తెలుగు న్యూస్  /  National International  /  Who Is Pappu Now Trinamool Congress Mp Mahua Moitra Slams Bjp Led Centre

Mahua Moitra Speech: ఇప్పుడు పప్పూ ఎవరు?: కేంద్రంపై తృణమూల్ ఎంపీ ఫైర్.. స్పీచ్ వైరల్

13 December 2022, 20:52 IST

    • Mahua Moitra Speech: ఇప్పుడు పప్పూ ఎవరు? అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా. పారిశ్రామికోత్పత్తి, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు సహా వివిధ అంశాలపై బీజేపీని విమర్శించారు. ఈ స్పీచ్ సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది.
Mahua Moitra Speech: ఇప్పుడు పప్పూ ఎవరు?: కేంద్రంపై తృణమూల్ ఎంపీ ఫైర్.. స్పీచ్ వైరల్(PTI Photo)
Mahua Moitra Speech: ఇప్పుడు పప్పూ ఎవరు?: కేంద్రంపై తృణమూల్ ఎంపీ ఫైర్.. స్పీచ్ వైరల్(PTI Photo) (PTI)

Mahua Moitra Speech: ఇప్పుడు పప్పూ ఎవరు?: కేంద్రంపై తృణమూల్ ఎంపీ ఫైర్.. స్పీచ్ వైరల్(PTI Photo)

Trinamool Congress MP Mahua Moitra Speech: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా విమర్శల దాడి చేశారు. లోక్‍సభలో మాట్లాడిన ఆమె కేంద్రంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పారిశ్రామికోత్పత్తి తగ్గుదలను ఆమె ఎత్తిచూపారు. ఆర్థిక వ్యవస్థపై కేంద్రం తీరును ప్రశ్నించారు. “‘పప్పూ’ అనే పదాన్ని ఈ ప్రభుత్వం, అధికార పార్టీ సృష్టించాయి. కించపరచడానికి, అసమర్థతను సూచించేందుకు మీరు దాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ, అసలు పప్పూ ఎవరో మాకు ఈ గణాంకాలు చెబుతున్నాయి” అని తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. అలాగే ఆర్థిక వృద్ధి లెక్కలు, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల అంశాలపైనా మాటల తాటాలు పేల్చారు.

కేంద్రం తప్పుడు ప్రచారం చేస్తోంది

Trinamool Congress MP Mahua Moitra Speech: దేశ ఆర్థిక వృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మొహువా మొయిత్రా ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ సాధించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‍కు సూచనలు చేశారు.

అత్యధిక ఉద్యోగాలను కల్పించే పారిశ్రామికోత్పత్తి తగ్గుదలపై ఆమె ప్రశ్నలు సంధించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి నాలుగు శాతం తగ్గిందని గుర్తు చేశారు. జాతీయ గణాంకాల కార్యాలయం (National Statistical Office - NSO) డేటాను ప్రస్తావించారు. అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి 5.6 శాతానికి పడిపోయిందని, ఇది 26 నెలల కనిష్ఠమని ఆమె చెప్పారు.

హిమాచల్ ఎన్నికలపై..

హిమాచల్ ప్రదేశ్‍లో బీజేపీ అధికారం కోల్పోవడంపై కూడా మహువా మొయిత్రా మాట్లాడారు. బీజేపీ జాతీయాధ్యక్షుడి సొంత రాష్ట్రంలోనే ఆ పార్టీ ఓడిపోయిందని విమర్శించారు. “ఇప్పుడు పప్పూ ఎవరు?” అని ఘాటుగా మాట్లాడారు. ఇటీవల జరిగిన హిమాచల్‍ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, అధికారం చేపట్టింది.

రూ.వందల కోట్లు ఖర్చు చేసి ఇతర పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు అధికార బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే ఉందని మహువా మొయిత్రా ఆరోపించారు. అయినా, ప్రతిపక్షాల నాయకులపైనే ఎన్‍ఫోర్స్‌మెంట్ (ED) డైరెక్టరేట్ దాడులు చేస్తోందని విమర్శించారు.

లోక్‍సభలో తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా చేసిన ఈ ప్రసంగం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.