వి రెండు స్థానాలు కిందికి.. లేటెస్ట్ టెస్టు ర్యాంకులు ఇలా..

Dec 04, 2024, 02:25 PM

TG Indiramma Housing Scheme Updates : 'ఇందిరమ్మ ఇళ్ల యాప్' రెడీ..! లాంచింగ్ ఎప్పుడంటే..

Dec 04, 2024, 02:10 PM

హనుమాన్ చాలీసా ప్రత్యేకత:

చాలీసా అనేది హనుమంతుడిని స్తుతిస్తూ రూపొందించిన భక్తి గీతం. 16 వ శతాబ్దంలో తులసీదాస్ అనే కవి రచించిన రామచరితమానస్ అనే ఇతిహాసంలో చాలీసా ఒక చిన్న భాగం. తులసీదాస్ ఈ చాలీసా రచించడ వల్ల హనుమంతుడంటే భక్తులకు మరింత భక్తి నెలకొంది. హనుమాన్ చాలీసాలో అతీంద్రీయ శక్తులు, మానసిక సామర్థ్యాలు కలిగి ఉన్నాయని హిందువులు నమ్ముతారు.

స్త్రీలు రుతుస్రావ సమయంలో చాలీసాను పఠించవచ్చా?

వాస్తవానికి హనుమంతుడు బ్రహ్మాచారి. కనుక పవన పుత్రుడి పూజలో స్త్రీలు దూరంగా ఉండాలని అంతా అంటుంటారు.కానీ పురాణాల ప్రకారం స్త్రీలు హనుమంతుడిని నిశ్చితంగా ఆరాధించవచ్చు. వాస్తవానికి స్త్రీలంటే హనుమంతుడికి అపారమైన గౌరవం.ఆంజనేయుడు ప్రతి స్త్రీని తల్లిగా భావిస్తాడని ఇతిహాస గాథలు చెబుతున్నాయి. కనుక స్త్రీలు ఆంజనేయుడిని పూజించడంలో ఎలాంటి దోషం లేదు. కాకపోతే హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి తనను స్త్రీలు తాకకూడదు అనే నియమం ఉంది. కనుక ఆడవారు విగ్రహాన్ని తాకకుండా హనుమంతుడిని పూజించాలి.

అలాగే రుతుస్రావ సమయంలో హనుమాన్ చాలీసాను పఠించకూడదు అనేది చాలీసా నియమాల్లో ఎక్కడా లేదు. రుతుస్రావం అనేది ఆరోగ్య సమస్యే కానీ అపవిత్రమైన కార్యం కాదు. కనుక హనుమంతుడి చిత్రపఠానికి దూరంగా, మనసులో దేవుడికి దగ్గరగా ఉంటూ రుతుస్రావ సమయంలో కూడా నిర్భయంగా హనుమాన్ చాలీసాను పఠించవచ్చు. అలాగే నమస్కరించవచ్చు.

మరిన్ని చాలీసా నియమాలు:

  • చాలా మంది హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు నిశ్శబ్దంగా ఉంటారు. ఇది ఉత్తమ ఫలితాలను ఇవ్వదు. చాలీసాను గట్టిగా చదివేతే దాని ప్రభావం మనపై ఉంటుందని నమ్మిక.
  • హనుమాన్ చాలీసాను ఎప్పుడైనా, ఎక్కడైనా చదవచ్చు. కాకపోతే సూర్యోదయానికి ముందు అంటే తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య చదివితే మరింత శుభం.
  • చాలీసా నియమాల ప్రకారం హనుమాన్ చాలీసాను ప్రతిరోజూ చదవచ్చు. కదురని వారు ఆంజనేయుడికి ఇష్టమైన మంగళవారం, శనివారం రోజున 21 సార్లు పఠించవచ్చు.
  • మరో ముఖ్యనియమం ఏంటంటే ఒక్కసారి చాలీసా చదవడం మొదలు పెడితే దాన్ని మధ్యలో ఆపడం శుభప్రదం కాదు.
  • హనుమంతుడు సాత్విక ఆహారం మాత్రమే తినేవాడు. కనుక మాంసాహారం, మద్యం సేవించినప్పుడు హనుమాన్ చాలీసాను పఠించడం అశుభంగా పరిగణిస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం