Sangli mass suicide : అది ఆత్మహత్య కాదు- మాంత్రికుడి చేతిలో ఆ తొమ్మిది మంది బలి!-sangli mass suicide probe rules out suicide nine members of family were poisoned to death ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sangli Mass Suicide : అది ఆత్మహత్య కాదు- మాంత్రికుడి చేతిలో ఆ తొమ్మిది మంది బలి!

Sangli mass suicide : అది ఆత్మహత్య కాదు- మాంత్రికుడి చేతిలో ఆ తొమ్మిది మంది బలి!

Sharath Chitturi HT Telugu
Jun 27, 2022 10:14 PM IST

Sangli mass suicide : మహారాష్ట్ర సాంగ్లీలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్నారని అందరు భావించారు. కానీ ఓ మాంత్రికుడు.. వారందరికి విషం పెట్టి చంపేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది!

అది ఆత్మహత్య కాదు- మాంత్రికుడి చేతిలో ఆ తొమ్మిది మంది బలి!
అది ఆత్మహత్య కాదు- మాంత్రికుడి చేతిలో ఆ తొమ్మిది మంది బలి! (HT Telugu)

Sangli mass suicide : మహారాష్ట్రలో తీవ్ర కలకలం సృష్టించిన 'సాంగ్లీ' ఘటనలో పోలీసులు షాకింగ్​ విషయాలను కనుగొన్నారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది.. ఆత్మహత్య చేసుకున్నారని ఇంతకాలం అందరు అనుకున్నారు. కానీ వారందరు హత్యకు గురయ్యారని పోలీసులు తేల్చారు!

ఆత్మహత్య కాదు..!

సాంగ్లీ జిల్లాలోని మైసల్​ గ్రామానికి సమీపంలో ఇద్దరు అన్నదమ్ములు తమ కుటుంబాలతో కలిసి జీవించేవారు. వారి కుటుంబాల్లో మొత్తం తొమ్మిది మంది ఉండేవారు. అన్నదమ్ముల్లో ఒకరు టీచర్​గాను, మరొకరు పశువుల వైద్యుడిగాను పనిచేసేవారు.

ఈ నెల 20న వారి మృతదేహాలు.. వారి ఇంట్లో నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించారన్న వార్త మహారాష్ట్రలో కలకలం సృష్టించింది. కాగా అన్నదమ్ములకు అప్పులు ఎక్కువ ఉన్నాయని, ఆ బాధ తట్టుకోలేక కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

కానీ ఈ వ్యవహారంపై అనుమానంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే షాకింగ్​ విషయాలు వెలువడ్డాయి!

ఓ మాత్రికుడు.. అతని డ్రైవర్​.. కుటుంబ సభ్యులకు విషం ఇచ్చి చంపేశారని పోలీసులు గుర్తించారు. వారిద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వారిపై సెక్షన్​ 302 కింద కేసు నమోదు చేశారు.

కాగా.. ఆ మాంత్రికుడు అసలు ఆ కుటుంబాన్ని ఎందుకు చంపాడు? అన్న విషయం ఇంకా తెలియరాలేదు.

IPL_Entry_Point

సంబంధిత కథనం