తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Ormax Stars India Loves Most Popular Female Film Stars In India

Ormax Stars in India : టాలీవుడ్ అయినా.. బాలీవుడ్ అయినా.. సమంతానే నెంబర్ 1

24 November 2022, 13:15 IST

కొన్నేళ్లుగా హీరోలతో పాటు నటీమణుల స్థాయి కూడా అమాంతంగా పెరిగిపోతుంది. తమ అందచందాలతో, నటనతో అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఇండియాలోనే కాకుండా.. విదేశాలలో కూడా వీరిని ఇష్టపడుతున్నారు అభిమానులు. తాజాగా Ormax భారతదేశపు అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్ల జాబితాను విడుదల చేసింది. వారిలో ఎవరెవరు ఉన్నారంటే..

  • కొన్నేళ్లుగా హీరోలతో పాటు నటీమణుల స్థాయి కూడా అమాంతంగా పెరిగిపోతుంది. తమ అందచందాలతో, నటనతో అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఇండియాలోనే కాకుండా.. విదేశాలలో కూడా వీరిని ఇష్టపడుతున్నారు అభిమానులు. తాజాగా Ormax భారతదేశపు అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్ల జాబితాను విడుదల చేసింది. వారిలో ఎవరెవరు ఉన్నారంటే..
సమంతా రూత్ ప్రభు వరుస హిట్లతో.. మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్‌లో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్​తో.. పాన్ ఇండియా ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాకుండా ఒక్క ఐటమ్ సాంగ్​తో యావత్తు దేశాన్ని కుదిపేసింది ఈ భామ. తాజాగా యశోదతో మరో హిట్​ను తన ఖాతాలో వేసుకుంది. శాకుంతలం, ఖుషి విడుదలకు సిద్ధమవుతున్నాయి. అంతేకాకుండా తన ఫోటోషూట్​లతో కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ భామ.
(1 / 11)

ఈ జాబితాలో ఆలియా భట్ రెండవ స్థానంలో ఉంది. 2022 ఆలియాకు చాలా ప్రత్యేకమైనది. RRR, గంగూభాయ్ సినిమాలతో.. ప్రారంభించి.. డార్లింగ్స్, బ్రహ్మస్తతో కూడా హిట్స్ కొట్టింది. పర్సనల్ జీవితంలో కూడా ఆమెకు ఈ సంవత్సరం ప్రత్యేకమే. రణబీర్​ని పెళ్లి చేసుకుని తాజాగా ఓ పాపకు తల్లి కూడా అయ్యింది.
(2 / 11)

నటి నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్​గా పేరు సంపాదించిన ఈ భామ.. మూడవ స్థానంలో ఉంది. తన అద్భుతమైన నటన, మనోహరమైన శైలితో ప్రతిసారీ అభిమానుల హృదయాలను గెలుచుకుంటుంది. ఇటీవల డైరక్టర్​ని పెళ్లాడి.. సరోగసి ద్వారా పిల్లలకు తల్లైంది.
(3 / 11)

కాజల్ అగర్వాల్ సౌత్​తో పాటు హిందీ చిత్రసీమలో కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. సోగకళ్ల ఈ సుందరి.. ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. కాజల్ అగర్వాల్ తన సింప్లిసిటీతో అభిమానుల హృదయాలను దోచుకుంది. ఇటీవల పెళ్లి చేసుకుని.. తల్లైంది.
(4 / 11)

దీపికా పదుకొణె ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నప్పటికీ.. ఆమె జాబితాలో రెండవ బాలీవుడ్ నటి. దీపికా పదుకొణె హిందీలోనే కాకుండా హాలీవుడ్‌లో కూడా పనిచేసింది. సోషల్ మీడియాలో కూడా ఆమె తన స్టైల్​తో అభిమానులను ఆకట్టుకుంటుంది.
(5 / 11)

నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న.. తన క్యూట్‌నెస్, సిజ్లింగ్ పర్సనాలిటీతో అభిమానులను ఆకట్టుకుంటుంది. తన నటనతో కూడా అభిమానులను సంపాదించుకున్న ఈ భామ.. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
(6 / 11)

ఈ జాబితాలో మూడవ, చివరి బాలీవుడ్ నటి కత్రినా కైఫ్. ఇటీవల ఫోన్ భూత్‌లో కనిపించిన కత్రినా నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. తాజాగా విక్కీ కౌశల్​ని పెళ్లి చేసుకున్న ఈ భామ.. ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉంది.
(7 / 11)

అనుష్క శెట్టికి సౌత్ సినిమాలో పెద్ద పేరు ఉంది. ఆమె సినిమాలు చేయకున్నా.. ఆమె అభిమానులు మాత్రం తగ్గలేదు. గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా స్వీటి.. తాజాగా నవీన్ పోలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తుంది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో తక్కువ యాక్టివ్‌గా ఉంటుంది.
(8 / 11)

నటి కీర్తి సురేష్ పేరు జాబితాలో 9వ స్థానంలో ఉంది. అభిమానులు కీర్తి సురేష్‌ని చాలా ఇష్టపడతారు. మహానటి సినిమాతో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది కీర్తి.
(9 / 11)

జాబితాలో చివరిది త్రిష. త్రిష తన గ్లామరస్ స్టైల్​తో ఇప్పటికీ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇటీవల పీఎస్ వన్‌లో కనిపించిన ఈ భామ.. తన లుక్స్​, నటనతో మరోసారి అభిమానుల హృదయాలను కట్టిపడేసింది.
(10 / 11)

    ఆర్టికల్ షేర్ చేయండి