తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Yavatmal Village Bans Use Of Mobile Phones: ఈ గ్రామంలో మొబైల్ ఫోన్లు నిషేధం

Yavatmal village bans use of mobile phones: ఈ గ్రామంలో మొబైల్ ఫోన్లు నిషేధం

HT Telugu Desk HT Telugu

18 November 2022, 17:21 IST

  • ban on use of mobile phones: 18 ఏళ్ల లోపు పిల్లలకు మొబైల్ ఫోన్లను ఇవ్వకూడదని మహారాష్ట్రలోని ఒక గ్రామం నిర్ధారించింది. చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లను వాడడంపై నిషేధం విధిస్తున్నట్లు గ్రామ సభ ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Maharashtra village bans mobile phone use: మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని యావత్మాల్ జిల్లా, బన్సి గ్రామంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 18 ఏళ్ల వయస్సులోపు పిల్లు మొబైల్ ఫోన్లలో ఆ వయస్సు వారికి అవసరం లేని కంటెంట్ చూస్తున్నారని, వీడియో గేమ్స్ కు బానిసలవుతున్నారని బన్సి గ్రామ సభ తెలిపింది. దానివల్ల వారు చెడిపోవడంతో పాటు, వారి చదువు దెబ్బతింటోందని, అందువల్ల వారు మొబైల్ ఫోన్లను వాడడంపై నిషేధం విధిస్తున్నామని స్పష్టం చేసింది.

Maharashtra village bans mobile phone use: కఠినంగా అమలు

ఈ నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలని గ్రామంలోని అన్ని కుటుంబాలకు స్పష్టం చేశామని బన్సి గ్రామ సర్పంచ్ గజానన్ తేలే తెలిపారు. మొబైల్ ఫోన్లను నిషేధించాలన్న తమ ప్రతిపాదనకు గ్రామ సభలో ఏకగ్రీవంగా ఆమోదం లభించిందన్నారు. చిన్న పిల్లల చేతిలో పుస్తకాలు ఉండాలి కానీ మొబైల్ ఫోన్లు కాదని, 10 ఏళ్ల లోపు పిల్లలు కూడా మొబైల్ ఫోన్లకు బానిసలు కావడం చూశానని ఆవేదన వ్యక్తం చేశారు.

Maharashtra village bans mobile phone use: ఉల్లంఘిస్తే చర్యలు

మొబైల్ ఫోన్లను నిషేధించాలన్న నిర్ణయాన్ని అమలు చేయని తల్లిదండ్రులకు, వారి పిల్లలకు మొదట కౌన్సెలింగ్ ఇస్తామని, ఆ తరువాత కూడా ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా విధిస్తామని సర్పంచ్ గజానన్ వెల్లడించారు.