Wind chime vastu tips: కుటుంబ కలహాలు తొలగించేందుకు ఈ విండ్ చైమ్ ఇంట్లో వేలాడదీయండి
Wind chime vastu tips: విండ్ చైమ్ కి ఈ మధ్య కాలంలో ప్రాచుర్యం పెరిగింది. ఇది ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఎటువంటి విండ్ చైమ్ ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా?
Wind chime vastu tips: ఇంటికి అలంకరణ వస్తువులుగా చాలా మంది విండ్ చైమ్ ని వరండాలో వేలాడదీసుకుంటూ ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి మంచి శబ్ధంతో పాటు ఇంటికి అందానిం కూడా అందిస్తున్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రమే కాదు ఫెంగ్ షూయిలోనూ విండ్ చైమ్ కి అధిక ప్రాధాన్యత ఉంటుంది.
వాస్తు దోషాన్ని తొలగించడంలో విండ్ చైమ్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని ఆకర్షించేలా చేయడంలో విండ్ చైమ్ మంచి నివారణగా ఉపయోగపడుతుంది. వీటిని సరైన దిశలో ఉంచాలి. అప్పుడే వాటికున్న శక్తి సరిగా పని చేస్తుంది. గాలి వీచినప్పుడు విండ్ చైమ్ చేసే శబ్ధంతో నిర్ధిష్ట స్థలంలోని శక్తిని శుద్ధి చేస్తుంది.
కుటుంబంలో తరచూ గొడవలు, ఘర్షణ వాతావరణం ఉంటే ఆ జీవితం నరకంగా ఉంటుంది. నిత్యం ఏదో ఒక సమస్యతో మనశ్శాంతి లేకుండా ఉంటుంది. అటువంటి వాళ్ళు విండ్ చైమ్ తీసుకొచ్చి వరండాలో తగిలించుకుంటే కుటుంబ కలహాలు తగ్గిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. కుటుంబానికి విజయాన్ని అందిస్తాయి. అదృష్టం మీ వెంటే ఉండేలా చేస్తుంది.
ఏ దిశలో విండ్ చైమ్ తగిలించాలి?
ఏ పదార్థంతో తయారు చేసిన విండ్ చైమ్ ఎంచుకుంటున్నామనేది ముఖ్యమే. మెటల్ విండ్ చైమ్ అయితే పశ్చిమ దిశలో పెట్టాలి. ఇది ఇంటికి శ్రేయస్సుని అందిస్తుంది. వాయువ్యంలో ఉంటే మీకు జీవితంలో సహాయపడే వ్యక్తులని దగ్గర చేస్తుంది. ఇక చెక్కతో చేసిన విండ్ చైమ్ తీసుకుంటే దాన్ని దక్షిణం లేదా తూర్పు లేదా ఆగ్నేయ దిశలో తగిలించాలి.
చెక్క లేదా వెదురుతో చేసిన వాటి వల్ల ఆరోగ్యం మెరుగుదలని సూచిస్తుంది. ఆగ్నేయంలో తగిలిస్తే సంపదని ఆకర్షిస్తుంది. మట్టి లేదా పింగాణితో చేసిన విండ్ చైమ్ ఇంట్లో పెట్టుకుంటే జ్ఞానం, అదృష్టాన్ని తెస్తుంది. ఫెంగ్ షూయి శాస్త్రం ప్రకారం వీటిని ఈశాన్యం, ఆగ్నేయ దిశలో వేలాడదీయాలి.
ఇంట్లో విండ్ చైమ్ వేలాడదీయొచ్చా?
ఎక్కువ మంది వీటిని వరండా లేదా బాల్కనీలో వేలాడదీస్తారు. ఇంట్లో సానుకూల శక్తి ఉండేలా చూడటం కోసం చాలా మంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టుకుంటారు. పడక గదిలో విండ్ చైమ్ పెట్టుకోవాలని అనుకుంటే మీరు గది ప్రవేశ ద్వారం దగ్గర పెట్టుకోవచ్చు. దీని వల్ల వచ్చే సౌండ్ ప్రశాంతతని ఇస్తుంది. అయితే పడుకునే మంచం పక్కన మాత్రం పెట్టుకోవద్దు. వాయువ్యం లేదా నైరుతి దిశలో పెట్టుకుంటే మీ శృంగార జీవితం బాగుంటుంది.
విండ్ చైమ్ లో ఎన్ని రాడ్స్ ఉండాలి?
విండ్ చైమ్ లో ఉండే రాడ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పొడవుగా ఉండే విండ్ చైమ్ లు తక్కువ శబ్దాన్ని ఇస్తాయి. అందుకే పొట్టిగా ఉండే వాటిని కొనుగోలు చేయండి. కుటుంబంలో ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటే ప్రశాంతత కోసం 2-3 రాడ్లు ఉన్న విండ్ చైమ్ పెట్టుకోండి.
మూడు, ఆరు, తొమ్మిది ఉన్న రాడ్లు ఉన్న విండ్ చైమ్ పెట్టుకుంటే విజయం మీ సొంతం అవుతుంది. ఐదు రాడ్లు ఉన్నవి ఎంచుకోవచ్చు. ఏడు రాడ్లు అదృష్టాన్ని ఇస్తాయి. జ్ఞానాన్ని పెంచుతాయి. ఎనిమిది రాడ్లు విజయాన్ని ఆకర్షిస్తాయి. తొమ్మిది రాడ్లు ఉన్న విండ్ చైమ్ లు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి.