Skin Care for Men : అబ్బాయిలు అసలే రఫ్​గా ఉండే మీ స్కిన్​ని ఇంకా రఫ్ చేయొద్దు..-skin care for men in winter to reduce roughness in skin ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Skin Care For Men In Winter To Reduce Roughness In Skin

Skin Care for Men : అబ్బాయిలు అసలే రఫ్​గా ఉండే మీ స్కిన్​ని ఇంకా రఫ్ చేయొద్దు..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 19, 2022 11:03 AM IST

Skin Care for Men : సాధారణంగా పురుషులు తమ స్కిన్​పై అంత శ్రద్ధ చూపరు. అందుకే వారి స్కిన్ చాలా రఫ్​గా మారిపోతుంది. అయితే కనీసం చలికాలంలో అయినా వారు తమ చర్మంపై శ్రద్ధ చూపాలి అంటున్నారు స్కిన్ కేర్ నిపుణులు. అయితే మగవారు చలికాలంలో ఎలాంటి కేర్ తీసుకుంటే స్కిన్ హెల్తీగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

స్కిన్ కేర్ చిట్కాలు
స్కిన్ కేర్ చిట్కాలు

Skin Care for Men : శీతాకాలం వచ్చింది. మీ చర్మం తీవ్రమైన చలితో పోరాడాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీ చర్మం పొడిబారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. శ్రద్ధ చూపకుంటే.. గీతలు లేదా పొరలుగా చర్మం మారిపోతుంది. మగవారైతే సహజంగానే దృఢమైన, రఫ్​ చర్మాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే.. పొడిబారడం సమస్య కాస్తా.. దురదకు దారి తీస్తుంది. దీనివల్ల స్కిన్ మరింత డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మీ చర్మంపై సాధారణం కంటే కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. మరి మీ చర్మ సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మైల్డ్ ఫేస్ వాష్ ఉపయోగించండి

చలికాలంలో బలమైన ఫేస్ వాష్ ఉపయోగించడం వల్ల మీ చర్మం పొడిబారవచ్చు. అందువల్ల.. మీ చర్మం పొడిబారకుండా శుభ్రంగా ఉంచడానికి తేలికపాటి ఫేస్ వాష్‌ని ఉపయోగించండి. ఎందుకంటే చలికాలంలో చర్మాన్ని కొద్దిగా పాంపర్ చేయాలి.

థిక్ అండ్ డీప్ మాయిశ్చరైజర్

ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో చర్మం పొడిబారిపోతుంది. కచ్చితంగా అలాంటి సమయాల్లో మాయిశ్చరైజర్లు ఉపయోగించాల్సి ఉంటుంది. ఇవి చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. రోజంతా ఫ్రెష్​గా ఉండేలా చేస్తాయి. కాబట్టి.. మీరు థిక్ అండ్ డీప్ మాయిశ్చరైజర్​ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

చలికాలంలో కూడా సన్ స్క్రీన్

చలికాలంలో సూర్యుడు ఎక్కువగా కనిపించకపోవచ్చు. కానీ దాని నుంచి వెలువడే.. హానికరమైన UVA, UVB కిరణాల ఎఫెక్ట్ మనపై ఉండదు అనుకుంటున్నారేమో. కానీ వాటి ఎఫెక్ట్ మనపై ఎండ ఉన్నా.. లేకున్నా మనపై ఉంటుంది అంటున్నారు నిపుణులు. కాబట్టి సన్‌స్క్రీన్‌లు కచ్చితంగా వాడాలి అంటున్నారు. షియా బటర్ లేదా జోజోబా ఆయిల్ వంటి మాయిశ్చరైజింగ్ ఎలిమెంట్‌లను కలిగి ఉండే వాటిని ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

బాడీ లోషన్ ఉపయోగించండి

చర్మ సంరక్షణ విషయానికి వస్తే.. కొన్ని శరీర భాగాలు తరచుగా నిర్లక్ష్యం చేస్తారు. మీ మోచేతులు, మెడ, మోకాలు కూడా మీ శరీరంలోని భాగాలే. మీ ముఖానికి ఎంత శ్రద్ధ వహిస్తారో.. వాటికి అంతే శ్రద్ధ తీసుకోవడం అవసరం. కనీసం కొంతైనా శ్రద్ధ చూపించాలి కదా. అందుకే మీరు మీ చర్మానికి బాడీ లోషన్ ఉపయోగించండి.

క్రీమ్ ఆధారిత బాడీ లోషన్‌ని ఎంచుకోవడం ద్వారా.. మంచి చర్మ పోషణను పొందవచ్చు. చర్మం డ్రై కాకుండా.. హెల్తీగా కనిపిస్తుంది.

సరైన దిశలో షేవ్ చేయండి..

మీరు షేవ్ చేసుకునేటప్పుడు.. మీ ముఖంపై వెంట్రుకలను దిశకు వ్యతిరేకంగా షేవింగ్ చేయడం వల్ల చర్మంపై అనవసరమైన ఒత్తిడి కలుగుతుంది. అంతేకాకుండా కట్ అయ్యే అవకాశం కూడా ఉంది. వెంట్రుకలు పెరుగుతున్న దిశలో షేవ్ చేయండి. ఇది సురక్షితమైనది. అంతేకాకుండా చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికిి ఇది సహాయం చేస్తుంది. అలాగే షేవ్ చేసిన తర్వాత క్రీమ్ ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్