తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Who Is Siddaramaiah?: 40 ఏళ్ల అప్రతిహత రాజకీయ ప్రస్థానం సిద్ధ రామయ్య సొంతం

Who is Siddaramaiah?: 40 ఏళ్ల అప్రతిహత రాజకీయ ప్రస్థానం సిద్ధ రామయ్య సొంతం

HT Telugu Desk HT Telugu

18 May 2023, 14:59 IST

  • Who is Siddaramaiah?: కర్నాటక తదుపరి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధ రామయ్య మే 20 వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా మరో సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ప్రమాణం చేస్తారు.

కర్నాటక కాబోయే సీఎం సిద్ధ రామయ్య
కర్నాటక కాబోయే సీఎం సిద్ధ రామయ్య

కర్నాటక కాబోయే సీఎం సిద్ధ రామయ్య

Who is Siddaramaiah?: కర్నాటక (Karnataka) తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధ రామయ్య రాజకీయ ప్రస్థానం గత 40 ఏళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతోంది. సిద్ధ రామయ్య జీవితంలోని ముఖ్యమైన విషయాలు..

ట్రెండింగ్ వార్తలు

NEET UG 2024: రేపే నీట్ యూజీ 2024 పరీక్ష; డ్రెస్ కోడ్ ఉంది, షూస్ వేసుకోవద్దు; గమనించండి..

Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్​ని ఎగబడి తింటున్నారు!

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

Who is Siddaramaiah?: సిద్ధ రామయ్య జీవిత విశేషాలు

  • 1948 ఆగస్ట్ 12న సిద్ధ రామయ్య (Siddaramaiah) జన్మించారు. మైసూరు యూనివర్సిటీ నుంచి బీఎస్సీ చేశారు. ఆ తరువాత అదే యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ కూడా చేశారు. అనంతరం న్యాయవాదిగా కొంతకాలం ప్రాక్టీస్ చేశారు.
  • 1983 లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి భారతీయ లోక్ దళ్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
  • చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు ఓడిపోయారు.
  • కన్నడను అధికార భాషగా అమలు చేయడానికి ఏర్పాటు చేసిన ‘కన్నడ కావలు సమితి (Kannada Kavalu Samiti)’ కి మొదటి చైర్మన్ గా వ్యవహరించారు. ఈ ‘కన్నడ కావలు సమితి (Kannada Kavalu Samiti)’ రామకృష్ణ హెగ్డే సీఎంగా ఉన్న సమయంలో ఏర్పాటైంది. ఆ తరువాత హెగ్డే మంత్రివర్గంలో సిద్ధ రామయ్య (Siddaramaiah) పశు సంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
  • 1992లో జనతాదళ్ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1994లో దేవే గౌడ నాయకత్వంలోని జనతాదళ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తరువాత ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయితే, 1999లో ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు.
  • 2004 లో కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో మరోసారి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. 2005 లో దేవేగౌడతో విబేధాలు రావడంతో సిద్ధరామయ్య (Siddaramaiah) ను జేడీఎస్ నుంచి బహిష్కరించారు.
  • 2006 లో సిద్ధ రామయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2008 నుంచి 2018 వరకు వరుసగా వరుణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2018 లో ఈ నియోజకవర్గంలో తన కుమారుడిని నిలబెట్టి, తాను మళ్లీ చాముండేశ్వరి నియోజకవర్గానికి వెళ్లారు.
  • 2013 నుంచి 2018 వరకు కర్నాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. కర్నాటకను ఐదేళ్ల పూర్తి కాలం పరిపాలించిన రెండో సీఎంగా రికార్డు సృష్టించారు. అంతకుముందు దేవ్ దాస్ ఉర్స్ మాత్రమే ఫుల్ టర్మ్ సీఎంగా ఉండగలిగారు.
  • 13 సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రికార్డు కూడా సిద్ధ రామయ్య (Siddaramaiah) సొంతం.