తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సెప్టెంబర్ 12, నేటి రాశిఫలాలు- ఈ రాశుల వారికి అదృష్ట కాలం నడుస్తోంది

సెప్టెంబర్ 12, నేటి రాశిఫలాలు- ఈ రాశుల వారికి అదృష్ట కాలం నడుస్తోంది

HT Telugu Desk HT Telugu

12 September 2024, 0:01 IST

google News
  • Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 12.09.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

సెప్టెంబర్ 12 నేటి రాశిఫలాలు
సెప్టెంబర్ 12 నేటి రాశిఫలాలు

సెప్టెంబర్ 12 నేటి రాశిఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 12.09.2024

లేటెస్ట్ ఫోటోలు

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

ఇతరులు ఈర్ష పడేలా ఈ 3 రాశుల భవిష్యత్తు- ఇల్లు కొంటారు, డబ్బుకు లోటు ఉండదు!

Dec 21, 2024, 05:40 AM

బుధాదిత్య రాజయోగం: ఈ మూడు రాశుల వారికి మారనున్న అదృష్టం.. లాభాలు, సంతోషం దక్కనున్నాయి!

Dec 20, 2024, 02:27 PM

ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం- భారీ ధన లాభం, జీవితంలో సక్సెస్​!

Dec 20, 2024, 06:01 AM

కొత్త సంవత్సరానికి ముందు బుధుడి నక్షత్ర సంచారంతో ఈ రాశులకు అదృష్టం

Dec 19, 2024, 01:51 PM

ఈ తేదీల్లో పుట్టిన వారికి 2025లో లక్కే లక్కు.. ప్రేమలో గెలుపు, ఆర్థిక లాభాలు ఇలా ఎన్నో ఊహించని మార్పులు

Dec 19, 2024, 09:49 AM

వారం: గురువారం, తిథి: న‌వ‌మి,

నక్షత్రం: మూల‌, మాసం: భాద్ర‌ప్ర‌ద‌,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

అనుకూలమైన కాలం. విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఆత్మీయుల ప్రోత్సాహం లభిస్తుంది. మీ వల్ల కొందరికి మేలు కలుగుతుంది. కొత్త నిర్ణయాలను అమలు చేస్తారు. లౌక్యంగా వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు. శత్రు దోషం తొలగుతుంది. దేనిగురించీ లోతుగా ఆలోచించొద్దు. లక్ష్మీదేవిని ధ్యానించండి.

వృషభం

మనోబలంతో ముందుకెళ్లండి. కొన్ని విఘ్నాలు ఎదురైనా అంతిమ విజయం మీదే. పనులు వాయిదా వేయకండి. సమయానుకూల స్పందనతో ఒత్తిడిని అధిగమిస్తారు. వ్యాపారంలో దూకుడు పనికిరాదు. కొత్తవారిని నమ్మకండి. మిశ్రమకాలం నడుస్తోంది. కీల‌క విష‌యంలో విజయం సాధిస్తారు. ఇష్టదైవాన్ని స్మరించండి.

మిథునం

సూర్యబలం అపారంగా ఉంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఎంతోకాలంగా పరిష్కారం కాని పనులు కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో స్థిరమైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారయోగం శుభప్రదం. వివాదాలకు దూరంగా ఉండండి. చంచలత్వం పనికిరాదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి.

కర్కాటకం

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది. మీ నిర్ణయాలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. మరింత మనోబలం అవసరం. స్థిరమైన ప్రయత్నాలతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. పనులు వాయిదా వేయకండి. జాగ్రత్త పడకపోతే, అనవసర చర్చలతోనే కాలం వృథా అవుతుంది. అధికారులతో నేర్పుగా వ్యవహరించాలి. వ్యాపార విషయాల్లో శ్రద్ధ అవసరం. ఇష్టదైవాన్ని స్మరించండి.

సింహం

సకాలంలో కొత్త పనులు ప్రారంభించండి. కృషిని బట్టి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఆర్ధిక వృద్ధిని సాధిస్తారు. రుణ సమస్యలకు ఆస్కారం ఇవ్వొద్దు. అపార్థాలు ఆత్మీయులతో దూరాన్ని పెంచుతాయి. స్పష్టంగా మాట్లాడండి. కొందరి అసూయాద్వేషాలు ఇబ్బంది పెడతాయి. సూర్యభగవానుడిని ధ్యానించండి.

కన్య

అదృష్టం కాలం నడుస్తోంది. వ్యాపారంలో కలిసొస్తుంది. ధనధాన్య యోగాలున్నాయి. మనోబలంతో ముందడుగు వేస్తారు. మీరు త‌ల‌పెట్టిన పని పూర్తవుతుంది. వివాదాలకు తావివ్వకండి. ఎవరినీ నొప్పించకుండా సంభాషించండి. ముఖ్య నిర్ణయాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించండి. లక్ష్మీదేవిని ఆరాధించండి.

తుల‌

శుభ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతి సూచనలు కనిపిస్తున్నాయి. కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది. ఇతరులపై ఆధారపడితే సమస్యలు తప్పవు. సమాజంలో పేరు సంపాదిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. పొదుపు మదుపు ద్వారా ఆర్థిక సమస్యలను నిరోధించవచ్చు. విష్ణుసహస్రనామం చదువుకోవాలి.

వృశ్చికం

మీ కృషి ఫలిస్తుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. తోటివారి సహాయంతో లక్ష్యాలను సాధిస్తారు. భూ, గృహ, వాహనాది యోగాలున్నాయి. అనూహ్యమైన విజయం వరిస్తుంది. ఎవరి ప్రభావానికి గురికావద్దు. స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల అండతో సమస్యల్ని అధిగమిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి.

ధనుస్సు

సకాలంలో పనులను ప్రారంభించండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. నిరాశవద్దు. పరాధీనత పనికిరాదు. గిట్టనివారు రెచ్చగొట్టినా ఆవేశపడకండి. ఏ విషయాన్ని అయినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓ ఆపద నుంచి బయటపడతారు. ప్రణాళికతో పనిచేయడం వల్ల వ్యాపార నష్టాలను అధిగమిస్తారు. నవగ్రహ శ్లోకాలను పఠించండి.

మకరం

అదృష్టం వరిస్తుంది. శుభ ఫలితాలు ఉన్నాయి. మనోబలం ముందుకు నడిపిస్తుంది. వ్యాపార వ్యవహా రాల్లో ఏకాగ్రత అవసరం. మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆత్మవిశ్వాసంతో ఒత్తిడిని అధిగమిస్తారు. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. వినయవిధేయతలు చాలా అవసరం. శుభం జరుగుతుంది. మహాలక్ష్మి అమ్మవారిని ఉపాసించండి.

కుంభం

మనోబలంతో వ్యవహరించండి. సకాలంలో నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారయోగం బలంగా ఉంది. అభీష్టసిద్ధి కలుగుతుంది. పెట్టుబడులు కలిసొస్తాయి. చరాస్తులు వేగంగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో జాగ్రత్త అవసరం. ఎవరితోనూ అతిచనువు వద్దు. కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. సూర్యభగవానుడిని ఆరాధించండి.

మీనం

నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి ఉద్యోగులకు ఈరోజు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అధికార యోగం సూచితం. చిన్నపాటి అవరోధాలు ఎదురైనా నిరుత్సాహం వద్దు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. అనేక గ్రహాలు వ్యతిరేకంగా సంచరిస్తున్నాయి. కాబట్టి, ప్రతికూల ఆలోచనలు చేయకండి. ముఖ్య నిర్ణయాల విషయంలో నలుగురి అభిప్రాయాలూ తీసుకోండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం