తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Feng Shui Tips: హోలీకి ముందే ఈ వస్తువులు మీ ఇంటికి తెచ్చుకోండి.. ఆర్థికంగా కలిసొస్తుంది

Feng shui tips: హోలీకి ముందే ఈ వస్తువులు మీ ఇంటికి తెచ్చుకోండి.. ఆర్థికంగా కలిసొస్తుంది

Gunti Soundarya HT Telugu

14 March 2024, 9:59 IST

    • Feng shui tips: ఫెంగ్‌షూయి, వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులని హోలీ పండుగకు ముందే ఇంటికి తీసుకురావడం వల్ల మీ సంపద పెరుగుతుంది. అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది. 
హోలీకి ముందే ఈ వస్తువులు ఇంటికి తీసుకురండి
హోలీకి ముందే ఈ వస్తువులు ఇంటికి తీసుకురండి (pixabay)

హోలీకి ముందే ఈ వస్తువులు ఇంటికి తీసుకురండి

Feng shui tips: ఈ మధ్యకాలంలో వాస్తు శాస్త్రంతో పాటు ఫెంగ్‌షూయి కూడా చాలా బాగా ప్రాచుర్యం పొందింది. ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఫెంగ్ షూయి శాస్త్రంలో అనేక చిట్కాలు ఉన్నాయి. వాటి సహాయంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవచ్చు.

లేటెస్ట్ ఫోటోలు

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

ఫెంగ్ షూయి ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంటికి ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. డబ్బు సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే హోలీకి ముందుగానే ఫెంగ్ షూయికి సంబంధించిన అదృష్ట వస్తువులు కొన్ని మీ ఇంటికి తీసుకురండి.

ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 25న హోలీ వేడుకలు జరగనున్నాయి. ఫెంగ్ షూయి ప్రకారం హోలీ కి ముందు ఈ వస్తువులు తీసుకురావడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఇవి ఇంట్లో సానుకూల శక్తిని ప్రసరింపజేస్తాయి. జీవితంలో సంతోషం, శ్రేయస్సు తీసుకొస్తుందని నమ్ముతారు.

తాబేలు

కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే హోలీ కి ముందే మీరు ఫెంగ్ షూయి తాబేలు ఇంటికి తీసుకురండి. ఇంట్లో లేదా ఆఫీస్‌లో ఈ తాబేలు ఉంచడం వల్ల సమాజంలో మీ గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఆదాయం పెరుగుతుంది.

చైనా నాణేలు

ఫెంగ్ షూయి శాస్త్రంలో చైనా నాణేలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నాణేలు ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రశ్నిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఉన్న మరొక మార్గం ఈ చైనా నాణేలు ఇంట్లో పెట్టుకోవడం. వీటిని ఎర్రటి వస్త్రంలో బియ్యం గింజలతో కట్టి మీరు డబ్బు నిల్వ చేసుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల డబ్బు కొరత తొలగిపోతుందని నమ్ముతారు.

వెదురు మొక్క

ఫెంగ్ షూయి ప్రకారం వెదురు మొక్కని లక్కీ ప్లాంట్ గా భావిస్తారు. ఇది ఇంటికి చాలా అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. ఈ వెదురు మొక్కని మీ ఇంట్లో తూర్పు దిక్కున పెట్టుకోవడం వల్ల కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు నెలకొంటుంది.

లాఫింగ్ బుద్ధ

సంపదని తీసుకొచ్చే లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే చాలా మంచిది. దీన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా పవిత్రంగా భావిస్తారు. హోలీకి ముందే మీరు ఇంట్లో లాఫింగ్ బుద్ధ తెచ్చుకుంటే మీ ఇంట సిరిసంపదలకు లోటు ఉండదు. సౌభాగ్యం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా లాఫింగ్ బుద్ద పెట్టడం వల్ల మీరు ఇంట్లోకి ప్రవేశించగానే మీ మొదటి చూపు దాని మీదే పడుతుంది. ఇది ఇంట్లో ఉండటంవల్ల ఆర్థికంగా పురోభివృద్ది సాధిస్తారు.

ఫిష్ అక్వేరియం

ఆర్థికంగా బలహీనంగా ఉంటే మీరు హోలీ రోజున ఫిష్ అక్వేరియం ఇంటికి తీసుకురండి. ఇంట్లో ఇది ఉండడం వల్ల పేదరికం తొలగిపోతుంది. ఆర్థికంగా బలపడతారు.

ఫెంగ్ షూయితో పాటు వాస్తు ప్రకారం కూడా కొని వస్తువులు తీసుకురావడం వల్ల మీ ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి. కుటుంబంలో నెలకొన్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

తోరణం

వాస్తు దోషాలను తొలగించుకోవడానికి హోలాష్టక్ లేదా హోలికా దహనం రోజు లోపు మీ ఇంటి గుమ్మానికి తోరణం ఏర్పాటు చేసుకోండి. లేదా మామిడి ఆకులతో తోరణాన్ని కట్టుకోండి. ఇది ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మారుస్తుంది.

క్రిస్టల్ తాబేలు

సంపద, ఆనందం, శ్రేయస్సును పెంచేందుకు క్రిస్టల్ తాబేలు ఇంట్లో పెట్టుకోవచ్చు. హోలీ ముందు మీరు క్రిస్టల్ తాబేలు లేదా ఏదైనా లోహంతో చేసిన తాబేలు ప్రతిమ కూడా మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి.

విండ్ చైమ్

హోలీ కంటే ముందు మీరు మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు విండ్ చైమ్. 5, 7, 11 కర్రలతో ఉన్న విండ్ చైమ్స్ ఇంటికి తీసుకురావడం మంచిది. కుటుంబ జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుంది. సంతోషం, సౌభాగ్యం నెలకొంటాయి.

తదుపరి వ్యాసం