Ugadi 2023 Karkataka Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సర కర్కాటక రాశి ఫలాలు-ugadi 2023 karkataka rasi phalalu for shobhakrith nama samvatsaram in telugu by chilakamarti prabhakara chakravarthy sharma ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Ugadi 2023 Karkataka Rasi Phalalu For Shobhakrith Nama Samvatsaram In Telugu By Chilakamarti Prabhakara Chakravarthy Sharma

Ugadi 2023 Karkataka Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సర కర్కాటక రాశి ఫలాలు

HT Telugu Desk HT Telugu
Mar 16, 2023 05:23 AM IST

Ugadi 2023 Karkataka Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సర కర్కాటక రాశి ఫలాలను ఇక్కడ చదవొచ్చు. పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది కర్కాటక రాశి రాశి ఫలాలు 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది కర్కాటక రాశి రాశి ఫలాలు 2023

Ugadi 2023 Karkataka Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కర్కాటక రాశి ఫలితములు ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

కర్కాటక రాశి వారి ఆదాయం -11, వ్యయం - 8, రాజపూజ్యం - 5 అవమానం- 4 పాళ్లుగా ఉన్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం నందు కర్కాటక రాశి వారికి చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా చూసినప్పుడు ఈ సంవత్సరం బృహస్పతి దశమ స్థానము నందు సంచరిస్తోంది. శని అష్టమ స్థానమునందు సంచరిస్తోంది. రాహువు దశమ స్థానముయందు సంచరిస్తోంది. అలాగే కేతువు 4వ స్థానమునందు సంచరిస్తోంది. ఈ స్థితి వల్ల కర్కాటకరాశి వారికి ఈ సంవత్సరంలో శని ప్రభావం చేత ఇబ్బందికరమైనటువంటి స్థితి ఏర్పడినది.

అష్టమ శని ప్రభావం వలన ఆరోగ్య వ్యవహారాలయందు కుటుంబ వ్యవహారాల యందు ఇబ్బందులు ఏర్పడును. రాజ్య స్థానము నందు గురు రాహువులు సంచరించుట వలన వృత్తి ఉద్యోగములయందు చికాకులు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు కఠినమైన సమయము.

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక రాశి వారు గొడవలకు దూరంగా ఉండటం, కోర్టు వ్యవహారాలలో జాగ్రత్తలు వహించడం మంచిది. కర్కాటక రాశి వారికి చతుర్థ స్థానమునందు కేతువు ప్రభావం వలన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, కుటుంబమునకు సంబంధించిన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు.

కర్కాటక రాశి ఉద్యోగులకు ఉగాది 2023 రాశి ఫలాలు

కర్కాటక రాశివారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరమందు ఉద్యోగస్తులకు మధ్యస్త ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగము నందు రాజకీయ ఒత్తిడులు ఏర్పడినప్పటికి మీయొక్క కృషితో విజయము వైపు దూసుకుపోవుదురు.

కర్కాటక రాశి వ్యాపారస్తులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మధ్యస్త ఫలితాలు కలుగజేస్తాయి. వ్యాపారంలో చికాకులు అధికముగా ఉండును. ఆరోగ్య సమస్యలు మరియు రాజకీయ సమస్యలు వ్యాపారంపై చెడు ప్రభావం కలిగించును. కర్కాటక రాశి విద్యార్థులకు మధ్యస్త ఫలితాలు ఏర్పడుతున్నాయి. కష్టపడాల్సినటువంటి సమయము.

కర్కాటక రాశి స్త్రీలకు కుటుంబ సమస్యలు మరియు ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు ఏర్పడును. కర్కాటక రాశి రైతాంగానికి అంత అనుకూలంగా లేదు. కర్కాటక రాశి సినీ రంగం వారికి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి.

కర్కాటక రాశివారు ఈ సంవత్సరం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సోమవారం శివాలయంలో శివునికి అభిషేకం చేసుకుని మరియు శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించడం, శనికి తైలాభిషేకం చేసుకోవడం వలన మరిన్ని శుభఫలితాలు పొందెదరు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

కర్కాటక రాశి మాసవారి రాశి ఫలాలు

ఏప్రిల్ :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మికత మరియు ఆనందంగా జీవనం సాగిస్తారు. మీరు వృత్తి వ్యాపారాలతో అధికాదాయాన్ని పొందుతారు. జీవితభాగస్వామితో మీ సంబంధం కూడా మధురంగా ఉంటుంది.

మే :- ఈ మాసం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలయందు అనుకూల పరిస్థితులు. వ్యాపారస్తులకు అధిక లాభాలు. ఉద్యోగ ఉన్నతి కలుగుతుంది. మానసిక ప్రశాంతత. ఆనందముగా గడుపుతారు. కుటుంబ వాతావరణం అనుకూలించును.

జూన్:- ఈ మాసం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు. వ్యాపారం లాభదాయకం. ఊహించని లాభాలను తెస్తుంది. పదోన్నతితో కూడిన స్థానచలనాలు.

జూలై :- ఈ మాసం అనుకూలంగా ఉంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం అనుకూలించును. దూర ప్రయాణాలు కలసివస్తాయి. పదోన్నతి లేదా వేతనాలు పెరిగే అవకాశం. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

ఆగస్టు:- ఈ మాసం అనుకూలంగా ఉంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలించును. ప్రయాణాలు అనుకూలించును. సంతానం విషయంలో శ్రద్ధగా ఉంటారు. ఆరోగ్య విషయాలకు ఇది మంచి కాలం.

సెప్టెంబర్:- ఈ మాసం మధ్యస్తంగా ఉంది. నాణ్యమైన వృత్తి, వ్యాపార నైపుణ్యాలను, ఇతరులతో సత్సంబంధాలు కొనసాగించడానికి సహెూద్యోగులతో వాదనలను మానుకోవడం మంచిది. ఆర్థిక వనరులు పెరిగి లాభాల బాటలో ఉంటారు. ఇతరులకు తోచిన సహాయం చేస్తారు.

అక్టోబర్:- ఈ మాసం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతుంది. గృహ వాతావరణం బాగుంటుంది. సమాజంలో పెద్దవారికి మీ సలహాలు సూచనలు అవసరం. మిమ్ములను సంప్రదించడం ద్వారా కార్య సిద్ధి. నియామకపు పరీక్షలలో గెలుపొందుతారు. 

నవంబర్:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. నూతన వస్త్రాభరణ ప్రాప్తి. మీరు కుటుంబంతో విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రభుత్వం నుండి ఆదాయం పొందుతారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

డిసెంబర్:- ఈ మాసం అనుకూలంగా ఉంది. గ్రహస్థితి అనుకూలం. స్నేహితుల వలన లాభాలు. వ్యాపారస్తులు అనుకూలం. శత్రువులపై జయం. శుభవార్తలు వింటారు. కీర్తి ప్రతిష్ట. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

జనవరి :- ఈ మాసం అనుకూలంగా ఉంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. సామాజిక విషయాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ స్థానం.

ఫిబ్రవరి :- ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యము సామాన్యముగా ఉండును. పిల్లలతో సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలు కలసిరావు. చెడు సహవాసాలకు దూరం. తోటి ఉద్యోగులతో వివాదాలు. విద్యార్థులు కష్టపడవలసినటువంటి సమయం.

మార్చి: - ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. సంతోషకరమైన మరియు అదృష్టప్రదమైన కాలం. మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. సంపాదన మెరుగుపడుతుంది

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel

సంబంధిత కథనం