తెలుగు న్యూస్  /  Photo Gallery  /  How To Use Coconut Oil In Winter For Healthy And Glowing Skin

Using Coconut Oil in Winter : గడ్డ కట్టిన కొబ్బరినూనెను రాసుకుంటున్నారా?

26 November 2022, 13:00 IST

Using Coconut Oil in Winter : చలికాలంలో కొబ్బరినూనె రాసుకుంటే చర్మానికి చాలా మంచిది. ఈ విషయం చాలామందికి తెలుసు. అయితే దీనిని ఏ సమయంలో ఎలా ఉపయోగించాలో వారికి తెలియదు. దీనివల్ల సమస్యలు పెరిగే అవకాశముందంటున్నారు నిపుణులు. మరి దీని ప్రయోజనాలు పొందడం కోసం.. ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Using Coconut Oil in Winter : చలికాలంలో కొబ్బరినూనె రాసుకుంటే చర్మానికి చాలా మంచిది. ఈ విషయం చాలామందికి తెలుసు. అయితే దీనిని ఏ సమయంలో ఎలా ఉపయోగించాలో వారికి తెలియదు. దీనివల్ల సమస్యలు పెరిగే అవకాశముందంటున్నారు నిపుణులు. మరి దీని ప్రయోజనాలు పొందడం కోసం.. ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
కొబ్బరి నూనె చర్మానికి, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చలికాలం వచ్చిందంటే చర్మంపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి కొబ్బరినూనె ఉత్తమ పరిష్కారం.
(1 / 8)
కొబ్బరి నూనె చర్మానికి, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చలికాలం వచ్చిందంటే చర్మంపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి కొబ్బరినూనె ఉత్తమ పరిష్కారం.(Unsplash)
అయితే చలికాలంలో కొబ్బరి నూనెను ఉపయోగించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మీరు వాటిని పాటించకపోతే.. మీరు మీ చర్మాన్ని సరిగ్గా చూసుకోలేరు. దీనికి విరుద్ధంగా మీ చర్మం దెబ్బతినే అవకాశం ఉంది.
(2 / 8)
అయితే చలికాలంలో కొబ్బరి నూనెను ఉపయోగించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మీరు వాటిని పాటించకపోతే.. మీరు మీ చర్మాన్ని సరిగ్గా చూసుకోలేరు. దీనికి విరుద్ధంగా మీ చర్మం దెబ్బతినే అవకాశం ఉంది.(Unsplash)
నిపుణుల అభిప్రాయం ప్రకారం కొబ్బరి నూనెను సరిగ్గా వాడితే.. ఇతర బ్యూటీ ప్రొడెక్ట్​లను వాడాల్సిన అవసరం ఉండదు.
(3 / 8)
నిపుణుల అభిప్రాయం ప్రకారం కొబ్బరి నూనెను సరిగ్గా వాడితే.. ఇతర బ్యూటీ ప్రొడెక్ట్​లను వాడాల్సిన అవసరం ఉండదు.(Unsplash)
చలికాలంలో కొబ్బరి నూనె గడ్డ కడుతుంది. అయితే చాలా మంది ఈ ఘనీభవించిన నూనెను కూడా చర్మంపై రాసుకుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. నూనె పూర్తిగా కరగడానికి సమయం ఇవ్వండి. ఇది పూర్తిగా కరిగిన తర్వాత.. ముఖం, చర్మంపై అప్లై చేయడం ప్రారంభించండి.
(4 / 8)
చలికాలంలో కొబ్బరి నూనె గడ్డ కడుతుంది. అయితే చాలా మంది ఈ ఘనీభవించిన నూనెను కూడా చర్మంపై రాసుకుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. నూనె పూర్తిగా కరగడానికి సమయం ఇవ్వండి. ఇది పూర్తిగా కరిగిన తర్వాత.. ముఖం, చర్మంపై అప్లై చేయడం ప్రారంభించండి.(Unsplash)
రాత్రి పడుకునే ముందు, ఉదయం లేచిన తర్వాత కొబ్బరి నూనె రాసుకుని.. అనంతరం స్నానం చేయాలి.
(5 / 8)
రాత్రి పడుకునే ముందు, ఉదయం లేచిన తర్వాత కొబ్బరి నూనె రాసుకుని.. అనంతరం స్నానం చేయాలి.(Unsplash)
రాత్రిపూట, తెల్లవారుజామున రాసుకోవడం వల్ల.. నూనెను చర్మం సులభంగా గ్రహిస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారదు.
(6 / 8)
రాత్రిపూట, తెల్లవారుజామున రాసుకోవడం వల్ల.. నూనెను చర్మం సులభంగా గ్రహిస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారదు.(Unsplash)
మీరు మేకప్ రిమూవర్‌కు బదులుగా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. అలాగే నైట్ క్రీమ్ అప్లై చేసే ముందు ఈ నూనెను రాత్రి పూట రాసుకోవాలి. కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు పొడిగాలి నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది.
(7 / 8)
మీరు మేకప్ రిమూవర్‌కు బదులుగా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. అలాగే నైట్ క్రీమ్ అప్లై చేసే ముందు ఈ నూనెను రాత్రి పూట రాసుకోవాలి. కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు పొడిగాలి నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి