తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Woman Run Over By Vande Bharat Express: ‘వందేభారత్’ ఢీ కొని మహిళ మృతి

Woman run over by Vande Bharat Express: ‘వందేభారత్’ ఢీ కొని మహిళ మృతి

HT Telugu Desk HT Telugu

08 November 2022, 23:01 IST

  • Woman run over by Vande Bharat Express: భారతీయ రైల్వే ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైళ్ల బ్యాడ్ టైమ్ కొనసాగుతోంది. వరుస ప్రమాదాలతో ప్రతీరోజు ఈ వందే భారత్ రైళ్లు వార్తల్లో నిలుస్తున్నాయి. 

వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ (ఫైల్ ఫొటో)
వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ (ఫైల్ ఫొటో) (PTI)

వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ (ఫైల్ ఫొటో)

Woman run over by Vande Bharat Express: సెమీ హై స్పీడ్ ట్రైన్ వందేభారత్ మంగళవారం మరో ప్రమాదం బారిన పడింది. గుజరాత్ లోని ఆనంద్ సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతున్న మహిళను వందే భారత్ రైలు ఢీ కొట్టింది.

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Woman run over by Vande Bharat Express: మహిళ దుర్మరణం

గుజరాత్ లోని ఆనంద్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తున్న వందే భారత్ ట్రైన్ ఆనంద్ సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతున్న మహిళను ఢీ కొట్టింది. దాంతో, ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. సెప్టెంబర్ 30న ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ ట్రైన్ ను ప్రారంభించారు. ఈ రైలుకు ఆనంద్ లో హాల్ట్ లేదు.

Woman run over by Vande Bharat Express: బంధువును చూడ్డానికి వచ్చి..

ఈ ప్రమాదంలో మృతి చెందిన మహిళను బీట్రైస్ ఆర్చిబాల్డ్ పీటర్(54)గా గుర్తించారు. అహ్మదాబాద్ కు చెందిన ఈ మహిళ తన బంధువును కలుసుకోవడం కోసం ఆనంద్ కు వచ్చారు. ఈ రైలు ఇప్పటికి మూడుసార్లు ప్రమాదాల బారిన పడింది. మూడు సార్లు కూడా పట్టాలపై ఉన్న పశువులను ఢీ కొనడంతో ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ప్రతీ సారీ రైలు ముందు భాగం ధ్వంసమైంది.