తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Thanks To Audience: సమంత ఎమోషనల్ పోస్ట్.. ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పిన నటి

Samantha Thanks to Audience: సమంత ఎమోషనల్ పోస్ట్.. ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పిన నటి

19 November 2022, 10:39 IST

google News
    • Samantha Thanks to Audience: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం యశోద విజయాన్ని ఆస్వాదిస్తుంది. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
సమంత
సమంత

సమంత

Samantha Thanks to Audience: టాలీవుడ్ స్టార్ హీరోయిన సమంతా రూత్ ప్రభు నటించిన తాజా చిత్రం యశోద. ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా వసూళ్ల పరంగానూ మెరుగైన కలెక్షన్లను సాధించింది. దీంతో ఫుల్ ఖుషీగా ఉంది సామ్. ఇప్పటికే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆమె.. అంత బాధలోనూ సినిమా ప్రమోషన్లలో పాల్గొని చిత్రంలో తన పాత్ర గురించి తెలియజేసింది. ఆ కష్టానికి ప్రతిఫలంగా ప్రేక్షకులు అందించిన విజయానికి ఆమె ధన్యవాదాలు తెలిపింది.

"ప్రియమైన ప్రేక్షకులకు,

యశోద చిత్రంపై మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు, మీ ప్రశంసలు, మీరు ఇస్తున్న మద్దతు చూస్తున్నాను, ఇదే నాకు లభించిన గొప్ప బహుమతి. సినిమాకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది.'యశోద' చిత్రాన్ని ప్రదరిస్తున్న థియేటర్లలో మీ సంబరాలు చూశాను. సినిమా గురించి మీరు చెప్పిన మాటలు విన్నాను. దీని వెనుక మా చిత్ర బృందం అహర్నిశలు నిర్విరామంగా పడిన కష్టముంది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతున్నట్టుగా పరవశంలో ఉంది. 'యశోద' మీ ముందుకు రావడానికి కారణమైన వాళ్ళకు, ఈ ప్రాజెక్టులో భాగమైన వాళ్లందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. నా పైన, ఈ కథపైన నమ్మకం ఉంచిన నిర్మాత, శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌కు కృతజ్ఞతలు. దర్శకులు హరి, హరీష్‌తో పని చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ కథ కోసం వారు ఎంతో రీసెర్చ్ చేశారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్‌, మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులందరితో పనిచేయడం నాకు ఎంతో ఆనందానిచ్చింది. సదా వినయపూర్వక కృతజ్ఞతలతో.. మీ సమంత" అంటూ సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు పెట్టింది.

సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హరి-హరీష్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబరు 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. శ్రీదేవీ మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం