Alia Bhatt - Ranbir kapoor: ఆడపిల్లకు జన్మనిచ్చిన అలియాభట్ - కపూర్ ఫ్యామిలీలో ఆనందం-alia bhatt ranbir kapoor welcome baby girl ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Alia Bhatt Ranbir Kapoor Welcome Baby Girl

Alia Bhatt - Ranbir kapoor: ఆడపిల్లకు జన్మనిచ్చిన అలియాభట్ - కపూర్ ఫ్యామిలీలో ఆనందం

Nelki Naresh Kumar HT Telugu
Nov 06, 2022 01:22 PM IST

Alia Bhatt - Ranbir kapoor: బాలీవుడ్ హీరోయిన్ అలియాభ‌ట్ త‌ల్లిగా మారింది. ఆదివారం పండ‌టి పాప‌కు జ‌న్మ‌నిచ్చింది. అలియాభ‌ట్ త‌ల్లిగా మార‌డంతో క‌పూర్ ఫ్యామిలీలో సంబ‌రాలు నెల‌కొన్నాయి.

అలియాభట్, రణ్‌బీర్‌క‌పూర్‌
అలియాభట్, రణ్‌బీర్‌క‌పూర్‌

Alia Bhatt - Ranbir kapoor: బాలీవుడ్ హీరోయిన్ అలియాభ‌ట్ మాతృత్వ బంధంలోకి అడుగుపెట్టింది. ఆదివారం పండంటి ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది. డెలివ‌రీ కోసం ఆదివారం ఉద‌యం ముంబాయి లోని రిల‌య‌న్స్ హాస్పిట‌ల్‌లో అలియా భ‌ట్ చేరింది. మ‌ధ్యాహ్నం పండంటి పాప‌కు అలియా జ‌న్మ‌నిచ్చిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. త‌ల్లి, బిడ్డా ఇద్ద‌రు క్షేమంగా ఉన్నార‌ని ప్ర‌క‌టించారు.

ట్రెండింగ్ వార్తలు

అలియా వెంట హాస్పిట‌ల్‌కు భ‌ర్త ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో పాటు నీతూ క‌పూర్‌, సోని ర‌జ్దాన్‌, షాహిన్ భ‌ట్ వెళ్లిన‌ట్లు స‌మాచారం. త‌ల్లిదండ్రులుగా మారిన‌ అలియాభ‌ట్‌, ర‌ణ్‌బీర్‌క‌పూర్ జోడికి ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు అంద‌జేస్తున్నారు.

ఈ ఏడాది జూన్‌లో తాము త‌ల్లిదండ్రులుగా మార‌బోతున్న‌ట్లు అలియాభ‌ట్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్ ప్ర‌క‌టించారు. హాస్పిట‌ల్‌లో స్కానింగ్ చేస్తోన్న ఫొటోను షేర్ చేశారు.

చాలా ఏళ్లుగా ప్రేమ‌లో ఉన్న ర‌ణ్‌బీర్‌, అలియా 2022 ఏప్రిల్ 14 వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో సింపుల్‌గా ముంబాయిలో వీరి పెళ్లి జ‌రిగింది.

ర‌ణ్‌బీర్ అలియా జంట‌గా న‌టించిన బ్ర‌హ్మాస్త్ర చిత్రం ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో రిలీజైంది. ఈ ఏడాది బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.