తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Touch And Feel The Online Products: ఆన్ లైన్ ప్రొడక్ట్స్ నూ టచ్ చేసి చూడొచ్చు

Touch And Feel The Online Products: ఆన్ లైన్ ప్రొడక్ట్స్ నూ టచ్ చేసి చూడొచ్చు

HT Telugu Desk HT Telugu

18 October 2022, 21:27 IST

    • Touch And Feel The Online Products: ఆన్ లైన్ లో ప్రొడక్ట్స్ ను కొనడం ఇప్పుడు సర్వ సాధారణమైంది. ఆమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటివి ఇప్పుడు మారుమూల గ్రామాల్లోకి కూడా డెలివరీ చేస్తున్నాయి. 
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Touch And Feel The Online Products: ఆన్ లైన్ లో కొనుగోలు చేయడంలో చాలా బెనిఫిట్స్ ఉంటున్నాయి. స్టోర్ లో కన్నా తక్కువ ధర, భారీ ఆఫర్స్, క్యాష్ బ్యాక్స్, ఇవన్నీ కాకుండా, హ్యాప్పీగా ఇంట్లో కూర్చునే ఆర్డర్ ఇవ్వొచ్చు. డెలివరీ తీసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Touch And Feel The Online Products: కానీ ఇదొక్కటే అసంతృప్తి..

కానీ ఆన్ లైన్ షాపింగ్ లో ఒకటే అసంతృప్తి ఉంటుంది. అదేంటంటే, ప్రొడక్ట్ ను స్వయంగా చూసి, టచ్ చేసి, ఆ అనుభూతి పొంది, ఆ తరువాతే ఆర్డర్ ఇవ్వడమనే ఫెసిలిటీ ఆన్ లైన్ షాపింగ్ లో ఉండదు. ప్రొడక్ట్ ను, డిటైల్స్ ను వర్చువల్ గా చూడాల్సిందే. అలా చూసి, ప్రొడక్ట్ డెలివరీ అయిన తరువాత, తాము కోరుకున్నట్లుగా లేదని రిటర్న్ చేస్తుంటారు. వినియోగదారులు తమ రిటర్న్ కు చెబుతున్న ప్రధాన కారణాల్లో ఇది ఒకటి.

Touch And Feel The Online Products: ఐఐటీ మద్రాస్ సృష్టి

ఈ అసంతృప్తి ఇకపై ఉండదు. ఇప్పుడు ఆన్ లైన్ ప్రొడక్ట్స్ ను కూడా టచ్ చేసినట్లుగా అనుభూతి పొందే టెక్నాలజీ రూపొందింది. ఐఐటీ మద్రాసు విద్యార్థులు ఈ కొత్త టచ్ స్క్రీన్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ టచ్ స్క్రీన్ టెక్నాలజీతో స్క్రీన్ పై ఉన్న ప్రొడక్ట్ ఇమేజ్ ని స్వయంగా టచ్ చేసిన అనుభూతి కలుగుతుంది. ఆ ఇమేజ్ పై మీరు చేయి పెట్టి కదుపుతూ, స్వయంగా టచ్ చేసిన భావన పొందవచ్చు.

Touch And Feel The Online Products: దీని పేరు ‘iTad'

ఈ టెక్నాలజీకి ‘iTad' అని పేరు పెట్టారు. ఇది మల్టీ టచ్ సెన్సార్లతో, ఇంటరాక్టివ్ టచ్ యాక్టివ్ డిస్ ప్లే తో వస్తుంది. సాఫ్ట్ వేర్ సహాయంతో ప్రొడక్ట్ కు సంబంధించిన ఎడ్జెస్, స్విచెస్, వివిధ రకాల సర్ఫేస్ ను రూపొందించారు. వాటిని టచ్ చేయడం ద్వారా వినియోగదారుడు ఆ ప్రొడక్ట్ ను స్వయంగా టచ్ చేసిన అనుభూతి పొందవచ్చు. ఈ టెక్నాలజీతో ఆన్ లైన్ షాపింగ్ మరో లెవెల్ కు వెళ్తుందని ఐఐటీ మద్రాసు పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ మణివణ్నన్ తెలిపారు.