తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పెళ్లి కాకుండా తల్లయితే హక్కులే ఉండవా.. ?

పెళ్లి కాకుండా తల్లయితే హక్కులే ఉండవా.. ?

HT Telugu Desk HT Telugu

18 March 2022, 9:50 IST

    • లీ మెంగ్ తన రెండేళ్ల కుమార్తెను ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్న అంకితభావం కలిగిన తల్లి. కానీ చైనీస్ సమాజం, ప్రభుత్వం దృష్టిలో ఆమె దాదాపు రెండవ తరగతి పౌరురాలు.
ఒంటరి తల్లులకు హక్కులే ఉండవా?
ఒంటరి తల్లులకు హక్కులే ఉండవా? (unsplash)

ఒంటరి తల్లులకు హక్కులే ఉండవా?

ఆమెలాంటి లక్షలాది మంది ఒంటరి తల్లుల వివాహేతర ప్రసవాలను అసహ్యించుకునే చైనాలో వివాహిత స్త్రీలు మాత్రమే ప్రసూతి ప్రయోజనాలను క్లెయిమ్ చేయగల పరిస్థితిలో చాలా దారుణంగా ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Protein supplements ICMR : ప్రోటీన్​ సప్లిమెంట్స్​ వాడొద్దని ఐసీఎంఆర్​ ఎందుకు చెప్పింది?​

UPSC NDA NA results 2024: ఎన్డీఏ, ఎన్ఏ 2024 ఫలితాలను విడుదల చేసిన యూపీఎస్సీ

Kedarnath Dham yatra 2024: రేపటి నుంచి కేదార్ నాథ్ ధామ్ యాత్ర ప్రారంభం; రిజిస్టర్ చేసుకోకుండా వెళ్లొచ్చా?

karnataka sslc result 2024: 10వ తరగతి ఫలితాలను డైరెక్ట్ లింక్ ద్వారా తెలుసుకోండి

షాంఘై నివాసి అయిన లి తన బాయ్‌ఫ్రెండ్‌ కారణంగా గర్భం దాల్చింది. అయితే అతను ఆమెను విడిచిపెట్టడంతో బిడ్డను తనే పోషిస్తోంది.

ఆమెకు వివాహం కానందున ప్రసూతి సెలవులకు అనర్హురాలిగా మారింది. ఆమె తన బిడ్డను చూసుకోవడానికి రియల్ ఎస్టేట్ ఉద్యోగం మానేయవలసి వచ్చింది.

‘శిశువును కనడానికి చాలా ప్రతిఘటన ఎదురైంది. నేను పిచ్చిదానిని అని మా అమ్మ అంటోంది’ అని లి అన్నారు. మరింత ఇబ్బంది ఎదురవుతుందని తను తన అసలు పేరును గోప్యంగా ఉంచారు.

‘చైనాలోని సాంప్రదాయ కుటుంబానికి ఇది ఆమోదయోగ్యం కాదని నా తల్లి భావించింది..’ అని అన్నారు.

చైనా ప్రభుత్వం తాను దీర్ఘకాలంగా అమలు చేస్తున్న ఒక బిడ్డ విధానాన్ని 2016లో రద్దు చేసింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో జననాల రేటు పడిపోతున్నందున ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలని పౌరులను ప్రోత్సహించడం ప్రారంభించింది.

కానీ అనేక నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, వైద్య కవరేజీ వంటి ప్రయోజనాలు ఇప్పటికీ వివాహిత మహిళలకు మాత్రమే అమలవుతున్నాయి.

లి తన ప్రసూతి హక్కులను పొందేందుకు ప్రయత్నించినప్పుడు, ఆమెకు వివాహ ధృవీకరణ పత్రం లేకపోవడంతో నిరుత్సాహానికి గురైంది. ఆమె అనేక ప్రభుత్వ సంస్థల చుట్టూ తిరిగింది. ఒక విభాగం నుంచి మరొక విభాగానికి పంపించారే తప్ప ఫలితం లేకుండా పోయింది.

‘ఒకరకంగా చెప్పాలంటే నన్ను ఫుట్ బాల్ ఆడుకున్నారు..’ అని ఆమె చెప్పింది.

దీంతో విసుగు చెందిన ఆమె కోర్టులో కేసు వేశారు. ప్రభుత్వ-అనుబంధ పరిశోధనా సంస్థ 2019 నివేదిక ప్రకారం చైనాలో విడాకులు తీసుకున్నవారు, వితంతువులతో సహా 19 మిలియన్లకు పైగా ఒంటరి తల్లులు ఉన్నారు.

ఒంటరి తల్లుల కోసం చట్టపరమైన మద్దతు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన న్యాయవాది డాంగ్ జియాయోయింగ్ మాట్లాడుతూ ‘వివాహం కాకుండా పిల్లలను కలిగి ఉండటం చట్టవిరుద్ధమని ప్రత్యక్ష చట్టం లేదు. కానీ అది చట్టవిరుద్ధం కాదని స్పష్టంగా చెప్పలేదు" అని తెలిపారు. ఇది స్థానిక ప్రభుత్వాలచే భిన్నమైన వివరణల దయపై ఆధారపడి ఉందని తెలిపారు.

చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ 2017లో వివాహేతర జననాలు "పబ్లిక్ ఆర్డర్‌కు విరుద్ధం, నైతికతలకు విరుద్ధం" అని చెప్పారు.

ఒంటరి తల్లుల కోసం ఆన్‌లైన్ న్యాయవాదిగా సాయం అందిస్తున్న వాంగ్ రుయిక్సీ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఆమెకో చిన్న కుమార్తె ఉంది. వారు కేవలం బ్యూరోక్రాటిక్ వివక్షనే కాకుండా సోషల్ మీడియా నుంచి కూడా దూషణలు ఎదుర్కొన్నారు. తన బిడ్డను ఒంటరిగా పెంచడంపై ఆన్‌లైన్‌లో గర్వంగా చెప్పుకొన్న ఈ మహిళకు.. అప్పటి నుంచి సోషల్ మీడియా నుంచి దూషణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 

ఆమె చివరికి చైనా విడిచిపెట్టి ఇప్పుడు ఐరోపాలో నివసిస్తోంది. తాను వివక్షను, దూషణలను ఎదుర్కోగలనని ఆమె చెప్పింది. ‘కానీ నా బిడ్డ అలాంటి వాతావరణంలో పెరగడం నాకు ఇష్టం లేదు..’ అని తెలిపారు.

ఆశలు ఇంకా సజీవమే..

ఒంటరి తల్లిదండ్రుల పిల్లలు పాఠశాల విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి ప్రభుత్వ సేవలను పొందేందుకు అవసరమైన స్థానిక గృహ నమోదు స్థితిని పొందేందుకు చివరకు 2016 నుండి అనుమతి లభించింది.

2020లో చైనాలో 17 ఏళ్లలో అతి తక్కువ సంఖ్యలో వివాహ రిజిస్ట్రేషన్లు జరిగిన తర్వాత ప్రభుత్వం వివాహాలు, పిల్లలను కనడాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించింది. మహిళలకు విద్యా, వృత్తిపరమైన ఎంపికలను మెరుగుపరిచే దిశగా కూడా ఇది తోడ్పడింది.

చైనా జాతీయ శాసనసభ ఈ నెల ప్రారంభంలో బీజింగ్‌లో సమావేశమైంది. కనీసం ఇద్దరు సభ్యులు ఒంటరి తల్లులకు సహాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అయితే వారికి మద్దతు ఏమేరకు లభిస్తుందో స్పష్టత లేదు. ప్రాథమిక సాంస్కృతిక మార్పు అవసరమని డాంగ్ అన్నారు. ‘ఒకేసారి మార్చడం అసాధ్యం.. మనం పోరాడాలి..’ అని అన్నారు.

షాంఘైలో 37 ఏళ్ల ఒంటరి తల్లి అయిన యు తన పూర్తి పేరు చెప్పడానికి నిరాకరించింది. ఆమెకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.

తమ బిడ్డను ఆదుకోవడానికి సహాయం చేయమని ఆమె అడిగినప్పుడు అదృశ్యమై పో అని ఆ బాలుడి తండ్రి చెప్పడంతో యు విడిపోయింది. ఆమె ఈ సంగతి చెబుతున్నప్పుడు ఆమె ముఖం మీద కన్నీటిధార కనిపించింది.

తనంతట తానుగా అబ్బాయిని పెంచుకుంటూ, ప్రసూతి ప్రయోజనాల కోసం ఆమె తీవ్ర పోరాటం చేసింది. ‘నేను చేసినదంతా పనికిరాకుండా పోయింది..’ అని ఆమె చెప్పింది.

యు పట్టుదల గురించి ఫిర్యాదు చేయడానికి స్థానిక అధికారులు ఆమె యజమానిని కూడా పిలిచారుః. కానీ ఆమె అధైర్యపడలేదు.

‘మేం మా హక్కుల కోసం పోరాడాలి. కాబట్టి పశ్చాత్తాపం చెందకూడదు’ అని ఆమె చెప్పింది.

గత నెల బీజింగ్ ఒలింపిక్స్‌లో బంగారు పతక ప్రదర్శనతో దేశంలో సంచలనంగా మారిన చైనీస్-అమెరికన్ ఫ్రీస్టైల్ స్కీయర్ ఎలీన్ గు కుటుంబ కథనంతో చాలా మంది మహిళలు ప్రేరణ పొందారు.

ఎలీన్‌ను స్వయంగా పెంచిన ఆమె తల్లి యాన్ గు, చైనీస్ ఒంటరి తల్లులకు మోడల్‌గా మారింది. ఆన్‌లైన్‌లో ప్రశంసలు అందుకుంది.

తనకు చిన్న కుటుంబాలు ఉన్న స్నేహితులు ఉన్నారని, అలాగే స్వలింగ సంపర్కులు, పిల్లలను కలిగి ఉండకూడదనుకున్న జంటలె స్నేహితులు ఉన్నారని యు చెప్పారు. ‘ఈ కుటుంబ నిర్మాణాలన్నింటినీ సాధారణమైనవిగా చూడాలి’ అని ఆమె అన్నారు.