Holashtak: హోలాష్టక్ ఎప్పుడు? ఈ సమయంలో చేయకూడని పనులు ఏంటి? శుభకార్యాలు ఎందుకు నిర్వహించరు?
Holashtak: ఈ ఏడాది హోలాష్టక్ మార్చి 17వ తేదీ వచ్చింది. ఆరోజు నుంచి ఎనిమిది రోజుల పాటు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు. ఈ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు? శుభకార్యాలు నిర్వహించకపోవడం వెనుక కారణం తెలుసుకుందాం.
Holashtak: హోలాష్టక్ అనే పదం ‘హోలీ’, ‘అష్టక్’ అనే పదాల కలయిక నుంచి ఏర్పడింది. హోలీకి ఎనిమిది రోజుల ముందు నుంచి హోలాష్టక్ ప్రారంభం అవుతుంది. మత విశ్వాసాల ప్రకారం ఈ ఎనిమిది రోజులు వివాహాలు, వేడుకలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు నిర్వహించరు. హోలాష్టక్ సమయంలో గ్రహాల పరిస్థితులు ప్రతికూల స్థితిలో ఉంటాయి. ఫలితంగా ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి.
ఈ ఏడాది హోలాష్టక్ మార్చి 17, 2024 నుంచి ప్రారంభం అవుతుంది. ఫాల్గుణ మాసం ఎనిమిదో రోజు నుంచి ప్రారంభమై మార్చి 24వ తేదీతో ముగుస్తుంది. ఆ రోజున హోళికా దహనం వేడుక నిర్వహిస్తారు. హోలీ పండుగ జరుపుకుంటారు.
హోలాష్టక్ చరిత్ర
పురాణాల ప్రకారం హోలాష్టక్ అంటే హోలీ ఎనిమిది రోజులు ముందు నిర్వహిస్తారు. హిరణ్యకశ్యపుడు కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి మహా గొప్ప భక్తుడు. అయితే తండ్రి హిరణ్యుడు ఒక రాక్షసుడు తనని తప్ప వేరే దేవతలని ఆరాధించేందుకు అంగీకరించేవాడు కాదు. కానీ ప్రహ్లాదుడు మాత్రం విష్ణువును పూజించేవాడు. కొడుకు ప్రవర్తనతో కోపోద్రోక్తుడుగా మారి తనని తీవ్ర హింసకు గురి చేశాడు.
ఏడు రోజులపాటు హింసలకు గురి చేశాడు. ప్రహ్లాదుని ప్రవర్తనతో విసిగిపోయిన హిరణ్యుడు తనని మంటల్లో వేయాలని నిర్ణయించుకుంటాడు. ఎనిమిదో రోజు హిరణ్యుడు సోదరి హోలికను పిలిచి ప్రహ్లాదుడిని ఒడిలో పెట్టుకుని కూర్చోమని చెప్తాడు. ఆమెకి మంటలు అంటుకోకుండా ఒక వస్త్రం ఇస్తాడు. హోలికా అలాగే చేస్తుంది. కానీ ప్రహ్లాదుడి విష్ణు భక్తి కారణంగా మంటల్లో హోలిక దహనం అవుతుంది. దీన్నే హోలికా దహనం అంటారు.
హోలాష్టక్ సమయంలో ఏం చేయకూడదు
హోలాష్టక్ సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తి పెరుగుతుంది. సానుకూల ప్రయత్నాలు కూడా ప్రతికూలంగా మారతాయి. హిందూ సంప్రదాయ ప్రకారం ఈ సమయంలో గ్రహాలు ఉగ్రరూపం దాల్చడం వల్ల శుభకార్యాలు నిర్వహించరు. హోలాష్టక్ సమయంలో కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం, షాపింగ్ చేయడం వంటివి శుభప్రదంగా పరిగణించరు.
బంగారం, వెండి వంటి విలువైన లోహాలు కూడా కొనుగోలు చేయరు. హవనం, యాగం కూడా చేయరు. మార్చి 17 నుంచి హోలాష్టక్ ప్రారంభమవుతుంది. కానీ మార్చి 14న సూర్యుడు మీన రాశి ప్రవేశం చేస్తాడు. బృహస్పతికి చెందిన రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో ఖర్మ రోజులు ప్రారంభం అవుతాయి. ఫలితంగా నెల రోజుల పాటు ఎటువంటి శుభ కార్యాలు జరిపించేందుకు అనువైన సమయం కాదు.
హోలాష్టక్ సమయంలో అన్ని గ్రహాలు ప్రతికూల పరిస్థితుల్లో ఉంటాయి. అష్టమి నాడు చంద్రుడు, నవమినాడు సూర్యుడు, దశమినాడు శని, ఏకాదశి నాడు శుక్రుడు, ద్వాదశి నాడు గురుడు, త్రయోదశినాడు బుధుడు, చతుర్దశినాడు కుజుడు, పౌర్ణమి రోజు రాహువు ఉగ్రరూపం దాలుస్తారు. ఈ కారణంగా ఎనిమిది రోజులను హోలాష్టక్ గా పరిగణిస్తారు. ఈ కాలంలో వ్యాపారం, వాహన కొనుగోలు, గృహప్రవేశం, శంకుస్థాపనలు, వివాహం వంటివి చేయరు.
హోలాష్టక్ సమయంలో శుభకార్యాలు నిర్వహించక పోవడానికి వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఫాల్గుణ మాసం లో వచ్చే అష్టమి నుంచి ప్రతికూల శక్తి ప్రకృతిలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల ఈ సమయంలో ఎటువంటి శుభ కార్యాలు నిర్వహించరు. దీనితో పాటు ఖర్మ రోజులు కూడా ఉండటంతో ఏప్రిల్ 13 వరకు శుభకార్యాలు చేసేందుకు మంచి రోజులు లేవు. ఏప్రిల్ నెల మాత్రమే శుభ కార్యాలు జరుపుకునేందుకు ముహూర్తాలు ఉన్నాయి. మళ్ళీ మే, జూన్ నెలలో బృహస్పతి, శుక్రుడు అస్తమించడం వల్ల ముహూర్తాలు లేకుండా మూఢంగా పరిగణిస్తారు.