UP rape case : 17ఏళ్ల బాలికను గర్భవతిని చేసి.. పసికందును అడవిలో పడేసి!
20 February 2023, 6:32 IST
UP rape case : 17ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఆమెను గర్భవతిని చేశాడు. ఆడబిడ్డ పుట్టగా.. పసికందును అడవిలో పడేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
17ఏళ్ల బాలికను గర్భవతిని చేసి.. పసికందును అడవిలో పడేసి..!
UP man rapes teenager : ఉత్తర్ ప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. 17ఏళ్ల బాలికపై అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పసికందును.. ఆ కిరాతకుడు.. అడవిలో పడేసి పారిపోయాడు!
పెళ్లి చేసుకుంటానని.. గర్భవతిని చేసి..
UP crime news : ఉత్తర్ ప్రదేశ్ సహరన్‌పూర్‌కు చెందిన 17ఏళ్ల బాలికకు సల్మాన్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. కాగా.. ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి లొంగదీసుకున్నాడు సల్మాన్. ఈ క్రమంలోనే అనేక మార్లు రేప్ చేశాడు!
సల్మాన్ కారణంగా ఆ బాలిక గర్భం దాల్చింది. కొన్ని రోజుల క్రితం ఆమెకు ఆడబిడ్డ పుట్టింది. ఇది తెలుసుకున్న సల్మాన్.. ఆ పసికందును.. బాలిక నుంచి లాగేసుకున్నాడు. అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పసికందును నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. అనంతరం అక్కడి నుంచి జారుకున్నాడు.
UP rape case : మరోవైపు.. సల్మాన్‌పై బాలిక డియోబంద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, తనను సల్మాన్ అనేకసార్లు రేప్ చేశాడని పేర్కొంది. ఫలితంగా తాను గర్భం దాల్చినట్టు ఫిర్యాదులో పేర్కొంది.
ఘటనపై సెక్షన్ 376, 377, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు.
మరోవైపు అడవిలో పడేసిన పసికందు.. స్థానికంగా నివాసం ఉండే ఓ రైతుకు కనిపించింది. ఆ పసికందును ఆయన పోలీసులకు అప్పగించాడు. పోలీసులు ఆ ఆడబిడ్డను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. త్వరలోనే పసికందును శిశు సంక్షేమ కమిటీకి అప్పగించనున్నారు.
14ఏళ్ల బాలికపై తాంత్రికుడు అత్యాచారం..
Tantrik rapes minor : దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 14ఏళ్ల బాలికపై ఓ తాంత్రికుడు అనేక మార్లు అత్యాచారానికి పాల్పడి, ఆమెను గర్భవతిని చేసిన ఘటన తాజాగా కలకలం సృష్టించింది.
14ఏళ్ల బాలికకు కొన్ని నెలలుగా ఆరోగ్యం బాగుండటం లేదు. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ఆ బాలిక తల్లి.. ఆమెను తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లింది. అక్కడ అతను మాయమాటలు చెప్పాడు.
Delhi crime news : ఆ తర్వత కొన్ని రోజులకు.. ఆ తాంత్రికుడు ఆమె ఇంటికి వెళ్లాడు. తల్లిని బయటకు పంపించాడు. తలపులు వేసి, బిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి అనేకమార్లు ఇదే విధంగా చిత్రహింసలకు గురిచేశాడు.
ఇటీవలే.. ఆ బాలిక అనారోగ్యం పాలైంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. బాలిక 2 నెలల గర్భవతి అని తేలింది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Delhi rape case : ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకునన పోలీసులు.. దర్యాప్తును చేపట్టారు.