తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వృషభ రాశిలో బుధాదిత్య యోగం.. ఈ 3 రాశులకు అదృష్ట యోగం

వృషభ రాశిలో బుధాదిత్య యోగం.. ఈ 3 రాశులకు అదృష్ట యోగం

HT Telugu Desk HT Telugu

17 May 2023, 9:43 IST

google News
    • సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య యోగం రూపొందుతుంది. ఈ యోగం కారణంగా పలు రాశుల జాతకులకు ప్రయోజనం కలుగుతుంది. ఏయే రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో ఇక్కడ చూడండి.
బుధాదిత్య యోగం వల్ల 3 రాశులకు అదృష్ట యోగం
బుధాదిత్య యోగం వల్ల 3 రాశులకు అదృష్ట యోగం

బుధాదిత్య యోగం వల్ల 3 రాశులకు అదృష్ట యోగం

వృషభ రాశిలో సూర్యుడు, బుధుడి కలయిక బుధాదిత్య రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఈ రాజయోగం పలు రాశుల జాతకులకు శ్రేయస్సు, సంపద, సంతోషాన్ని ఇస్తుంది. సూర్యుడు ఇప్పటికే మే 15, 2023న వృషభ రాశిలోకి సంచరించాడు. బుధుడు జూన్ 7, 2023న వృషభ రాశిలోకి సంచరిస్తాడు. అందువల్ల వృషభ రాశిలో సూర్యుడు బుధుడి కలయికతో జూన్ 7, 2023న బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది.

లేటెస్ట్ ఫోటోలు

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

Ananya Nagalla: ష‌ర్మిల‌మ్మ కొడుకు డిటెక్టివ్ అయితే - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌పై అన‌న్య నాగ‌ళ్ల కామెంట్స్‌!

Dec 21, 2024, 04:13 PM

Ram Charan: నా సోలో సినిమా వచ్చి నాలుగేళ్లపైనే అయింది.. గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం: డల్లాస్‍లో రామ్‍చరణ్

Dec 21, 2024, 02:59 PM

Anupama Parameswaran: బాధితురాలిగా అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ రూమ్ డ్రామా.. సూపర్ స్టార్‌తో కొత్త మూవీ (ఫొటోలు)

Dec 21, 2024, 01:36 PM

Cake Healthy or Unhealthy : హలో గురూ.. లొట్టలేసుకుంటూ కేక్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

Dec 21, 2024, 01:23 PM

పార్లమెంట్​ ఉన్నది కొట్టుకోవడానికే! కిందపడేసి కొట్టి, చంప చెళ్లుమనిపించి..

Dec 21, 2024, 01:04 PM

వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు శక్తి, అధికారం, నాయకత్వానికి ప్రతీక. బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్, నైపుణ్యానికి ప్రతీక. జాతకంలో ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు అవి ఒకరి వృత్తి, వ్యాపార, వ్యక్తిగత జీవితంలో విజయాన్ని తీసుకొస్తాయి.

వృషభ రాశి వారికి బుధాదిత్య యోగ ఫలితాలు

బుధాదిత్య యోగ కాలంలో వృషభ రాశి వారికి అదృష్టం వెన్నంటి ఉంటుంది. ఈ యోగం మీ జాతకం యొక్క మొదటి ఇంటిలో ఏర్పడుతుంది. ఇది మీ పని తీరును మెరుగుపరుస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ యోగం మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులను తెస్తుంది. అంతేకాకుండా మీ జాతకంలోని ఏడో ఇల్లు కూడా ఈ యోగం ద్వారా ప్రభావితమవుతుంది. దీని ఫలితంగా మీ భాగస్వామితో సంబంధం మెరుగ్గా ఉంటుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీరు అవివాహితులైతే వివాహ ప్రతిపాదనలు రావొచ్చు.

సింహ రాశి వారిపై బుధాదిత్య యోగ ఫలితం

సింహ రాశి వారికి బుధాదిత్య యోగం వల్ల వృత్తి వ్యాపారాల పరంగా అదృష్టం వరిస్తుంది. ఈ కాలం ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారులు తమ వ్యాపార కార్యకలాపాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు అనేక స్థాయిల్లో సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. అలాగే మీ పై అధికారులు మీ నైపుణ్యాలను గుర్తించి అభినందిస్తారు. ఉద్యోగార్థులు ఈ కాలంలో కొత్త జాబ్ ఆఫర్లు పొందుతారు. ఈ కాలం కెరీర్ ఎదుగుదలకు కూడా అవకాశాలు వస్తాయి. రాజకీయాలతో సంబంధం ఉన్న వారు ప్రయోజనం పొందుతారు.

కర్కాటక రాశి వారిపై బుధాదిత్య యోగ ఫలితం

కర్కాటక రాశి జాతకులు బుధాదిత్య యోగం వల్ల ఆర్థికంగా, రిలేషన్స్ విషయంలో అదృష్టం వెన్నంటి ఉంటుంది. ఇది మీ రాశి చక్రంలోని ఆదాయ గృషంలో ఏర్పడుతుంది. ఈ కాలంలో మీ ఆదాయం మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. మీరు గత పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యులతో మీ సంబంధం సానుకూలంగా ఉంటుంది. ధార్మిక, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇది కాకుండా మీరు ఈ సమయంలో స్టాక్ మార్కెట్, లాటరీ నుండి లాభం పొందే అవకాశం ఉంటుంది.

తదుపరి వ్యాసం