తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Goa Special ‘Old Monk’ Tea: ఇది గోవా స్పెషల్ ‘ఓల్డ్ మాంక్’ టీ

Goa special ‘Old Monk’ Tea: ఇది గోవా స్పెషల్ ‘ఓల్డ్ మాంక్’ టీ

HT Telugu Desk HT Telugu

05 November 2022, 21:36 IST

    • Goa special ‘Old Monk’ Tea: గోవాలో పర్యాటకులకు ఆకర్షించడానికి అనేక మార్గాలున్నాయి. వాటర్ స్పోర్ట్స్, లోకల్ ఆల్కహాల్స్, బీచ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్, మల్టీ క్యుజైన్ ఫుడ్.. ఇలా గోవా స్పెషల్స్ చాలా ఉన్నాయి. వాటికి తోడు ఇప్పుడు మరొకటి వచ్చింది. 
ఓల్డ్ మాంక్ టీ చేస్తున్న వ్యక్తి
ఓల్డ్ మాంక్ టీ చేస్తున్న వ్యక్తి

ఓల్డ్ మాంక్ టీ చేస్తున్న వ్యక్తి

Goa special ‘Old Monk’ Tea: గోవా అనగానే గుర్తొచ్చేంది బీచ్, డ్రింక్స్ అండ్ ఫుడ్. గోవా వెళ్లే పర్యాటకులు ప్రధానంగా చూసేవి ఇవే. తాజాగా గోవా వెళ్లే పర్యాటకులకు మరో ఆకర్షణ జత అయింది.

ట్రెండింగ్ వార్తలు

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Goa special ‘Old Monk’ Tea: ఓల్డ్ మాంక్ టీ..

గోవాలోని ఒక బీచ్ లో కొత్తగా ఒక టీ స్టాల్ స్టార్ట్ అయింది. కొద్ది కాలంలోనే అది ఫేమస్ అయిపోయింది. టీ స్టాల్స్ సాధారణమే కదా, ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా? ఆ ప్రత్యేకత ఏంటంటే అక్కడ లభించే స్పెషల్ టీ. ‘ఓల్డ్ మాంక్’ తేనీరు. మద్యం ప్రియులకు ఓల్డ్ మాంక్ ఫేవరెట్ బ్రాండ్. దాన్ని టీ లో కలిపి ఇస్తున్నరు ఈ స్టాల్ లో.

Goa special ‘Old Monk’ Tea: ఎలా చేస్తారు?

సాధారణ టీ లాగానే చేస్తారు. కొద్దిగా బెల్లం, కొంత టీ పౌడర్ కలిపి వేడి చేసి ఫిల్టర్ చేసి, చివర్లో కొంత ఓల్డ్ మాంక్ కలిపి, మట్టి పాత్రలో పోసి ఇస్తున్నాడు. ఈ తయారు చేసే ప్రక్రియను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. నెటిజన్లు వింత వింత కామెంట్లతో స్పందించారు. ‘ఓల్డ్ మాంక్ టీనా? ఇక పోయేకాలం దగ్గర పడింది’ అంటూ ఓ నెటిజన్ స్పందించడం హైలైట్. నిజమే. హాట్ కాఫీలో ఒక చిన్న టీ స్పూన్ ఓల్డ్ మాంక్ వేసుకుని చూడండి. చాలా బావుంటుంది’ అని మరో యూజర్ కామెంట్ చేశాడు.